పట్టుసాగు

Sericulture: పట్టు పురుగుల పెంపక గది శుద్ధి చేయు పద్ధతులు.!

0
Silkworm
Silkworm

Sericulture:                                                                                                            కొమ్మమే పధ్ధతి: చదరపు అడుగు గది వైశాల్యానికి 154 మిల్లీ లీటర్ల ద్రావణం చొప్పున పట్టుపురుగుల పెంపక గదికి మరియు పరిసరాలు శుద్దీకరణకు అవసరమౌతుంది. పై మోతాదులో 10 శాతం ద్రావణం పనిముట్లకు, పరికరాలకు మరియు 90 శాతం గది శుద్ధి చేయడానికి నిర్ధేశించబడిoది.

Sericulture

Sericulture

తట్టలలో మేపు పద్ధతి: చదరపు అడుగు గది వైశాల్యానికి 190 మిల్లీ లీటర్ల చొప్పున పట్టుపురుగులు మేపు గదికి పరికరాలు శుద్ధీకరణకు అవసరమౌతుంది. అందులో 35 శాతం పరికరాలకు, పనిముట్లకు మరియు 65 శాతం గది శుద్ధిచేయుటకు నిర్దేశించబడిoది.

పై రెండు పద్ధతులలో పురుగులు మేపు గది ఎత్తు 10 అడుగులుగా పరిగణించబడిoది. ఒక వేళ ఎత్తు అంతకంటే ఎక్కువ అయితే ఒక్కొక్క అడుగుకు 14 ml చొప్పున అదనంగా ద్రావణ పరిమాణాన్ని పెంచుకోవాలి. తక్కువైనచో తగ్గించుకోవాలి.

Silkworm Rearing Technology

Silkworm Rearing Technology

శుద్ధి చేయడానికి అనువైన సమయం ఏది?                                                        ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల మధ్య కాలము అనువైoది. ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల మంచి ఫలితం వస్తుంది. ప్రతి పంటకు రెండు సార్లు శుద్ధి కార్యక్రమం చేపట్టాలి. పంట గూళ్ళు అమ్మకం జరిగిన వెంటనే మొదటిసారి తిరిగి పంట ప్రారంభించడానికి 3-5 రోజులు ముందుగా రెండవసారి శుద్ధీకరణచేపట్టాలి.

శుద్ధిచేసే విధానo: శుద్ధి ప్రక్రియను రెండు దశలలో చేపట్టాలి.

మొదటి దశ: పంట పూర్తి అయిన తర్వాత మిగిలిన రోగకారకమైన, చెత్త చెదారం, పాడైన గూళ్ళ అవశేషాలన్నింటిని సేకరించి కాల్చివేయాలి. రేరింగ్ గదిని పరికరాలను శుద్ధిచేయడానికి 2 శాతం బ్లీచింగ్ పౌడర్ను 0.3 శాతం కాల్చిన సున్నంతో కలిపి వాడాలి. దీనికోసం 400 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ను 19 లీ నీటిలో బాగా కరిగించాలి. వేరొక పాత్రలో అరలీటరు నీటిలో 60 g కాల్చిన

సున్నoను కరిగించాలి. ఈ రెండు ద్రావణాలు కలిపి మిశ్రమమును పిచికారీ చేయడానికి ఉపయోగించాలి. బ్లీచింగ్ ద్రావణము బదులు క్లోరిన్డ డయాక్సైడ్ ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ ద్రావణం తయారు చేయు పద్ధతి ముందు పాఠ్యాంశంలో తెలియజేయడమైoది.

రెండవ దశ: చాకీకట్టడానికి, 5 రోజుల ముందు పైన సూచించిన విధంగా శుద్ధి ప్రక్రియను మరొక్క సారి చేపట్టాలి. పనిముట్లను ఎండలో ఆరబెట్టాలి.

పంట పూర్తి అయ్యాక పెంపకపు గదిని మామూలు నీటితో కడుగకూడదు. దీనివల్ల సూక్ష్మజీవులు గదిలోపలి గోడ రంధ్రాల చీలికల్లో చేరుకొని వృద్ధి చెందుతాయి. కాబట్టి శుద్ధద్రావణంతో గదిని శుభ్రం చేసిన తర్వాత మాత్రమే నీటితో కడుగుట చేయాలి.

శుద్ధికి వాడే తొట్టి: చాకీ కేంద్రాలకు, పెద్దరైతులకు తప్పనిసరిగా ఈ తొట్టి ఎంతో అవసరమౌతుంది. తొట్టి లోపలికొలతలు. 1/2 2 1/2, 21/2 అడుగులు వుండి అందులో సగం లోతువరకు నింపితే 300 లీటర్ల ద్రావణం పడుతుంది. తొట్టిలో సగం వరకే శుద్ధి ద్రావణాన్ని నింపాలి. తొట్టిని నింపటానికి 2 శాతం బ్లీచింగ్ పౌడరు + 0.3 శాతం కాల్చిన సున్నంతో కలిపిన ద్రావణాన్ని ఉపయోగించాలి.’ అన్ని పరికరాలను 10 నిముషాలపాటు ముంచి, తర్వాత ఆరబెట్టాలి. ద్రావణం కలుషితమైనచో దాన్ని తీసివేసి తాజాగా చేసిన ద్రావణంతో నింపాలి.

Also Read: Sericulture: చంద్రికలను ఎలా వాడాలి ?

ఇతర శుద్ధికారిణులు:                                                                                          ఐడో ఫోర్స్: ఇవి క్రిములను తాకగానే నేసెంట్ అయోడిన్ విడుదలై వాటిని చంపి వేస్తుంది. వీటివలన పరికరాలకు త్రుప్పుపట్టదు. మరియు ఇవి విషరహితo. ప్రస్తుతం అసీఫర్ అనే పేరుతో మార్కెట్ లో లభించే దీనిలో 1.6 శాతము క్రియాశీల అయోడిన్ ఉంటుంది. 1.5 శాతo అసీఫర్ ద్రావణo (లీటరు నీటికి 15 మి.లీ.) సాధారణంగా శుద్ధీకరణకు మంచి ప్రయోజనకారి.

సోడియం హైపోక్లోరైట్: ఇది బ్లీచింగ్ లక్షణంతో పాటు బలమైన ఆక్సిడైజింగ్ పదార్థంగా పనిచేస్తుంది. ఈ ద్రావణం పాలిపోయిన పసుపుపచ్చరంగులో ఉంటుంది. మత్తు కారకం కాదు. నీటిలో కరుగుతుంది. గాడ నిక్షిప్తరూపంలో క్లోరిన్ విడుదల కావడంవల్ల ఇది శుద్ధికారిగా పనిచేస్తుంది. ఇది దుస్తులకు, చర్మానికి హానికరం. 0.5 శాతము పిచికారీ చేయవచ్చు. గాలి దిగ్బంధనo అవసరo లేదు.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Disinfection in Sericulture: పట్టుపురుగుల పెంపకంలో రోగ నిరోధక చర్యలు.!

Must Watch:

Leave Your Comments

Prevent Ring Worm in Goats : మేకలలో వచ్చే తామర వ్యాధి ని ఇలా నివారించండి.!

Previous article

Pesticides Usage in Mulberry: మల్బరీ సాగు లో క్రిమిసంహారక మందులు ఎంత మోతాదు లో వాడాలి..

Next article

You may also like