SilK Production: మనుషులు ధరించే పట్టు బట్టలకు ప్రత్యేక స్థానం ఉంది. చైనాలో పట్టుపురుగుల పెంపకం ప్రారంభమైనట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆదేశంలో ఉత్పత్తి అయిన పట్టు వస్త్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేయటానికి ఒక సిల్క్ రూట్ మార్గాన్ని అనుసరించారు. ఇప్పుడు కూడా తమ ఎగుమతులను పెంచుకోవడానికి అదే సిల్క్ రూట్ ని పునరుద్ధరించే ప్రయత్నాలు చైనా చేస్తోంది. పట్టుపురుగుల పెంపకం చైనా నుంచి ఎప్పుడో భారత్ కు వచ్చింది. ఇప్పుడు పట్టు ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ దే రెండో స్థానం. మల్బరీ ఆధారిత పట్టుపురుగుల పెంపకంతో పాటు భారత్ లో టసర్, ఈరీ, మూగా, అనే వృక్షాల ఆధారిత పట్టు పెంపకం కూడా గణనీయమైన స్థాయిలో జరుగుతోంది
పెరుగుతున్న మల్బరీ సాగు
పట్టుగూళ్ల ధరలను బట్టి మల్బరీ సాగులో హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ మల్బరీ ఆధారిత పట్టు ఉత్పత్తిని పెరగడానికి మల్బరీ విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడి హెక్టార్ కు 300 నుంచి 800 కిలోలు వరకు వృద్ధి చెందటం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. దాదాపు 20 కిలోల మల్బరీ ఆకుల్ని 500 పట్టుపురుగులకు మేతగా వేయడం ద్వారా కిలో పట్టుగుళ్లు ఉత్పత్తి అవుతాయి. ఒకే పట్టు గూడు నుంచి 1500 నుంచి 2500 అడుగుల వరకు పట్టు దారం లభిస్తుంది. దీనిని బట్టి ఒక హెక్టార్ మల్బరీ తోట నుండి లభించే మల్బరీ ఆకు దాదాపు 40 వేల కిలోల బరువు ఉంటుంది. దీనిని బట్టి ఒక హెక్టార్ మల్బరీ తోట నుంచి దాదాపు 200 కిలోల పట్టుగూళ్ళు ఉత్పత్తి అవుతాయి. సుమారుగా 10 కిలోలు పట్టుగూళ్ల నుంచి ఒక కిలో ముడిపట్టు లభిస్తుంది.
ప్రస్తుతం కిలో పట్టుగూళ్ల ధర 400 వరకు ఉంది. ముడిపట్టు ధర దాదాపుగా కిలో 4000 పలుకుతోంది. ఇక పట్టు చీరలైతే నేతను బట్టి వాడే జరీని బట్టి వేలల్లో ఉంటాయి. ఒక ఆడ పట్టుపురుగు 300 నుంచి 500 వరకు గుడ్లును పెడుతోంది. భారత్ లో మల్బరీ పట్టుతో పాటు వన్య పట్టు కూడా ముఖ్యమైనది. మల్బరీలోని రైతులు సాగు చేసి పట్టుపురుగులను పెంచుతారు. కానీ వృక్షాల ఆధారంగా లభించే పట్టుని సహజ ప్రకృతి నుంచి సేకరిస్తారు. టసర్ పట్టుని పశ్చిమబెంగాల్లో ఈరీ, మూగా పట్టుని అస్సాం ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా సేకరిస్తారు.
Also Read: సేంద్రియ సాగుతో ఏడాదికి రూ.21 కోట్ల ఆదాయం.!
సమగ్ర అనే పథకం అమలు
దేశంలో పట్టు ఉత్పాదకతను నాణ్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర అనే పథకాన్ని అమలు చేస్తోంది. కిసాన్ నర్సీరీలను ప్రోత్సహిస్తూ, ఆధిక దిగుబడినీ, నాణ్యతను ఇచ్చే మల్బరీ రకాలను రైతులకు అందించడం, మల్బరీ తోటలకు నీటి వసతిని కల్పించడం, చాకీ సెంటర్లను ఏర్పాటుచేయడం, అధునాతమైన షెడ్డులను నిర్మించడం, సిల్క్ రీలింగ్ కేంద్రాల ఏర్పటును ప్రోత్సహించటం, పట్టుగూళ్ల మార్కెట్ లో ఈ మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయటం, సమగ్ర పథకంలోని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశంలో కర్ణాటక రాష్ట్రం మల్బరీపట్టు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. కర్ణాటకలోని 8,483 టన్నుల మల్బరీ పట్టు ఉత్పత్తి అవుతుంది. 5,528 ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో ఉండగా, అస్సాం 5038 టన్నుల ఉత్పత్తితో మూడో స్థానంలో ఉంది.
తెలంగాణలో కేవలం 166 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. తర్వాత తమిళనాడు మేఘాలయ జార్ఖండ్ మణిపూర్ పశ్చిమబెంగాల్ మహారాష్ట్ర చత్తీస్ ఘడ్, నాగాలాండ్ రాష్ట్రాలలో పట్టు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. జన్యు మార్పిడి మల్బరీ రకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో ఉన్న ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సెంట్రల్ సిల్క్ బోర్డు రాష్ట్రాలలో ఉన్న సంస్థలు శాఖలు ఉమ్మడిగా కృషి చేసి పట్టుగూళ్ల ఉత్పత్తిని హెక్టారుకు వెయ్యి కిలోల వరకు తీసుకెళ్తే లక్షలాది మంది రైతుల ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది.
Also Read: ఆసియాలో అతిపెద్ద కూరగాయలు, పండ్ల మార్కెట్ ఎక్కడ ఉందో తెలుసా.!