సేంద్రియ వ్యవసాయం

Organic Cultivation: సేంద్రియ సాగుతో ఏడాదికి రూ.21 కోట్ల ఆదాయం.!

2

Organic Cultivation: రసాయనాలతో కూడిన ఆహారం తినడం వల్ల అనారోగ్య బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్నందున అనేక వ్యాధుల బారిన పడి ఇబ్బంది ఎదుర్కొన్న ఒక బ్యాంక్ ఉద్యోగి వినూత్నంగా ఆలోచించి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ప్రారంభించాడు. ఈ విధానం ద్వారా ఏడాదికి దాదాపు రూ.21 కోట్ల వ్యాపారాన్ని అతను కొనసాగుతుండటం గమనార్హం.

అమిత్ కిషన్ అనే వ్యక్తి బెంగళూరులోని పలు బ్యాంకుల్లో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కేవలం ఆహారం కోసం సాంప్రదాయ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఉద్యోగంలో భాగంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ లో చాలా వరకు క్యాన్సర్ మరణాలే కావడంతో సేంద్రియ వ్యవసాయాన్ని సవాల్ గా తీసుకొని సక్సెస్ అయ్యాడు. తద్వారా ఆహారాన్ని పండించడం, దానిని వినియోగించే విధానంలో విప్లవాత్మ మార్పులకు శ్రీకారం చుట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం స్థిరమైన పద్ధతిలో చేయాలని తన నాలుగేళ్ల జీరో బడ్జెట్ వ్యవసాయం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. తాము ప్రతి సహజ పద్ధతిలో పండిస్తామని దీర్ఘకాలంలో నేల సురక్షితంగా ఉండేలా రసాయన ఎరువులు ఉపయోగించబోమని పేర్కొన్నారు.

అలాగే వ్యవసాయానికి దేశీ ఆవు పేడ, గోమూత్రం వినియోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మట్టిని దున్నటానికి మరియు చెక్కతో వత్తిన నూనెను ఉత్పత్తి చేయడానికి ఎద్దులను ఉపయోగిస్తారు. స్థానిక విత్తనాలను భూమి మనకు ఇచ్చిన వాటిని మాత్రమే పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సహజంగా నేడు పండే
ఏ పంటైన వివిధ రకాల కెమికల్స్ తో కూడుకున్నదని అర్థమవుతుంది. తద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. అయితే అమిత్ మాత్రం దేశీయంగా పండించిన పంటలను మాత్రమే వినియోగిస్తున్నారు.

ఇందులో వివిధ రకాల బెండకాయలు, వేరుశనగ, గంగాభవాని కొబ్బరి, తెల్ల పావురం, బఠాణి, ఆకుపచ్చ, ఊరద్ లతో పాటు తన పేరుతో అమిత్ పాల ఉత్పత్తులు మరియు కూరగాయలు, దాదాపు 40 రకాల ఆహార పదార్థాలను పండిస్తుండడం గమనార్హం. ఇందులో నూనెలు, రోజు ఆరు టన్నుల కూరగాయలు, 1500 లీటర్ల పాలను విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు అతను బెంగళూరులో ఒక స్టోర్ మరియు అతని వెబ్సైట్ ద్వారా రోజూ మూడు లక్షల మంది కస్టమర్లను హ్యాండిల్ చేస్తున్నారు.

Also Read: ఆసియాలో అతిపెద్ద కూరగాయలు, పండ్ల మార్కెట్ ఎక్కడ ఉందో తెలుసా.!

Organic Farming for Sustainable Agriculture

Organic Cultivation

ఎనిమిది సంవత్సరాల కాలంలో అమిత్ బెంగళూరులోని ఐసిఐసిఐ, బజాజ్ ,యాక్సిస్ ,హెచ్ డి ఎఫ్ సి, నేషనల్ బ్యాంక్ వంటి అనేక బ్యాంకులలో పనిచేశాడు . ఎప్పుడు తాను తన మూలాల్లోకి వెళ్లి తన తాతగారి వృత్తి అయిన వ్యవసాయం చేయాలని భావించలేదు . అయితే వ్యవసాయంలో ప్రత్యేకత చాటుకున్న వాళ్ళ తాతను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయన పలు వివరాలు అందించారు. కార్పొరేట్ రంగానికి విడిచిపెట్టి తాత అడుగుజాడలను అనుసరించాలని ప్రేరణ తనకు వచ్చిందంటే తన బ్యాంకులో పనిచేసే సమయంలో క్యాన్సర్ తో ఓ వ్యక్తిని కోల్పోయినప్పుడు కలిగిందన్నారు . అతని ద్వారా తనలో కొత్త ఆలోచన కలిగిందని మన జీవన విధానం ఎలా ఉంది, మనం ఏమి తింటున్నామో అనే ఆందోళన కలిగించే విషయాలను సరిదిద్దుకోవాలని ఆలోచనలో పడ్డాడు.

2016లో ఉద్యోగాన్ని వదిలి రైతుగా మారి కొత్త సాంప్రదాయ వ్యవసాయానికి నాంది పలికారు. మూడేళ్ల పరిశోధన, అభివృద్ధి తర్వాత తన సోదరుడు ఆశ్రిత్ తో కలిసి 2019లో హెబ్బా ఫామ్ హౌస్ ను స్థాపించారు. వ్యవసాయం లోని సందేహాలను అర్థం చేసుకోవడానికి తాము చాలా మంది సేంద్రియ రైతులను కలిసినట్లు వివరించారు. సహజ వ్యవసాయాన్ని అభ్యసించడం ఎంతో సవాలతో కూడుకున్నదని పేర్కొన్నారు.

పరిసర పొలాల్లో రైతులందరూ ఆహారాన్ని పండించడానికి రసాయనాలు ఉపయోగిస్తున్నారని తాము రసాయనాలు లేకుండా ఆహారాన్ని పండించడం ప్రారంభించిన సమయంలో తాను ఫుల్ గా చాలామంది ప్రజలు అభివర్ణించి నవ్వే వారన్నారు. తమ పొలం మనుగడ కోసం పక్క పొలం రైతులకు కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని తాను అవలంబించిన సహజ పద్ధతిలో వేరు ఎదుగుదల కోసం నాలుగు అడుగులు మట్టిని దున్నటం, మట్టిలో పొటాషియం స్థాయిలను పెంచడం, ఆవు పేడ, ఆవు మాత్రం, అరటి పండ్లు వేసి పొలానికి బలాన్ని ఇస్తున్నట్లు పేర్కొన్నారు .

ఫలితంగా తమ మట్టిలో వానపాములు వచ్చాయని పేర్కొన్నారు. వ్యవసాయంలో ఉపయోగించే రసాయనాల కారణంగా ఇది చాలా అరుదుగా మారిందని పేర్కొన్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో గిర్రు, సాహివాల్ మరియు జఫ్ఫా బడి తో సహా 700 దేశవాళీ ఆవులు మరియు గేదెలు ఉన్నాయి. ఆవులు, గేదెలు మరియు ఎద్దులు సహజ వ్యవసాయం చేయడం పాల ఉత్పత్తులను విక్రయించడం బయోగ్యాస్ తయారు చేయడం మరియు వ్యవసాయాన్ని పర్యావరణాన్ని పెంచడంలో మాకు సహాయపడతాయని వివరించారు.

వ్యవసాయం చేసే సమయంలో నెల వారి విద్యుత్ ఖర్చు మూడు లక్షల వచ్చేదని , సౌర విద్యుత్ ద్వారా 40 వేల రూపాయలకు తగ్గించినట్లు వివరించారు. కోటిన్నర రూపాయలు అప్పుతో 15 ఎకరాల వ్యవసాయ భూమితో ప్రారంభించిన సాంప్రదాయ వ్యవసాయం నేడు 650 ఎకరాల వ్యవసాయ భూమిగా విస్తరించి తన క్షేత్రం నుంచి 21 కోట్ల రూపాయల వార్షిక ఆదాయాని పొందుతున్నట్లు పేర్కొన్నారు.

అమిత్ గ్రామీణ మహిళల సైన్యంతో కలిసి పని చేస్తారు. ఇప్పటివరకు చిన్నమంతురు , మావుటూరు, పెద్దమంతూరు, రద్దం, మడకశిర తదితర 18 గ్రామాలకు చెందిన మూడు వేల మంది మహిళలకు ఉపాధి కల్పించారు. తన సాంప్రదాయ వ్యవసాయంలో వచ్చే నెయ్యి ,పన్నీరు ఇతర పాల ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రతి మహిళకు 25 లీటర్ల పాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

చాలామంది గ్రామీణ మహిళలు సాధికారత పొందారని భావిస్తున్నప్పటికీ రైతుగా మారాలని తన నిర్ణయమే ఉత్తమ ఎంపిక అని అభిప్రాయపడ్డారు. నిత్యం కాలుష్యంతో హడావిడి చేసి ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం 8 గంటల వరకు తిరిగి ఇంటికి వచ్చేవాడిని బర్గర్లుపై ఆధారపడే వారిని అయితే ప్రస్తుతం నేను ప్రశాంతమైన జీవితాన్ని, నిదానంగా జీవితాన్ని గడుపుతున్నారు, నా కుటుంబంతో తగినంత నాణ్యమైన సమయాన్ని గడుపుతున్నారని చెప్పుకొచ్చారు.

Also Read: పెరటి కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్న నిరుద్యోగులు

Leave Your Comments

Azadpur Mandi: ఆసియాలో అతిపెద్ద కూరగాయలు, పండ్ల మార్కెట్ ఎక్కడ ఉందో తెలుసా.!

Previous article

SilK Production: పట్టు ఉత్పత్తిలో స్వావలంబనకు అవకాశాలు.!

Next article

You may also like