పట్టుసాగు

Sericulture: చంద్రికలను ఎలా వాడాలి ?

1
Sericulture
Sericulture

Sericulture: ప్లాస్టిక్ చంద్రికలు (నేత్రికలు): ఇటీవల కాలంలో నేత్రికలు వాడకం చాలా ఎక్కువైనది. దీనికి ముఖ్యకారణం గూళ్ళ అల్లికను కూడా పురుగులు పెంచిన పడకలపైనే నిర్వహించుకునే సౌలభ్యం అంతే గాక నేత్రికల వాడకం వలన సమకూరే లాభాలు, నేత్రికలును వాడే పద్దతి చాలా సులభతరము. స్పిన్నింగ్ దశల్లో కూలీల ఖర్చును గణనీయంగా తగ్గించుకునే అవకాశం స్పిన్నింగ్ దశలో అవసరమైన వాతావరణoను నియంత్రించుకొనుటకు వీలు కలుగుతుంది.

నేత్రికలలో అలబడిన గూళ్ళను సులభంగా విడిపించుటకు యంత్రాలు కూడా అందుబాటులో ఉండుంట ఈ ప్లాస్టిక్ నేత్రికలు పెద్ద పెద్ద రంద్రాలను గలిగియుండి అనేక మడతలు కలిగి మడతల మధ్య 6 సెం.మీ. ఎత్తుకలిగిన ఒంపులు కలిగి ఉంటాయి.ఈ ఒంపులు గూళ్ళు అల్లటానికి అనుకూలంగా ఉంటాయి. సాధారణముగా ప్రతినేత్రిక 2 కి 3 అడుగుల కొలతు కలిగియుండి 300-350 పురుగులు గూళ్ళు అల్లుటకు అనువుగా ఉంటాయి.

ప్లాస్టిక్ చంద్రికలు (నేంత్రికలు) వాడే విధానo: 45 శాతం మాగిన పురుగులు కనిపించిన సమయంలో పడకలపై సున్నం పొడిని చల్లి, పలుచటి మేతను ఇవ్వాలి.అమౌంటింగ్ నెట్లను పడకలపై పరచి నేత్రికలను నెట్లపై పరచాలి. 6-8 గంటల తరువాత గమనించి నేంత్రికలపై పురుగులు సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నవని అనిపిస్తే ఉన్న వరుసల పై మరియొక్క వరుస నేత్రికలు వ్యతిరేక దిశలో అమర్చాలి.గదిలో మంచి గాలి ప్రసరణ ఉండేలాగ చూసుకోవాలి.

Also Read: Techniques in Paddy Drying: ధాన్యం ఆరబెట్టుటలో కొన్ని మెళుకువలు.!

Sericulture - Chandikas

Sericulture – Chandikas

3 రోజుల తర్వాత మౌటింగ్ నెట్లను, నేత్రికలలో పాటు సన్నని తాళ్ళతో లేపి స్టాండు కొయ్యలకు వ్రేలాడదీయాలి. లేదంటే నేత్రికలను పడకల నుండి వేరు చేసే నేలపై గానీ స్టాండు అరలపై గాని అమర్చుకోవాలి.చీమలు ఎలుకలు ఉడతలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.సి.ఎస్.ఆర్.టి.ఐ మైసూరు వారు రూపొందిచిన మేకల నుండి గూళ్ళు విడిపించుటకు ప్రత్యేకమైన యంత్రము కూడ రైతులకు అందుబాటులో ఉన్నది.

గూళ్ళు విడిపించన తర్వాత నేత్రికలను 2% బ్లీచింగ్ ద్రావణం (100 లీటర్ల నీటికి 2 కిలోల బ్లీచింగ్ పాండి మరియు 300 గ్రాముల సున్నం పొడి) లో 23 గం. ఉంచి శుభ్రపరచి ఆరబెట్టాలి.శుభ్రపరచిన నేత్రికలను 8 నుండి 10 చొప్పున మడచి కట్టలుగా కట్టి నిల్వయుంచు కొనవచ్చు. నేత్రికల మడతలు సాగకుండుటకు ఒక చివరినుండి మరియొక చివరకు ప్లాస్టిక్ దారంతో కట్టుట మంచిది.

రోటరీ చంద్రికలను ఎలా వాడాలి?

రోటరీ చంద్రికలు రెండు భాగాలను కలిగి ఉంటాయి. చెక్క ఫ్రేమ్ మరియు క్బార్డ్ చంద్రికలు, ఒక్కో ఫ్రేమ్ లో 10 కార్డ్ బోర్డులు పడతాయి.ఒక్కో బోర్డు లో 13 వరుసలు కలిగి 12 విభాగాలుగా 156 గదులను కలిగివుంటాయి. ఒక్క సెట్లో 1560 పురుగులను ఉంచవచ్చు.మాగిన పురుగులను వేయడానికి ఒక రోజు ముందు ఫ్రేమ్ లను అమర్చి సిద్దo చెయ్యాలి.మాగిన 1250 పురుగులను లెక్కించి తీసుకొని వాటి తూకము లేదా పరిమాణo ను తెలుసుకోవాలి.

అదే పరిమాణంలో మాగిన పురుగులను రోటరీ ఛంద్రికలపై వెయ్యాలి.వేసిన 3-4 గంటల తర్వాత రోటరీ చంద్రికలను ఇనుప కడ్డీల సహాయంతో పైకప్పుకు వేలాడదీయాలి.100 గ్రుడ్ల పురుగులకు 35 సెట్లు సరిపోతాయి.చంద్రికలలో వేసిన 5 లేదా 6వ రోజు, చెక్క పుషర్ సహాయంతో గానీ, కాలితో వాడు యంత్రంతో గానీ విడిపించాలి.గూళ్ళపై పీచు తీయు యంత్రాల సహాయంతో గూళ్ళపై గల పీచును తొలగించాలి.

గుళ్ళు మార్కెట్ కు వెళ్ళే ముందు తీసుకోవలసిన జాగ్రతలు:

గూళ్ళు విడిపించిన తరువాత, జల్లి గూళ్ళు, డబుల్ గూళ్ళు వేరు చేయాలి. లేని ఎడల మీ గూళ్ళు తక్కువ ధరకు వేలం పాడే అవకాశం ఉంది. పట్టు గూళ్ళు సైజ్ లో అసమానతలు ఉంటే చిన్న గూళ్లను పెద్ద గూళ్లను వీడి వీడి గా వేరు చేసి సంచులలో వేసి మార్కెట్ నందు రెండు లాట్ లు గా ఉంచాలి. అప్పుడు పెద్ద గూళ్ళ కు ఒక రేటు, చిన్న గూళ్ళకు ఒక రేటు వచ్చి మొత్తం మీద మీకు లాభం చేకూరుతుంది. గూళ్లను వదులుగా సంచిలలో వేసి రవాణా చేయాలి.

Also Read: Fungal Diseases in Crops: శిలీంధ్రాలతో వచ్చే తెగుళ్లు మరియు వాటి తెగులు లక్షణాలు.!

Leave Your Comments

Drip Irrigation: డ్రిప్ ఇరిగేషన్ లో ఏ ఎరువులు అందిస్తారు.!

Previous article

Milking Methods in Dairy Cattle: పాడి పశువులలో పాలు పిండు పద్ధతులు

Next article

You may also like