ఆహారశుద్ది

Techniques in Paddy Drying: ధాన్యం ఆరబెట్టుటలో కొన్ని మెళుకువలు.!

2
Techniques in Paddy Drying
Techniques in Paddy Drying

Techniques in Paddy Drying: సాధరణంగా పంటను ఎక్కువ తేమ శాతము అనగా 24 నుండి 25 శాతం ఉన్నప్పుడు కోయటం జరుగుతుంది. దీని ద్వారా ధాన్యము రాలిపోయే శాతం తగ్గి పంటకోతల సమయంలో జరిగే ధాన్యం నష్టం తక్కువ అవుతుంది. కానీ ధాన్యమును సురక్షితముగా ఎక్కువ కాలము నిలువ ఉంచవలెను తేమ శాతము 12 నుండి 14 వరకు తగ్గించవలసి ‘ ఉంటుంది. ధాన్యములను ఎక్కువ కాలం నిలువ ఉంచుటకు మరియు నాణ్యతను కాపాడుటకు, ధాన్యం లోని తేమ శాతం అనువుగా తగ్గించు విధానం “ఆరబెట్టుట” (Drying) అంటారు.

ఎక్కువ శాతం ధాన్యమును బయట ప్రదేశం లో ఎండలో ఎండబెట్టుట ద్వారా తేమ శాతమును తగ్గిస్తారు. కాని అన్ని పరిస్థితులలో ఈ పద్దతిపై ఆధారపడలేదు. ఎందుచేతననగా పంట కోతల సమయంలో కురిసే ఆకాల వర్షాల కారణంగా ధాన్యం నందు తేమ శాతాన్ని నియంత్రించుట సాధ్యము కాని సందర్భములలో ధాన్యం చెడిపోయు నష్టము వాటిల్లే ప్రమాదమున్నది. కావునా అటువంటి సందర్భాలలో ఆధునిక పద్ధతులు| నవలంబించి ఎక్కువ పంటను తక్కువ కాలం లోను మరియు తక్కువ నష్టంతో ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా గింజల యొక్క తేమ శాతం కావలసినంత వరకు తగ్గించుకోవచ్చు. తద్వారా ఎక్కువ రోజులు ధాన్యం నిల్వ చేసుకోవచ్చు.

Also Read: Fungal Diseases in Crops: శిలీంధ్రాలతో వచ్చే తెగుళ్లు మరియు వాటి తెగులు లక్షణాలు.!

Techniques in Paddy Drying

Techniques in Paddy Drying

ధాన్యం ఎండలో ఎండబెట్టుట:

ఇది మూడు విధాలుగా జరుగుతుంది.

1. గింజలు బాగా పరిపక్వత చెందిన తర్వాత పైరుని కోయకుండా పొలం మీదా గింజల నిల్వకు అనుకూలముగా అయిన తేమ శాతం వచ్చేవరకు (12-14 శాతం)

ఆగి, తర్వాత కోత కోసి గింజలను వేరుచేయుట జరుగుతుంది. ఈ విధంగా చేయుట వలన సుమారు 12 నుండి 15 శాతం వరకు గింజలు రాలిపోవుట జరుగుతుంది. ఈ పద్దతిలో ఎండబెట్టుట ద్వారా పంట పరిపక్వత చెందిన తరువాత సుమారు 3 వారాల వ్యవది తీసుకుంటుంది.

2. గింజలు పరిపక్వత చెందిన తరువాత అధిక శాతం తేమ ఉన్నపుడే కోత కోసి పైరుతో సహా కల్లము నందు తగు తేమ శాతం వచ్చేవరకు అరబెట్టుట ఈ పద్దతి యందు ఎక్కువ స్థలము అవసరమవుతుంది. ఈ పద్దతి యందు పంటను చిన్న చిన్న కట్టలుగా చేసి కూడా ఎండబెట్టవచ్చు.

3. గింజల పరిపక్వత చెందిన తరువాత అధిక శాతం తేమ ఉన్నపుడే కోతకోసి గింజలు వేరుచేసి కల్లములో పలుచగా పరిచి ఎండబెట్టుట లేక ఆరబెట్టుట ద్వారా మిగతా పై రెండు పద్ధతులలో కన్నా త్వరగా ఆరబెట్టవచ్చు. ఈ పద్ధతి యందు ఆరబెట్టుటకు తక్కువ స్థలం సరిపోతుంది.

ఉపయోగాలు:

సౌరశక్తి సులబమైన, ఖర్చులేని, అందుబాటులో ఉండే శక్తి,సూర్యరశ్మి ఎక్కువగా లభించు ప్రాంతములలో ఈ పద్ధతి ద్వారా గింజలను ఆరబెట్టుట శ్రేయస్కారం, ఈ విధంగా ఎండబెట్టుటలో ఇంధనము గాని లేక యంత్రము గాని అవసరంలేదు.

నష్టాలు: సూర్యరశ్మిపై పూర్తిగా ఆధాపడవలసి ఉండును. ముఖ్యముగా ఋతుపవనము లోసూర్యరశ్మి ఉండును. గింజలను కల్లములో ఎండబెట్టుటకు ఎక్కువ మంది అవసరo.గింజలు ఈ పద్దతి మూలంగా ఎండబెట్టుట వలన ఎలుకలు, పందికొక్కులు, పక్షుల మూలంగా నష్టం వాటిల్లే ప్రమాదమే కాక ధాన్యం నాణ్యత తగ్గిపోవును.ఎండ తీవ్రతను అదుపు చేయలేము కనుక గింజలు సమముగా ఆరవు.

Also Read: Integrated Pest Management in Sugarcane: చెఱకు పైరు నాశించు తెగుళ్ల సమగ్ర యాజమాన్య చర్యలు.!

Leave Your Comments

Fungal Diseases in Crops: శిలీంధ్రాలతో వచ్చే తెగుళ్లు మరియు వాటి తెగులు లక్షణాలు.!

Previous article

Drip Irrigation: డ్రిప్ ఇరిగేషన్ లో ఏ ఎరువులు అందిస్తారు.!

Next article

You may also like