Silkworms Cultivation: సాంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటి గా మారిందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం పట్టు పరిశ్రమల శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని కొంతమంది రైతులు సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందుతున్నారు. పట్టు పురుగుల పెంపకంతో రైతులు మంచి లాభాలను కళ్ల చూస్తున్నారు. తక్కువ పెట్టుబడి కొద్ది సమయంలో అధిక దిగుబడిని సాధిస్తున్నారు. సంప్రదాయ పంటలతో నష్టపోయిన రైతులు పట్టు పురుగుల పెంపకం తో ఆశిస్తున్న దిగుబడులతో లాభాలను అర్జిస్తున్నారు. దీంతో పెంపకం లాభసాటి గా మారింది. కొంత మంది రైతులు ఈపంటలను వేసి లాభాల బాటలో పయనిస్తున్నారు
25,000 మొక్కల పెంపకానికి సబ్సిడీ
పట్టు పురుగుల రకాల్లో ఒకటైన మల్బరీ పట్టుపురుగుల పెంపకాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వం రూ. 25,000 మొక్కల పెంపకానికి సబ్సిడీ అందజేస్తుంది. దీంతో రైతులు అనుకూలమైన నేలల్లో వీ1 రకానికి చెందిన మల్బరీ మొక్కలను డ్రీప్ సహయంతో సాగు చేశారు. ప్రభుత్వ సహకారంతో మొక్కలను కొనుగోలు చేసి కూలీల ఖర్చులతో కలిపి ఒక్క మొక్క పెంపకానికి రూ.పది వరకు ఖర్చు చేశారు. పట్టుపురుగుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం ఇస్తోంది.
Also Read: World Nature Conservation Day 2023: సమస్త ప్రకృతికి ప్రణామం..
మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో రైతులు అన్ని వసతులతో కూడిన రేరింగ్ షెడ్లను నిర్మించుకున్నారు. వీరికి రూ.రెండు లక్షలు సబ్సిడీ వచ్చింది. వాటిలో పెంపకానికి కావాల్సిన బెడ్స్, ట్రేలను అమర్చారు. బెడ్స్ పై పట్టు పురుగులను ఉంచి వాటికి మల్బరీ ఆకులు వేసి పెంచుతున్నారు. ఈగలు, రెక్కల పురుగులు, పక్షులు లోపలికి వెళ్లకుండా నైలాన్ తెరను ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా పంటను కాపాడుకుంటున్నారు. పట్టు పురుగుల సాగు అతి తక్కువ సమయంలోనే చేతికొస్తుంది. కేవలం 21 రోజుల్లోనే పట్టు పురుగులు పట్టు కాయలుగా మారిపోతాయి. పట్టు పురుగులకు అల్లుకున్న గూళ్లను మార్కెట్లో అమ్ముకోవచ్చు. దీంతో రైతు ఒక నెలలో మంచి దిగుబడి తో పాటు లాభాలను ఆర్జించవచ్చు. మల్బరీ పట్టు పురుగుల పెంపకం తో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
పట్టు పురుగుల పెంపకం తో మంచి లాభాలను పొందొచ్చు. గత ఆరు నెలలుగా పట్టుపురుగుల పెంపకాన్ని నిర్వహించి అధిక దిగుబడులను తీస్తున్నారు. గతంలో అనేక పంటలను సాగు చేసి నష్టపోయాన రైతులు ఇప్పుడు పట్టు పురుగుల పెంపకం పై దృష్టి సారించి ప్రభుత్వం అందించే సబ్సిడీని ఉపయోగించుకుంటూ లాభాలను పొందుతున్నారు.
మొదటి పంటలోనే 250 కిలోల పట్టు కాయలను విక్రయించి మంచి లాభాలను పొందామని అంటున్నారు. మల్బరీ పట్టు సాగును మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తామని 21 రోజుల్లోనే పంట చేతికి రావడం, పట్టు కాయలకు మంచి డిమాండ్ ఉండటంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను సాధించొచ్చని అధికారులు అంటున్నారు. పట్టు పరిశ్రమశాఖాధికారులు సాగు చేస్తున్న పట్టు పురుగుల పెంపకం షెడ్లను పరిశీలించి వాటి ఉత్పత్తిని రైతులకు వివరించడంతో పాటు అవగాహన కల్పించారు. అనతి కాలంలోనే పట్టు పురుగుల పెంపకంలో రాణించి ఆదర్శంగా నిలిచిన వారిని అభినందించారు.
Also Read: IoTech World Avigation Drone: ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్ డ్రోన్ మోడల్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్.!