వార్తలు

World Nature Conservation Day 2023: సమస్త ప్రకృతికి ప్రణామం..

1
World Nature Conservation Day 2023
World Nature Conservation Day

World Nature Conservation Day 2023: విశాల విశ్వంలో భూమిపై ఉన్న ప్రకృతి మాత్రమే జీవకోటికి అవసరమైన నీరు, ఆహారం, ప్రాణవాయువు అందిస్తుంది. సకల జీవరాశిలో మానవుల వాటా తక్కువ, కానీ ప్రకృతికి మానవుడు చేసే హని మాత్రం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతిని పరిరక్షించడం, భూమి మీద ఉన్న సహజ వనరులు క్షీణించకుండా కాపాడటం, జీవవైవిధ్యాన్ని సంరక్షించడం అనే ప్రాముఖ్యతను ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడానికి కొన్ని సంస్థలు చాలా కృషి చేస్తున్నాయి. సుస్థిరమైన జీవనం కోసం ప్రజలందరూ సమిష్టిగా తీసుకోవాల్సిన చర్యలను ప్రేరేపించడానికి పర్యావరణ సమతుల్యత అనేది చాలా అవసరం. ఎందుకంటే మానవ చర్యలు పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా, ప్రకృతిలోని సహజ వనరులన్నీ హరించుకుపోయేలా చేస్తున్నారు. భవిష్యత్తులో మనుగడ చాలా కష్టంగా మారుతుంది. ప్రకృతిని కాపాడటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి.

ప్రకృతి ప్రాముఖ్యత గురించి అనేక కార్యక్రమాలు

ప్రకృతిని సంరక్షించడం కోసం చెట్లను నాటడం, రీ సైకిల్ చేసిన ఉత్పత్తులను ఉపయోగించడం వంటివి చేయాలి. మనం పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం చర్యలు కొనసాగించాలి. నీటి కాలుష్యం, నేల కాలుష్యం, కరువు, వరదలు, వన్యప్రాణులు అంతరించిపోవడం మరియు సహజ వనరులు క్షీణించడం వల్ల ఇతర వినాశకరమైన ప్రభావాల వల్ల తీవ్రమైన పరిణామాలను ఎదురు కొంటున్నందున ప్రపంచవ్యాప్తంగా అన్ని స్థాయిలలో పరిరక్షణ ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు విద్యా సంస్థలు ప్రకృతి ప్రాముఖ్యత గురించి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. స్థిరమైన జీవనం వైపు గణనీయమైన మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించాలి. మనం ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వవచ్చు.

Also Read: IoTech World Avigation Drone: ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్ డ్రోన్ మోడల్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్.!

World Nature Conservation Day 2023

World Nature Conservation Day 2023

మాతృభూమిని రక్షించడం మన కర్తవ్యం

ప్రపంచం మొత్తం వాతావరణ మార్పుల పరిణామాలను ఎదుర్కొంటోంది. మరియు ప్రకృతిని పరిరక్షించడం ద్వారా మాతృ భూమిని రక్షించడం మన కర్తవ్యంగా భావించాలి. సహజ వనరులను నిర్లక్ష్యంగా చేయకుండా వాటిని పరిరక్షించుకోవాలి. దీని వల్ల భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చు. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అన్ని ప్రాంతాల్లో సహజ వనరులు, జీవవైవిధ్యం మరియు జీవావరణ శాస్త్రాన్ని పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్థిరమైన భవిష్యత్తు కోసం పర్యావరణ సమతుల్యత మరియు జీవవైవిధ్యాన్ని నిర్వహించడానికి మన సహజ వనరులను మనం కాపాడుకోవాలి. సహజ వనరులు క్షీణించడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు, సెమినార్లు మరియు ప్రచారాలు నిర్వహించబడతాయి.

Also Read: Telangana Rains: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఏడాదంతా కురవాల్సిన వాన ఒక్కరోజులోనే..

Leave Your Comments

IoTech World Avigation Drone: ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్ డ్రోన్ మోడల్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్.!

Previous article

Silkworms Cultivation: సిరులు కురిపిస్తున్న పట్టు పురుగుల పెంపకం.!

Next article

You may also like