మన వ్యవసాయం

Redgram Cultivation: కందిసాగుకి అనుకూల పరిస్థితులు

2
Red Gram
Red Gram

Redgram Cultivation: కంది మనరాష్ట్రంలో దాదాపు 11.25 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ, 2.02 లక్షల టన్నుల ఉత్పత్తి నిస్తుంది. ఎకరాకు 180 కిలోల సరాసరి దిగుబడినిస్తుంది. ప్రత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్‌లో పండించవచ్చు. కందిని సాధారణంగా తొలకరిపంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగు చేస్తుంటారు. కందిని రబీలో కూడా పండించవచ్చు.

Redgram Cultivation

Redgram Cultivation

Also Read: గుమ్మడి పెంకు పురుగు నష్ట లక్షణాలు

రబీ కంది సాగుకి అవకాశాలు:

  1. కారణాంతరాల వల్ల తొలకరిలో ఏ పైరు వేసుకునేందుకు అవకాశం లేని ప్రాంతాలు
  2. అధిక వర్షాలకు, బెట్టకు మొదటి పంట పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాలు.
  3. తొలకరిలో స్వల్పకాలిక పంటలు (పెసర, మినుము లాంటివి) వేసుకుని రెండవ పంటగా కంది వేసుకోవచ్చు.
  4. స్వల్పకాలిక వరి రకాల తర్వాత కూడా కందికి అవకాశముంది. అయితే అక్టోబర్‌ తర్వాత కంది విత్తకూడదు.
  5. తొలకరి కంది ఎక్కువ ఎత్తు పెరగటం వలన ఈ పంటను ఆశించే కాయ తొలుచు పురుగు మరియు మరుకా మచ్చల పురుగుల నివారణ కష్టమౌతుంది. రబీ కంది, అనువైన ఎత్తులో వుండటం వలన సస్యరక్షణ చర్యలు చేపట్టటం తేలిక. రబీ కంది జనవరిలో పూతకొస్తుంది. ఈ సమయంలో శనగపచ్చ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. కాబట్టి పురుగును తట్టుకుంటుంది.
Redgram

Redgram

రబీ కందికి అనువైన ప్రాంతాలుః దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాల్లో ఈశాన్య ఋతుపవనాల వల్ల కురిసే వర్షాలనుపయోగించుకొని రబీ కందిని వర్షాధార పంటగా సాగుచేయవచ్చు. ఈ జిల్లాలే కాకుండా గోదావరి నది వరద తాకిడికి గురయ్యే వరంగల్‌ మరియు ఖమ్మం జిల్లాల్లో వరద పోయిన తర్వాత రబీ కంది సాగుకు అనుకూలం. శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ మరియు నాగార్జునసాగర్‌ ఆయకట్టు ప్రాంతాల్లో కూడా కందిని ఆరుతడి పంటగా పండించవచ్చు. నీటి వసతి ఉంటే మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సాగుచేయవచ్చు.

అనుకూల పరిస్థితులు

కంది అత్యంత కరువు-నిరోధక పంట. ఇది 65 సెం.మీ వార్షిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో విజయవంతంగా పెరుగుతుంది, ఎందుకంటే పంట వేగంగా పరిపక్వం చెందుతుంది మరియు తెగుళ్ళ నష్టం తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఫోటోపెరియోడిక్ సెన్సిటివ్ మరియు తక్కువ రోజుల ఫలితంగా ఏపుగా ఉండే దశ తగ్గుతుంది మరియు పుష్పించే ప్రారంభంలో ఉంటుంది. తేమ మరియు తేమతో కూడిన పరిస్థితులు ఏపుగా పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. మొదటి 8-10 వారాలు తేమతో కూడిన పరిస్థితులతో 60-100 సెం.మీ సగటు వార్షిక వర్షపాతం మరియు పుష్పించే మరియు కాయ-అభివృద్ధి దశలో ఉన్న పొడి పరిస్థితులు అత్యంత విజయవంతమైన పంటకు దారితీస్తాయి. ఏది ఏమైనప్పటికీ, పుష్పించే సమయంలో వర్షాలు కురిస్తే పరాగసంపర్కం మరియు కాయల అభివృద్ధి సరిగా జరగదు మరియు దీని ఫలితంగా పాడ్-బొరేర్ సోకుతుంది. 18-27 ° C ఉష్ణోగ్రత పరిధి కావాల్సినది. అయినప్పటికీ, <10°C మరియు >35°Cని తట్టుకోగల రకాలు ఉన్నాయి.

Also Read: సేంద్రీయ వ్యవసాయం లో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత

Leave Your Comments

మిద్దె తోటలో రకరకాల చిక్కుళ్ళ పెంపకం

Previous article

Jamun Health Benefits: నేరడు తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Next article

You may also like