Papaya Cultivation: బొప్పాయి సాగు రైతులకు కల్పతరువుగా మారింది. అన్నదాతలు లాభాలు పంట చూస్తుండగా తింటున్న వారి ఆరోగ్యం బాగు పడుతుండటంతో బొప్పాయి సాగు అందరికీ అనుకూలంగా మారింది. ముఖ్యంగా తెగుళ్ల బెడద లేకపోవడం, మంచి ధరలు పలకడంతో రైతులకు సిరులు కురిపిస్తుంది. వాణిజ్య పంటలతో అన్నదాతలకు ఆశించిన ఫలితాలు రావడం లేదు దీంతో రైతులు ఆధిక దిగుబడి, లాభాలను ఇచ్చే పంటలపై దృష్టి పెట్టారు. సాంప్రదాయ పంటల కంటే ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. విటమిన్ ఏ ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో గిరాకీ ఉన్న బొప్పాయి పంటను సాగు చేసేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు.
బొప్పాయి సాగులో కలుపు రాకుండా రైతులు మల్చింగ్ ను ఏర్పాటు చేసి డ్రిప్ ను అమర్చుకున్నారు. ఐదో నెలలో పూతకు వచ్చి ఆరో నెలలో కాపునిస్తోంది. ఏడో నెల నుంచి కోతలు ప్రారంభం ఆవుతాయి. మొదటి కోత తర్వాత 20 రోజులకొకసారి కోత కోస్తుంటారు. ఇలా పంట అయ్యేసరికి ఎనిమిది కోతలు వస్తాయి. ఇలా ఎకరాకు 30 టన్నుల దిగుబడిని పొందుతున్నారు. దీంతో 3లక్షల ఆదాయం వస్తోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి బొప్పాయిని సాగు చేసుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చని తద్వారా రైతులకు లాభాలు వస్తాయని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొన్నారు.
Also Read: పండ్ల తోటల్లో కాండం తొలిచే పురుగు నివారణ.!
బొప్పాయి సాగులో రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం వలన కాయ ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుందని రైతులు చెప్తున్నారు. మార్కెట్లో టన్ను ధర సరాసరి 10వేలు పలుకుతోందడంతో ఎకరాకు మూడు లక్షల ఆదాయం వస్తుంది. జిల్లాలో సాగు చేపట్టాలనుకునే రైతులు రెడ్ లేడీ, వాషింగ్‌టన్, కో 1,2,3 రకాలు అనువైనవి. దీనికి అన్ని నేలలు అనుకూలంగా మారతాయి.
బొప్పాయిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలను సాధించవచ్చు. ప్రకృతి సాగు చేయడం వలన కాయలు బరువుతో నాణ్యత కలిగి ఉంటాయి. వేసవిలో కూడా బెట్టకు రాకుండా అధిక దిగుబడులు వస్తాయి. ఎకరాకు లక్షరూపాయిలు ఖర్చు ఆవుతుందని ఆదాయం మాత్రం 3 లక్షలు వస్తుందని రైతులు అంటున్నారు. కూలీల సమస్య కూడా ఉండదని రైతులు అంటున్నారు. విత్తనం వేసే ముందు నేలను దుక్కి సేంద్రియంతో నింపితే పంట బాగా వస్తుందని రైతులు అంటున్నారు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
Also Read: సమస్యాత్మక భూములు – వాటి యాజమాన్యం