Watershed Management: వర్షము పడినప్పుడు నేలలో ఇంక గలిగినంత నీరు నేలలోనికి పోగా మిగిలిన నీరు ఉపరీతల భూమి పై వాలు ను అనుసరించి ఒక ప్రత్యేక స్థానానికి చేరుటను వాటర్ షెడ్ అందురు. ఈ నీటిని పరీవాహక ప్రాంత బౌగోళిక పరిస్థితిని బట్టి నీటిని నిల్వ చేయుటకు మరియు నేల కోతకు గురి కాకుండా తగు సంరక్షక డిజైన్లు తయారు చేసి గట్లు, నీటి దారులు, చెక్ డాములు, నీటి కుంట నిర్మాణలు చేపడతారు. డిజైన్లు అత్యదిక నీటి ప్రవాహ పరిమణాన్ని అనుసరించి తయారు చేస్తారు.
పరీవాహక ప్రాంత యాజమాన్యము ను ప్రభావితం చేసే అంశాలు:-
వర్షపాత తీవ్రత – కాలము – పరిమాణము
భూమి వాలు, భౌగోళిక పరిస్థితులు
నేలల రకాలు – నీరు ఇంకు స్వభావము
తేమ నిలుపుకునే సామర్థ్యం
పరీవాహక ప్రాంతం లో పండించు పంటలు, వృక్ష సంపద , నేల పై పెరిగే గడ్డి జాతి మొక్కలు మొదలైనవి.
పరీవాహక ప్రాంత అభివృద్ధి చేయుటకు ముందు సేకరించ వలసిన
Also Read: Protect Crop From Wild Pigs: అడవి పందులు పొలంలోకి రాకుండా ఉండాలి అంటే ఎలా చేయండి.!
సమాచారము (basic information):-
భూమి యాజమాన్యం
నేల రకాలు , పంటలు – పండించు పద్ధతులు, దిగుబడులు , సేద్యం చేయుటకు భూమి సామర్థ్యం
పశు సంపద గణాంకాలు
వర్షపాతము , నేల కోత సమస్యలు, భూగర్బ జలాల సమాచారం
ప్రస్తుతం వున్నా, చెరువులు, బావులు, నీటి వనరుల సమాచారం
పాటశాలలు, బ్యాంకులు, పరపతి సౌకార్యం, మార్కెట్, ఆరోగ్య మరియు పశు వైద్య శాలలు వంటి సేవా సదుపాయాలు.
పరీవాహక ప్రాంత యాజమాన్య సూత్రాలు ( principles of watershed management):-
భూమి ని దాని సామర్థ్యం ను అనుసరించి వినియోగించుట
సారవంతమైన ఉపరితల నేలను రక్షించుట
చెరువులు , రిజర్వాయిర్లు, పల్లపు భూమిల్లో మేట వేయుట తగ్గించుట
నేలలో నీరు ఇంకు గుణము ను పరీ రక్షించుట
ఉపరీతల ప్రవాహమును నేల కోత లేకుండా నీటి నిల్వ నిర్మాణము లకు మళ్ళించుట
వృక్ష సంపద ను పెంపోందించుట
నేల కోత వలన గల్లీలు ఏర్పడ కుండా చెక్ డ్యాములను నిర్మించుట దీనివలన భూ గర్బ జలాల పరిరక్షించుట
అంతర పంటలు , పంటల సాంద్రత ను పెంచుట
భూమి రకాన్ని బట్టి ప్రత్యమ్నాయ పద్ధతులు ద్వారా సమర్థ వంతం గా వినియోగించుట
Water harvesting ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెంచుట
చిన్న తరహా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుట
వ్యవసాయ అనుబంధ వ్యవస్థలైన పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకలు , కోళ్ళ పెంపకం ద్వారా సంవత్సరాదాయం పెంచుకొనుట
రైతుల సాంఘిక , ఆర్ధిక పరిస్థితులను మెరుగు పరచుట
Also Read: Watershed Facts: నీటి పరీవాహక ప్రాంతం గురించి ముఖ్య విషయాలు తెలుసుకోండి.!