Irrigation Methods: నీటిని పొదుపుగా వాడుకోవాలంటే పొలం చదును గా ఉండాలి. పొలం అంతా చదును చేయడం కష్టమైన పని. అంతేకాకుండా వ్యయం తో కూడిన పని. గనుక చిన్న చిన్న మడులు గా విభజించి ఆ చిన్న మడులలో నేలను సులభం గా చదును చేయవచ్చు.
నీటి పారుదల పద్ధతులు – వేసిన పైరును బట్టి, నేల వాలును బట్టి, నీటి సరఫరాను బట్టి సరైన నీటి పారుదల పద్ధతిని ఎన్నుకోవాలి.
చెక్ టిసిస్ పధ్ధతి (చిన్న మడుల పద్ధతి):
పొలాన్ని చిన్న చిన్న గట్లతో చిన్న మడులు గా విభజించాలి. దీనినే “చెక్ బేసిన్లు” అంటారు. సాధారణం గా వాలును బట్టి చిన్న మడులు 15 -18 మీటర్లు పొడవు కలిగి 6-8 మీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి. గట్ల ఎత్తు నీటిని ఎంత వరకు నిలుప గలవో, దానిని బట్టి మార్పు కోవాలి.మడులలో ఉండే నేలను బాగా చదును గా లేక ఒక వైపుకు కొంచం వాలుగా ఉండేటట్లు తయారు చేయాలి. పొలానికి ఎత్తు భాగంలో పెద్ద కాలువను ఏర్పాటు చేసి, ఈ కాలువ నుండి చిన్న చిన్న కాలువల ద్వారా మడుల లోనికి కావలసినంత నీరు పెట్టాలి. చిన్న మడులలోనికి వదిలిన నీరు బయటకు పోకుండా అందులోనే ఇంకేటట్లు చూడాలి.రైతులు ఎక్కువ గా ఈ పద్ధతినే వాడుతారు.
ఈ పధ్ధతి లో ఇబ్బందులు:
నేలను బాగా చదును చేయాలి.గట్టు తెగిపోకుండా బలంగా వేసుకోవాలి గట్ల వల్ల చాలా భూమి నష్టపోతాము. గట్టు వేయుటకు, నీరు పెట్టుటకు కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎక్కువ వాలు కలిగిన భూములకు ఈ పద్ధతి పనికి రాదు.
బోర్డర్ స్ట్రిప్ పధ్ధతి (పొడవైన మళ్ళ పధ్ధతి):
పొలం చాలు వైపు సమానమైన, పొడవైన మడులు గా విభజించాలి. ఈ మళ్ళ పొడవు 60-300 మీటర్లు, వెడల్పు 6-30 మీటర్లు వరకు వాలును బట్టి, పైరును బట్టి, నీటి ప్రవాహ పరిమాణం బట్టి మార్చుకోవాలి.వాలు శాతం 0.05 నుండి 0.5 వరకూ ఉన్న పొలాలకు ఈ పధ్ధతి మంచిది.
పొలం పై భాగం లో పెద్ద కాలువ తీయవలెను ఈ కాలువ నుండి మడుల లోనికి సైఫస్ గొట్టాల ద్వారా గాని లేక పొడవైన గొట్టాల ద్వారా గాని నీరు వదులు కోవచ్చు.ఈ పధ్ధతి లో నీరు ఎక్కువగా పట్టుతుంది. మురుగు నీరు పోవుటకు అంత అవకాశం ఉండదు.దగ్గర వరుసలలో విత్తే పైర్లకు (కొర్ర, గోధుమ, బార్లె, వేరుశనగ) ఈ పధ్ధతి అనుకూలం, తక్కువ పరిమాణం గల నీటి ప్రవాహాన్ని సులభం గా ఉపయోగించ వచ్చు.
Also Read: Drip Irrigation: డ్రిప్ తో ఎన్ని రకాలుగా నీరు అందించవచ్చు.!
చాళ్ళ పధ్ధతి (FURROW METHOD):
దీనిని “బోదెలు-కాలువలు” పద్ధతి అంటారు.వరుసలలో వేయు పంటలకు (చెరకు, ప్రత్తి, వేడెక్కజొన్న) అనుకూలమైన పధ్ధతి.ఎక్కువ తేలిక నేలలు లేదా బరువైన నేలలకు తప్ప మిగతా అన్ని నేలలకూ సరిపోతుంది.బోదెల మధ్య కాల్వల ద్వారా నీరు పెడతారు. బోదేలపై పంట వరుసలు వేస్తారు.ఈ పధ్ధతి వల్ల నేల నంతటిని తడప వలసిన పని లేదు. నీరు వృధా కాదు.కూలి ఖర్చు తక్కువ గట్లు ఎక్కువ వేయనవసరం లేదు. కనుక నేల కలిసి వచ్చును.బోదెలను బోదె గుంటకతో గాని, మోల్డ్ బోర్డు (ఇనుప నాగలి తో గాని) లేదా రెండు రెక్కల నాగలి తో గాని వేయవచ్చు.
పాదుల పద్ధతి:
సాధారణం గా పండ్ల తోటలకు నీరు పెట్టడానికి ఈ పధ్ధతి వాడుతారు.చెట్ల చుట్టూ పాదులను గుండ్రం గా గాని లేక చదరం గా గాని తయారు చేయాలి.చెట్ల వరుసల మధ్య కాలువలు తయారు చేసి ఈ కాలువలనుండి పాదులకు నీరు పెట్టాలి.పాదుల నిండా నీరు పెట్టి ఆ నీరు పూర్తిగా ఇంకి పోవువరకు అట్లే ఉంచాలి.చెట్లు పెరిగే కొద్దీ పాదులను పెద్దవి గా చేయాలి.
Also Read: Drip Irrigation: డ్రిప్ ఇరిగేషన్ లో ఏ ఎరువులు అందిస్తారు.!