నీటి యాజమాన్యం

Irrigation Applications: నీటి పారుదల వసతులు కల్పించడం లో గల ఇబ్బందులను తెలుసుకోండి

1
Irrigation
Irrigation

Irrigation Applications: ప్రకృతి ఇచ్చిన సంపదలలో నీరు ప్రధానమైంది. జీవకోటికి నీరు ప్రాణాధారం. అదే విధం గా పంటలకు కూడా నీరు చాలా అవసరo. నీటిని ఒక ప్రధాన పోషక పదార్ధంగా పరిగణించ వచ్చు.నీరు యానకం గా పనిచేసి అనేక పోషక పదార్ధాలను మొక్కలకు అందిస్తుంది.నీటి పారుదల వసతులు లేని చోట పంటలు వర్షాధారం గా నే పండించ బడతాయి.

వర్షాధారపు పంటలు వర్షాభావo వల్ల గాని, సకాలం లో వర్షాలు లేక గాని, వర్షాలు ఎక్కువయి గాని ఎక్కువగా నష్ట పోవడం జరుగుతుంది.నీటి పారుదల గల ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడగానే పంటకు నీరు పెట్టి అధిక దిగుబడులను పొందవచ్చు.ప్రస్తుతం మన రాష్ట్రం లో 115 లక్షల ఎకరాకు మాత్రమే నీటి పారుదల సౌకర్యం కలదు (45.3 శాతం వ్యవసాయ భూమి) రాష్ట్రం లో గల నీటి వనరులన్నీ సవ్యం గా వినియోగించ గలిగితే 254 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం కల్పించ వచ్చు.

Also Read: Sprinkler Irrigation: స్ప్రింక్లర్ పద్ధతి తో కరువు ప్రాంతాల్లో నీటి ఆదా

Irrigation Applications

Irrigation Applications

ఇబ్బందులు: ఒక ఎకరాకు నీటి పారుదల సౌకర్యం కల్పించాలంటే (ప్రాజెక్టు నిర్మాణం, కాల్వల త్రవ్వకం, నేల చదును చేయడం, మురుగు నీరు పోవు సౌకర్యం కల్పించడం) సుమారు రూ 15 వేలు ఖర్చు అవుతుంది. ప్రస్తుత పరిస్థితులలో ఈ ఖర్చు ఇంకా అధికం అవుతుంది.అధిక ఖర్చుల దృష్ట్యా నీటి పారుదల సౌకర్యాలను ఇతర ప్రాంతాలకు కల్పించడం కష్టతరం అవుతుంది. మనదేశం లో సాగు నీరు చాల దుర్వినియోగం చెందుతుoది.

జపాను లో ఒక ఎకరాకు వరి పండించడానికి వాడే నీటికి 3 రెట్లు నీరు మన దేశం లో వరి పండించ డానికి వాడుతున్నారు.రైతులు నీటిని సమర్థ వంతం గ వాడిన అధిక దిగుబడులు రాబట్ట వచ్చు.అవసరానికి మించి నీటిని వాడిన మురుగు నీరు నిల్వ వలన, మరియు ఆవిరి రూపం లో నీరు వృధా అవడమే కాకుండా చవిటి నేలలు గా మారిపోతాయి.వేసిన రసాయనిక ఎరువులు అధిక నీరు వల్ల నేల అడుగు పొరల లోనికి పోయి పంటకు అందకుండా పోతాయి.

కొన్ని పోషక పదార్ధాలు ముఖ్యం గా నైట్రేట్లు భూ గర్భ జలాల్లో కలిసి నీటిని కలుషిత పరుస్తున్నాయి.పంటలకు అధికం గా నీరు పెట్టడం వల్ల నేలలో కావలసినంత ప్రాణ వాయువు లేక వేర్లు, మరియు సూక్ష్మ జీవులుపెరుగుదల తగ్గి పోషకాలు లభ్యత తగ్గు తుంది.పై విషయాలు దృష్టిలో ఉంచుకొని నీటి వినియోగదారులు సాగు నీటి వాడకం లో మెళకువలు గమనించి నీటి దుర్వినియోగాన్ని తగ్గించాలి.

Also Read: Water Taking Methods: నీటి వనరుల నుండి పొలం లోకి నీరు తీసుకొని పోవు పద్ధతులు

Leave Your Comments

Groundnut Diseases: వేరుశెనగ లో వచ్చే వివిధ రకాల తెగుళ్లు మరియు వాటి నివారణ చర్యలు

Previous article

Pest Control Techniques In Groundnut Crop: వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు మరియు వేరు పురుగు నివారణ

Next article

You may also like