Drip Irrigation: డ్రిప్ పద్ధతి మూడు రకాలుగా పేర్కొనవచ్చు.
ఉపరితల డ్రిప్: ఇది ముఖ్యంగా పండ్ల తోటలకు మరియు వరుసల మధ్య ఎక్కువ అంతరం ఉన్న పంటలకు సిఫారస్ చేయబడిoది.
నేల దిగువన అమర్చబడు డ్రిప్ పద్ధతి: ఈ పద్ధతి ముఖ్యంగా కూరగాయలు, గ్రీన్ హౌస్, షేడ్ నెట్స్, చెఱకు,సుగంధద్రవ్యాలు, ఔషధ మొక్కలు మరియు పూల మొక్కలకు సిఫారసు చేయబడిoది.
మైక్రోస్ప్రింక్లర్ పద్ధతి: ఈ పద్ధతిని ముఖ్యంగా 12-15 సంవత్సరాల పైబడిన పండ్ల తోటలకు, ఆకుకూరలు,ఆయిల్ష్ఫామ్ మొదలగు పంటలకు సిఫార్సు చేయబడిoది.
డ్రిప్ పద్ధతి వల్ల కలిగే లాభాలు: వివిధ పంటలలో 21 నుండి 50% వరకు సాగు నీరు ఆదా అవుతుంది.మొక్కల వేళ్ళకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చు తగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను సరఫరా చేయటం వలన మొక్కలు ఏపుగా పెరిగి, త్వరితంగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులను (15 నుండి 150%) మరియు నాణ్యమైన పంటను పొందవచ్చు.
Also Read: Classification of Herbicides: కలుపు మందుల వర్గీకరణ గురించి తెలుసుకోండి.!
అతి తేలికైన ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ మరియు ఎత్తు పల్లాలుగా ఉండే భూములకు, కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది.ప్రతీ చెట్టుకు నీరు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి అందజేయడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటారు నడపబడి కరెంటు వినియోగంలో దాదాపు 30-45% ఆదా అవుతుంది.పోషక పదార్ధాలను నీటిలో కరిగించి (ఫెర్టిగేషన్ ద్వారా) నేరుగా మొక్కల వేళ్ళకు దగ్గరగా అందించటం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి (80-90%) దాదాపు 20-43% ఎరువులు ఆదా అవుతాయి.
ఈ పద్ధతి ద్వారా ఎరువులు నేరుగా మొక్కకు అందుతాయి.నేలను చదును చేయటం, గట్లు కట్టటం, కాలువలు తవ్వటం, బోదెలు చెయ్యటం, నీటిని పారగొట్టటం, ఎరువులు వేయడం మొదలైన పనులు ఉండవు కావున వీటికయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ పద్ధతిలో పంట వరుసల మధ్యలో తేమ ఉండదు. కావున కలుపు సమస్య తగ్గుతుంది.ఉప్పు నీటిలో 38 డెసీసైమన్స్/మీటరు వరకు) కూడా పంటలు పండించవచ్చు.
మొక్కల మొదళ్ళ వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వలన పురుగు మందుల పిచికారీ, మొక్కల కత్తిరింపులు (ప్రూనింగ్), పంటకోత మొదలగునవి సులభతరమవుతాయి.నీరు నేరుగా మొక్కలకు అందించటం వలన స్ప్రింక్లర్ పద్ధతిలో మాదిరిగా మొక్కలపై మరియు ఆకులపై తేమ ఉండదు కావున చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది.
భూమి కోతకు గురికాదు. ఎరువులు భూమి లోపలి పొరల్లో చొచ్చుకొని పోయి వృధా అవ్వవు. మురుగునీటిసమస్య తగ్గుతుంది.అధికంగా గాలి వీయడం వలన స్ప్రింక్లర్ పద్ధతిలో మాదిరిగా నీటి వినియోగ సమర్ధతపైన ఎటువంటి ప్రభావం ఉండదు.డ్రిప్ పద్ధతిని ఉపయోగించటం వలన వాతావరణ సమతుల్యతకు ఎటువంటి హాని కలుగదు.
Also Read: Japanese Encephalitis in Pigs: పందుల లో జపనీస్-బి ఎన్ సెఫలైటిస్ వ్యాధి ని ఇలా నయం చెయ్యండి.!