ఉద్యానశోభ

Management practices of nematodes in banana plantation : అరటి తోటలో నులిపురుగుల యాజమాన్య పద్ధతులు

0

అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో తమిళనాడు మరియు మహారాష్ట ఉత్పాదకతలో ముందుస్థానంలో ఉన్నాయి. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 75 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ, మామిడి, నిమ్మ జాతుల తరువాత మూడవ స్థానాన్ని ఆక్రమించింది. తెలంగాణ రాలో దాదాపు అన్ని జిల్లాలలోనూ అరటి సాగులో ఉన్నప్పటికీ ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మేదక్‌ మరియు వరంగల్‌ జిల్లాల్లో అధికంగా సాగుచేయబడుతుంది. అరటి ఉష్ణ మండల పంట. దీని సాగుకు కావలసిన ఉష్ణోగ్రత 25 నుంచి 300 సెం. అవసరమవుతుంది. దీని సాగుకు సారవంతమైన అధిక సేంద్రీయ పదార్థాలు మరియు మురుగు నీటి వసతి కలిగి ఉదజని సూచిక 6 నుండి 7 వరకు గల నేలలు అనుకూలం. అరటి సాగుకు అనువైన రకాలు 70 దాకా ఉన్నాయి. వీటిలో 10-12 రకాలు మన రాష్ట్రంలో విసృతంగా సాగుచేయబడతాయి. ఎంతో ప్రధాన్యత ఉన్న అరటిని చీడ పీడలు ఆశించి పంటను నష్టపరుస్తున్నాయి. అందులో ముఖ్యంగా నేలలో ఉండి, పంటను బాగా నష్టపరిచే పురుగులలో నులి పురుగులు ప్రధానమైనవి.
అరటిని ప్రధానంగా నాలుగు రకాల నులి పురుగులు (రూట్‌ నాట్‌ నెమటోడు, బర్రోయింగ్‌ నెమటోడు, రూట్‌ లిజన్‌ నెమటోడు, స్పైరల్‌ నెమటోడు) ఆశించి పంటను నష్టపరుస్థాయి. అరటి రకాలైన గ్రాండ్‌ నైన్‌, రాస్తాలి, వామనకేళి, నెండ్రాన్‌, పూవన్‌, పెద్దపచ్చ అరటిలలో నులి పురుగులు ఉదృతి అధికంగా ఉంటుంది. ఇధి ప్రధానంగా వేెర్లను మరుయు దుంపలలోకి చేరి దుంప కణజాలాన్ని ఆశించి కూలిపోయేటట్లు చేస్తుంది.

root knot nematode

Root Knot Nematode

రూట్‌ నాట్‌ నెమటోడు :
అరటి పండిరచే తేలికపాటి నేల్లలో మరియు అధిక నీటి యద్దడి గల ప్రాంతాలలో దీని ఉధృతి అధికంగా ఉంటుంది. నెమటోడు మొక్కలను ఆశించడం వల్లన అనేక విధాలుగా నష్టం కనపడుతుంది.

లక్షణాలు :
ఎదుగుదల మందగిస్తుంది. మొదట ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోవడం ఆకుల ఆకృతి మారిపోవడం జరుగుతుంది.

నష్టపరచే విధానం :
ఆడ పురుగులు సుమారు 200 నుండి 300 వరకు గుడ్లు పెడతాయి. నులి పురుగులు వెర్లలోకి ప్రవేశించి రసం పీల్చి, వేర్లపై చారలు ఏర్పరుస్తాయి. మరికొన్ని రకాల నులి పురుగులు ఆశించడం వలన వేర్లపై కాయలవంటి బుడిపెలను ఏర్పరుస్తాయి. నులి పురుగులు ఆశించడం వలన వేర్లు మరియు దుంప బలహీనపడి మొక్క నీటిని పోషకాలను సరిగా తీసుకోలేదు. అందువలన మొక్కలు వదలిపోయినట్లు కన్పిస్తాయి.

Root Knot Nematode Tree

Root Knot Nematode Tree

బర్రోయింగ్‌ నెమటోడు :
వేర్ల లోపల చారలు ఏర్పచి నిర్వీర్యం చేస్తుంది. వేరు అంతర్గతకణజాలాల క్షీణతకు కారణమవుతాయి. నులి పురుగులు ఆశించిన మొక్కలను భూమి నుండి సులభంగా బయటకు తీసివేయవచ్చు. ఈ నులిపరుగు దాడిచేయడం వలన చిన్నపాటి గాలివాన కూడా మొక్క క్రిందకు పడిపోతుంది. తరువాత ఇది బాక్టీరియా, ఫంగి మరియు వైరస్‌ తెగుళ్ళ వ్యాప్తికి దోహదపడుతాయి.

Borrowing Nematode

Borrowing Nematode

రూట్‌ లిజన్‌ నెమటోడు :
దీని ఉధృతి అక్టోబర్‌-డిసెంబర్‌ మాసాలల్లో అధికంగా మరియు మార్చి నుండి ఆగష్టు వరకు వ్యాప్తి తక్కువగా ఉంటుంది. ప్రారంభ దశలో మొక్క వేర్లపై దీర్గవృతాకార వలయాలను ఏర్పరుసాయి. ఈ వలయాలు పసుపు లేదా గోధుమ లేదా నలుపు రంగులో ఉండి తర్వాత మొక్క చిన్నగా ఉంటూ పసుపు రగులోకి మారి చనిపోవడం జరుగుతుంది.

స్పైరల్‌ నెమటోడు :
ఈ నులి పురుగులు ఆశించునటువంటి మొక్కలు కాండం క్షీణించి మొక్కలలో ఎలాంటి పెరుగుదల కనిపించదు. అన్ని రకాల నేలల్లో (తేలికపాటి మరియు బరువైన నేలలల్లో) నివశిస్తుంటాయి. మొక్క వేర్ల లోపాల చూసినప్పుడు గోధుమ రంగు వలయాలు కనిపిస్తాయి. స్పైరల్‌ నెమటోడు ఆశించడం వలన 33% దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది.

Also Read: చలికాలంలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Rootpondu nematode

Rootpondu nematode

యాజమాన్య పద్ధతులు :
. నులి పురుగులు సోకనటువంటి తోటల నుండి పిలకలు సేకరించాలి.
. పిలకల దుంపపై చర్మం పలుచగా చెక్కి తరువాత క్లోరిపైరిఫాస్‌ 25% ఇ సి ఏ 2 మి.లీ లేదా కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ 5 గ్రా. కలిపిన ద్రావణంలో ముంచి నీటిలో ఆరనిచ్చి తరువాత నాటుకోవాలి.
. వేసవిలో లోతుగా దుక్కిచేెసి బాగా ఎండగాచిన నెలలో అరటిని పాతుకోవాలి.
. పంట మార్పిడి చేయాలి. నేలలో వేర్లపై చారలు కలుగుచేసే నులి పురుగులు తగ్గించుటకు జనుము పంట పెంచి పూ మొగ్గ దశలో నేలలో కలియ దున్ని ఆ తరువాత అరటిని నాటుకోవాలి.
. నులి పురుగులు సోకిన ఆరటి తోటల్లో మొక్కకు 25 గ్రా. నుండి 40 గ్రా. కార్బోఫ్యూరాన్‌ గుళికలు మొక్క మొదలు వద్ద 10 సెం . మీ. లోతులో వేసి మట్టితో కప్పి తేలికగా నీరు పెట్టాలి.
. పొగాకు, బెండ, టమాటా మొదలగు పంటలతో పంట మార్పిడి చేయరాదు.ఈ నేలలో బంతి పంటను పండిరచిన తరువాత అరటిని నాటుకోవడం ద్వారా రూట్‌ నాట్‌ నెమటోడు తగ్గించవచ్చు.
. పిలకలన్నీ నాటేటప్పుడు, నాటే గుంతలో అర కిలో వేప పిండి లేదా 5 కిలోల పశువుల ఎరువు వేస్తే నులిపుగుల సంఖ్య వృద్ధి కాకుండా అదుపులో ఉంటాయి.
. డ్రిప్‌ నీటిపారుదల సౌకర్యమువున్న తోటలకు ద్రవరూపంలో ఉన్న సుడోమొనాస్‌ ప్లోరోసెన్స్‌ జీవ సంబంధ మందును ఎకరానికి 1.6 లీటర్లను నీటిలో కలిపి తోట నాటిన తర్వాత రెండవ, నాల్గవ, ఆరవ మాసాలకు డ్రిప్‌ నీటి ద్వారా అన్ని మొక్కలకు అందించడం వలన చాలా వరకు నులి పురుగులు తగ్గించవచ్చు.
. అరటిలో వరి పంట మార్పిడి చేస్తే నులిపురుగులేకాక వాడు తేగుళ్ళు రాదు.
. ఫ్లూయోరం 34.48% ఇ సి ఏ 500 మీ.లీ / ఎకారనికి డ్రిప్‌ ద్వారా పంపించడం వల్ల నులి పురుగులను అరికట్టవచ్చు.
. పైన తెలిపిన సమగ్ర చర్యలను పాటించడం వలన నులి పురుగుల బెడద నుండి అరటి పంటను కాపాడుకోవచ్చు.

డా.యు. వేణుగోపాల్‌, డా.జి.తిరుపతయ్య
కే . మానస మరియు డా. కె. కళాధర్‌ బాబు,
కొండ లక్ష్మణ్‌ బాబు, తెలంగాణా రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రర నగర్‌, హైదరబాద్‌,
జీ . రాజేశ్వరి, డా. వై.య. ఎస్‌. ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, పులివెందుల, ఆంద్రప్రదేశ్‌
డా.పి. పరమేశ్వర్‌, చైతన్య, డిమ్డ్డ్‌, యూనివర్స్టీ, మొయినాబాద్‌, రంగారెడ్డి, జిల్లా,
ఫోన్‌ : 96404 81408

Leave Your Comments

Nutrient Deficiencies of Citrus: నిమ్మ చీనిలో పోషకలోపాలు- సవరణ

Previous article

A young farmer who excels in dragon fruit cultivation : డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగులో రాణిస్తున్న యువ రైతు

Next article

You may also like