నేలల పరిరక్షణ

Problematic Soils: సమస్యాత్మక భూములు – వాటి యాజమాన్యం

1
Problematic Soils
Problematic Soils in India

Problematic Soils: తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 54% ఎర్ర నేలలు, 20% నల్ల నేలలు, 3% ఒండ్రు నేలలు, 23% అటవి ప్రాంత నేలలు ఉన్నాయి. వీటిలో సమస్యాత్మక నేలలు అంటే ప్రత్యేకంగా చౌడు నేలలు, ఆమ్ల నేలలు, సున్నం అధికంగా ఉన్న నేలలు, తక్కువ లోతు మరియు గలస అధికంగా గల నేలలు, తక్కువ నీటి నిల్వ సామర్థ్యం గల నేలలు, అడుగు మట్టిలో గట్టి పోరా గల నేలలు, వాలు ఎక్కువ గల నేలలు. ఈ నేలలు రైతులను సుస్థిర అధికోత్పత్తిని సాధించకుండా ఆటంక పరుస్తునాయి. కావున రైతులు క్రింద సూచించిన యాజమాన్య పద్ధతులు ద్వారా వీటిని అధిగమించి సుస్థిరమైన అధిక దిగుబడులను పొందవచ్చును.

తెల్ల/పాల చౌడు నేలలు :
లక్షణాలు: నీటిలో కరికే లవణ సాంద్రత అధికంగా ఉంటుంది.
వేసవి కాలంలో నేల ఉపరితలంపై తెల్లటి చౌడు నీటిలో కరి లవణాలతో పేరుకొని ఉంటుంది.
విత్తిన గింజలు సరిగా మొలకెత్తవు
మొలకెత్తిన పైరు కూడా ఏపుగా పెరగదు.
పొలంలో మొక్కల సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది.
తక్కువ వర్షపాతం, ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పడతాయి.
యాజమాన్య పద్ధతులు:
నాణ్యమైన నీరు అందుబాటులో లేనప్పుడు, ఉప్పు నీటిని తట్టుకునే పంటలను వేసుకోవాలి.
పశువుల ఎరువు, కంపోస్టు మరియు పచ్చి రొట్టె ఎరువులు వాడాలి.
ఆమ్ల గుణాన్ని కలిగించే రసాయనిక ఎరువులను ఉపయోగించాలి.
మెట్ట ప్రాంతాలలో పప్పుధాన్యాల పంటలను బోదులు సాళ్ళు చేసి, సాళ్ళ మధ్యలో నాటుకోవాలి.
విత్తనాలను 0.1% ఉప్పు నీటిలో 2-3 గంటలు నానబెట్టి విత్తుకోవాలి.
ఒక మోస్తారు చౌడు ఉంటే, జీలుగను పెంచి మట్టిలో కలియదున్నాలి.

క్షార చౌడు నేలలు:
లక్షణాలు:
వేసవి కాలంలో నేల పైన నలుపు లేదా బూడిద రంగు పొర కనబడుతుంది.
వినిమయ సోడియం 15 శాతం కన్నా ఎక్కువగా ఉంటుంది.
భూమి ఆకృతి క్షీణిస్తుంది.
కొద్దిపాటి వర్షం వచ్చిన నీరు భూమిలోకి త్వరగా ఇంకదు.
ఎండినప్పుడు నేల గట్టిగా ఉంటుంది.
యాజమాన్య పద్ధతులు:
పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకొని, మడుల నుండి నీరు పోయేలా లోతైన మురుగు నీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
భూసార పరీక్షను అనుసరించి జిప్సమ్ వేసుకోవాలి.
భూసార పరీక్ష రిపోర్ట్ అందుబాటులో లేనప్పుడు సుమారుగా 1.2-1.6 టన్నుల జిప్సమ్ ఎకరాకు చొప్పున పొలంలో వేసుకోవాలి.
జిప్సాన్ని నేలపై చల్లి మట్టిలో కలిసేలా పైపైన దంతెతో లేదా గోర్రుతో దున్నాలి.
తరువాత నీటిని నిల్వకట్టి నెలలో ఇంకెలా చేయాలి.
వారం రోజులు వరుసగా నీటిని మడిలో నిల్వ ఉంచాలి.
రేగడి భూముల్లో తరుచుగా తడులు ఇవ్వాలి.
సున్నం అధికంగా ఉన్న నేలల్లో జిప్సానికి బదులు ఐరన్ పైరైట్స్ పొడి (< 5 మిల్లి మీ. సైజు) లేదా పొడిచేసిన గంధకం వాడాలి.
ఐరన్ పైరైట్స్ పొడిని నేల మీద చల్లి మట్టిలో కలిసిన దంతెతో తేలికగా దున్నాలి.
మట్టి తేమగా ఉండేటట్లు తేలికపాటి తడిపెట్టి వారం రోజులు వదిలేయాలి.
తరువాత మడిలో నీరుపెట్టి ఇంకెలా చేయాలి.
జిప్సమ్ కు బదులుగా ప్రెస్ మడ్ ను 1.2-1.6 టన్నులు ఎకరాకు చొప్పున వాడవచ్చు.

ఆమ్ల నేలలు :
లక్షణాలు:
ఈ నేలలలో ఉదజని సూచిక 6.5 కన్న తక్కువగా ఉంటుంది.
ఈ నేలలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, జహీరాబాద్ మరియు నెల్లూరు జిల్లా కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి.
పైకి చూడటానికి ఈ నేలలు తేలికగా ఎర్రగా కనబడతాయి.
యాజమాన్య పద్ధతులు:
ఈ నేలలను బాగుచేయటానికి సున్నం లేదా బేసిక్ శ్లాగ్ మరియు చెరకు మడ్డి, వాడుకోవాలి.
భూసార పరీక్ష ఆధారంగా ఎంత సున్నం వేయాలో తెలుసుకోవాలి.
భూసార పరీక్ష ఫలితం అందుబాటులో లేనప్పుడు ఎకరాకు 3-4 క్వింటాల్ల పొడి చేసిన సున్నాన్ని సాళ్లలో వేయాలి.
మొదటి 2-3 సంవత్సరాలు సున్నం బాగా అవసరమయ్యే లెగ్యుమ్ జాతి పైర్లను కూరగాయలను పండించాలి.

Also Read: మంచి నీటి చెరువులలో పెంపకానికి అనువైన చేపల రకాల ఎంపిక.!

Problematic Soils in India

Problematic Soils 

సున్నం అధికంగా వున్న నేలలు
లక్షణాలు:
ఈ నేలలలో గలాస లేదా ప్రత్యేక పొర రూపంలో ఉన్న సున్నాన్ని గమనించవచ్చు.
కంటికి కనిపించని రూపంలో ఉన్న సున్నాన్ని గుర్తించటానికి 1:4 నిష్పత్తిలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నీరు కలిపి ఒక చుక్క మిశ్రమ ద్రావణాన్ని మట్టి పై వేస్తే బుస బుసమనే నురగ వస్తే సున్నం అధికంగా గల నేలగా గుర్తించవచ్చు.
ఈ నేలలో భాస్వరం ఎరువు వినియోగ సామర్థ్యం అతి తక్కువగా ఉంటుంది.
సూక్ష్మ పోషకాలైన జింకు, ఇనుము, మాంగనీసు, రాగి లోపాలు అధికంగా కనిపిస్తాయి.
యాజమాన్య పద్ధతులు:
ఈ నేలలలో సూక్ష్మ పోషకాలను పైరు పై పిచికారీ చేయాలి.
ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువును వేయాలి.
జనుము మరియు జీలగను పచ్చిరొట్ట పైర్లుగా పెంచి నేలలో కలియదున్ని మరిగించాలి.
భాస్వరం ఎరువును సాల్లలో విత్తే తప్పుడు గింజకు 5 సెం.మీ. లోతు మరియు దూరంలో పడేటట్లు, విత్తనం మరియు ఎరువు ఒకేసారి వేసి సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ ద్వారా వేయాలి.
ఈ నేలలలో పండించే నిమ్మ, నారింజ తోటల్లో సాధారణంగా కనిపించే ఇనుము లోపాన్ని నివారించటానికి 25 కిలోల పశువుల ఎరువు మరియు 125 గ్రా. అన్నబెధిని ఒక్కొక్క చెట్టుకు చొప్పున వేయాలి.

తక్కువ లోతు మరియు గలస అధికంగా గల నేలలు :
యాజమాన్య పద్ధతులు:
నేలలోతు 30 సెం.మీ. కన్నా తక్కువగా ఉండటం వలన వేరు పెరుగుదల తగ్గి నీరు మరియు భూసారం పరిమితంగా ఉంటాయి.
నేల ఉత్పాదక శక్తిని పెంచటానికి వాలుకు అడ్డంగా బోదెలు, కాలువలు నిర్మించి బోదెల మీద నాటాలి.
ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువును వేయాలి.
లోతు దుక్కులు చేయాలి.

తక్కువ నీటి నిల్వ శక్తి గల నేలలు – యాజమాన్య పద్ధతులు:
వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కన్నా తక్కువగా ఉంటుంది.
నేల ఉత్పాదక శక్తిని పెంచటానికి ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేసవిలో తోలుకోవాలి.
తరువాత 200 కిలోలు బరువు గల రోలరును 5-6 సార్లు పొలంలో నడిపించాలి.
చెరువు మట్టి వలన భూమిలో బంక శాతం పెరుగుతుంది.
భూమిలో నీటిని, పోషక పదార్ధాలను నిలుపుకునే శక్తి పెరుగుతుంది.
ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువును వేయాలి.

అడుగు మట్టిలో గట్టి పొర గల నేలలు – యాజమాన్య పద్ధతులు:
ఈ నేలలలో 1 మీ. పొడవు 1 మీ. లోటు గల గొయ్యిని త్రవ్వి చూస్తే భూమి లోపల గట్టి పొర కనిపిస్తుంది.
గట్టి పొరకు పైన క్రింద మామూలు మట్టి ఉంటుంది.
ఈ సమస్య నిజామాబాద్ ప్రాంతంలో చెరకు పండించే రేగడి భూములలో ఎక్కువగా కనబడుతుంది.
సబ్ సాయిలర్ లేదా చిసెల్ నాగళ్ళతో లోతు దుక్కులు చేయాలి.
లోతు సాళ్ళను 60 సెం.మీ, దూరంలో రెండు వైపులా తోలాలి.
ఎకరాకు 10 టన్నుల పశువుల లేదా 2 టన్నుల జిప్సమ్ ఎరువును వేయాలి.
లోతు దుక్కులు ప్రభావం 3 సంవత్సరాలు వరకు ఉంటుంది.

వాలు ఎక్కువ గల నేలలు- యాజమాన్య పద్ధతులు
ఈ నేలలలో నెల కోత అధికంగా ఉంటుంది.
భూసారం, నీటి నిల్వ శక్తి తగ్గి బెట్ట పరిస్థితి త్వరగా వస్తుంది.
3-4 శాతం వాలు ఉన్న నేలలలో కాంటూరు చెయ్యాలి.
వాలు ఎక్కువగా ఉన్న నేలలలో కాంటూరు గట్లు వేయాలి.

Also Read: ప్రస్తుత పరిస్థితుల్లో సోయా చిక్కుడు, వరి పంటల్లో వచ్చే తెగుళ్లు.!

Leave Your Comments

Freshwater Fish Pond Culture: మంచి నీటి చెరువులలో పెంపకానికి అనువైన చేపల రకాల ఎంపిక.!

Previous article

Stem Borer: పండ్ల తోటల్లో కాండం తొలిచే పురుగు నివారణ.!

Next article

You may also like