ఆహారశుద్దిమన వ్యవసాయం

Agricultural Waste Benefits: వ్యవసాయ వ్యర్థాలతో ఎన్నో లాభాలు.!

1
Agricultural Waste
Agricultural Waste

Agricultural Waste Benefits: వ్యవసాయ రంగంలో ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, ప్రత్తి, చెరకు, మరియు ఇతర వాణిజ్య పంటల నుండి పలు రకాలైన వ్యర్థాల ఉత్పత్తి జరుగుతుంది. ఈ వ్యర్థాలను వృధాగా వదిలివేయకుండా ప్రత్యామ్నయాలుగా వినియోగిస్తే, వీటి నుండి పలు ప్రయోజనాలు పొందవచ్చు.

సేంద్రియ ఎరువుగా
వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ ఎరువు గా వినియోగిచడం మనకు తెసిన పద్దతే.. ఎప్పటికి నుండో చేస్తున్నదే. ఒక హెక్టార్ భూమిలో గల వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ ఎరువు గా తయారు చేస్తే సుమారు 3టన్నుల వరకు సహజ పోషకాలు నేలకు అందిచవచ్చు. వరి గడ్డిని పశువులు కొట్టంలో పరిచి పశువులు వ్యర్థాలను సేకరించి వ్యవసాయ భూములలో వేస్తే 2-3 కిలోల సహజ నత్రజని లభిస్తుంది. పశువుల వ్యర్థాలను ఎరువుగా వినియోగిస్తే సేంద్రియ ఎరువుల వినియోగం పెరిగి రసాయన ఎరువుల వినియోగంను తగ్గించవచ్చు.

పశువుల దాణాగా
పంటల కోత తరువాత వ్యసాయ వ్యర్థలను సాధారణoగా పశువులకు మేతగా వేస్తారు. అయితే ఈ వ్యర్థాలను నేరుగా పశువుల దాణా గా వినియోగిస్తే తక్కువ పోషక విలువలు కలిగి ఉండడం వలన తక్కువగా జీర్ణమవుతాయి. అందుచేత ఈ వ్యర్థాలకు పోషక విలువలు జోపించుడానికి వీటికి యూరియా మరియు మోలాసిస్ వెయ్యాలి దీనితో పశువులు వీటిని సులువుగా జిర్ణం చేసుకోగలుగుతాయి. పప్పు జాతి పంటల వ్యర్థాలను పశువులు దాణాగా వేస్తే అధిక పోషకాలు పశువులకు చేరి పాలు, మాంసం ఉత్పత్తులు పెరుగుతాయి.

శక్తివనరులుగా
వ్యవసాయ వ్యర్థాల నుండి శక్తిని పొoదడానికి ప్రస్తుత కాలంలో పర్యావరణ పరంగా ప్రాముఖ్యతను సంతరించుకుటుంది . ఈ వ్యర్థాలను శక్తి వనరులుగా ఉపయోగిచడం వలన తిరిగి పెట్రోలియమ్, బొగ్గు వంటి సహజ వనరులు భారం తగ్గిచబడుతుంది. అంతే కాకుండా వ్యవసాయ వ్యర్థాలను విలువ చేయడం సులభం. వీటి నుండి శక్తిని పొoదడానికి తక్కువ ఖర్చు అవసరం అవుతుంది. వ్యర్థాల నుండి శక్తిని పొoదడానికి మరియు ప్రకృతి పరంగా కూడా ప్రయోజనకారిగా ఉంటాయి.

Agricultural Waste Benefits

Agricultural Waste Benefits

Also Read: Effects and Management of Parthenium Hysterophorus: వయ్యారి భామ (కలుపు మొక్క)ను ఎలా వదిలించుకోవాలి? 

ఇoధన నూనెగా
వ్యవసాయ వ్యర్థాలు ఉండే లీగ్నన్, సెల్లులోస్ ల నుండి మిధనల్, ఇధనాల్ వంటి జీవసంధ నూనెలను తయారు చేయవచ్చు. బయోమీదనేషన్ అను ప్రక్రియా ద్వారా వ్యవసాయ వ్యర్థాలను నశిoపజేసీ , వాటి నుండి నాణ్యమైన బయోగ్యాస్ మరియు ఇoధన నూనె లభిస్తుంది. ఇoధన నూనెతో పాటుగా ఈ వ్యర్థాల నుండి లభించే అవశేషాలను వ్యవసాయ భూములకు ఎరువుగా వాడవచ్చు.

వ్యవసాయ వ్యర్థాలను పంట కాలం తరువాత అలాగే వదిలివెయ్యకుండా తిరిగి చాలా రకాలల్లో వినియోగించి వ్యవసాయ దిగుబడులను పెంచవచ్చు.

పంట వ్యర్థాలను అదే నేలలో కలియ దున్నడం వలన తరువాత పంట కాలానికి సహజ సిద్ధంగా సేంద్రియ పదార్ధం అదించబడుతుంది.

వ్యర్థాలను నేలపై సహజంగా వాడడం వలన నేలలోని తేమను పరిరక్షిస్తుంది.
వ్యర్ధాలు కుళ్ళి నేలలో చేరి నేల స్వభావన్నీ మార్చి పోషకాలు, ఎంజైముల స్థాయిని స్థిరపరుస్తాయి. నేలలోని సహజ నత్రజని అనుకూల పరిస్థితులు ఏర్పరుస్తాయి.

పంటను ఆశించే చీడపీడలు, గ్రుడ్లును కప్పి ఉంచితే తరువాత పంట కాలంలో వాటి ఉధృతి ని తగ్గిస్తాయి. వ్యవసాయ వ్యర్థాలను వృధా పోనివ్వకుండా సమర్థంగా వినియోగిస్తే వ్యవసాయ దిగుబడులను పెంచుకోవడమే కాకుండా, సామాజికoగా, పర్యావరణ పరంగా వాటి నుండి మంచి దిగుబడి పొందవచ్చు.

Also Read: Sowing Seeds with Tractor: ట్రాక్టరుతో విత్తనం విత్తుదాం.!

Leave Your Comments

Effects and Management of Parthenium Hysterophorus: వయ్యారి భామ (కలుపు మొక్క)ను ఎలా వదిలించుకోవాలి? 

Previous article

Soil and Irrigation Water Tests: భూసార, సాగునీటి పరీక్షలు.!

Next article

You may also like