పశుపోషణ

పశువుల్లో చిటుక వ్యాధి అత్యంత ప్రమాదకరం

0
Animal Husbandry

Disease Precautions In Animal Husbandry వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన పశుపోషణలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం, చలి కాలంలో సీజనల్ వ్యాధుల భారీన పడి భయంకరమైన వ్యాధులు చుట్టుముట్టి వందలాది పశువులు మృత్యువాత పడుతున్నాయి. గొర్రెలు, మేకలు, పాడి పశువులు అకాల మరణాలతో పశుపోషణే జీవనాధారంగా బ్రతుకు సాగిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక పశువుల మరణాలతో మరికొందరు రైతులు నాటు వైద్యం చేస్తున్న పరిస్థితి. అయితే నాటు వైద్యం వికటించి పశువులు మృత్యువాత పడుతుండటంతో రైతులకు పాలుపోవడం లేదు. కొన్ని జిల్లాలో వైద్యుల కొరత ప్రధానంగా కనిపిస్తుంది.

Animal Husbandry

Animal Diseases సీజనల్ వ్యాధుల బారీన పడిన పశువులలో చురుకుదనం తగ్గడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా బొబ్బరోగం, చిటుక వ్యాధి, పీపీఆర్‌, గురుక పెట్టడం, జబ్బవాపు, గొంతువాపు, డయేరియా లాంటి వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో పాడి పశువులు అంతు చిక్కని వ్యాధుల భారీన పడి అనారోగ్యం పాలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను పశువ్యాధులపై అప్రమత్తం చేయాల్సిన అధికారులు అందుబాటులో లేక అవస్థలు పడాల్సి వస్తుంది.

Animal Husbandry

ఈ మధ్య పశువులలో చిటుక రోగం కలవరపెడుతుంది. క్లాఫ్రిడియం జాతికి చెందిన సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే విష పదార్ధం వల్ల చిటుక వ్యాధి వస్తుంది అంటున్నారు వైద్యులు. ఈ వ్యాధి సోకడంతో పశువులు చనిపోవడానికి ఎక్కువ సమయం కూడా పెట్టకపోవడంతో రైతులు బాధ వర్ణనాతీతంగా మారింది. సాధారణంగా ఈ వ్యాధి గొఱ్ఱెలలో ఎక్కువగా కనిపిస్తుంది. Seasonal disease in animals

Animal Husbandry

 

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: Prevention Of Disease In Animals

చిటుక వ్యాధి సోకకుండా ముందస్తుగా చిటుక రోగ నివారణకు టీకాలు వేయించాలి. 15 రోజుల తర్వాత బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేయించాలి. తొలకరి వర్షాలకు మొలిచిన గడ్డిని పశువులు తినకుండా జాగ్రత్తపడాలి. తొలకరిలో జీవాలు కడుపు నిండా పచ్చిమేత మేయకుండా 3-4 గంటలు మాత్రమే మేసేలా చూడాలి. వర్షాకాలం రాకముందే గొర్రెలలో బద్దె పురుగుల వంటి అంతర పరాన్నజీవుల నిర్మూలనకు నట్టల మందు తాగించాలి. మరింత సమాచారం కోసం దాగ్గర్లో ఉన్న పశువైద్యశాలకు వెళ్లి నివారణ చర్యలు చేపట్టాలి. Animal Husbandry

Leave Your Comments

సేంద్రియ సేద్యంపై మోడీ సూచనలు..

Previous article

భవిష్యత్తులో సూక్ష్మ సేద్యంతోనే వరిసాగు

Next article

You may also like