పశుపోషణమన వ్యవసాయం

Bovine Herpes Virus in Cattles: ఆవులలో బోవైన్ హెర్పిస్ వైరస్ వ్యాధి ఇలా వ్యాపిస్తుంది.!

2
Bovine Herpes Virus
Bovine Herpes Virus

Bovine Herpes Virus in Cattles: ఈ వ్యాధి బోవైన్ హెర్పిస్ వైరస్ వలన ప్రధానంగా ఆవులలో అతి తక్కువ సమయంలో అకస్మికంగా ప్రబలే ఒక అంటు వ్యాధి. ఈ వ్యాధిలో తీవ్రమైన జ్వరం, ముక్కు రంధ్రాల శోధం, డిస్నీయా, ఈసుకుపోవుట, మేనింజియో ఎన్సెఫలైటిస్, కేరటో కంజెక్టిఫైటిస్ మరియు పుస్టులార్ ఉల్వో ఏజైనైటిస్ లక్షణాలు ఉంటాయి.

వ్యాధి కారకం:- ఈ వ్యాధి బోవైన్ హెర్పిస్ వైరస్ వలన కలుగుతుంది. ఇది ఒక DNA, double standard, Envoloped virus. ఈ వ్యాధిని మన దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పశువులలో గుర్తించారు.

వ్యాధి బారిన పడు పశువులు:- ఈ వ్యాధి ప్రధానంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, ఎద్దులలో కలుగుతుంటుంది. ఒక సంవత్సరం లోపు పశువులలో ఈ వ్యాధి అతి తీవ్రంగాను, సంవత్సరం పైబడిన పశువులలో తీవ్రత తక్కువగాను ఉంటుంది.

Bovine Herpes Virus in Cattles

Bovine Herpes Virus in Cattles

Also Read: Artificial Insemination in Cows: ఆవులలో కృత్రిమ గర్భధారణకు సరియైన సమయం తెలుసుకోండి.!

లక్షణాలు:- ఈ వ్యాధిలో 4 రకముల లక్షణాలు ప్రధానంగా కలవు. శ్వాసకోశ వ్యవస్థ, గర్భాశయ వ్యవస్థ,కంటి సంబంధ ,మెదడు వాపు, తీవ్రమైన జ్వరం, ఆకలి లేకపోవుట, డిప్నియా, ముక్కు నుండి నీరు కారుతుండుట, నోటితో గాలిపీల్చుట, ముక్కు రంధ్రాలు ఎర్రబడి ఉండుట ప్రధానంగా ఉంటుంది.చూడి పశువులు 4 నెలలలో ఈసుకుపోతుంటాయి.

గర్భం నుండి చీముతో కూడిన ద్రవాలు కారుతుంటాయి. తరచూ మూత్రం పోస్తుంటాయి. పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. బాహ్య జననేంద్రియాలు వాచి, ఎర్రబడి ఉంటాయి. మగ పశువులలో బాలనో ప్రొస్టైటిస్ లక్షణాలుంటాయి. కంటి నుండి నిరంతరం నీరు కారుతుంటుంది. కంటి పొరలలో రక్తపుచారలను చూడవచ్చు. కార్నియల్ ఒపాసిటి ఉంటుంది.

వ్యాధి వచ్చు మార్గం:- వ్యాధి కారకం ముక్కు మరియు కంటి నుండి కారే ద్రవాలలోను, ఈసుకుపోయిన పిండం, పిండ త్వచాలు మరియు గర్భస్రావాలలో అధికంగా ఉంటుంది. వ్యాధి కారక క్రిమితో కలుషితమైన గాలిని పీల్చుట వలన ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు సోకుతుంది. కొన్ని సందర్భాలలో కలుషితమైన ఆహారం, నీరు త్రాగుట వలన కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంటుంది.స్థిరాయిడ్ ఔషధములు ఉపయోగించుట, ప్రయాణపు స్ట్రెస్, న్యూటీషనల్ లోపం, పరిసరాలపరిశుభ్రంగా లేకపోవుట వంటి అంశాలు ఈ వ్యాధి త్వరిత గతిన వ్యాప్తి చెందుటకు దోహదపడు అంశాలు.

వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- కలుషితమైన గాలిని పీల్చుట ద్వారా వ్యాధి కారక క్రిమి పశువుల శ్వాసకోశ వ్యవస్థలోకి చేరి ముక్కురంధ్రాల శోధమును లారింజైటిస్ను, టెకైటిస్ను మరియు ఊపిరితిత్తులలో చేరి న్యూమోనియాను కలుగజే. కంటిలో వేరి కంటి శోధమును, మెదడుకు చేరి ఎన్సెఫలైటిస్ను, గర్భంతో ఉన్న పిండత్వచములలో వేడి పశువులు ఈసుకుపోయ్యెటట్లు చేస్తుంది. చిన్న దూడలలో ఈ వ్యాధి ప్రాణాంతకముగా ఉంటుంది.

Also Read: Rinderpest Disease in Buffaloes: గేదెలలో ముసర వ్యాధిని ఇలా నయం చెయ్యండి.!

Leave Your Comments

Weeding Equipments and Uses: కలుపు తీయు పరికరాలు మరియు వాటి ఉపయోగాలు.!

Previous article

Buffalo Types: గేదెల రకాలు మరియు వాటి లక్షణాలు.!

Next article

You may also like