IoTech World Aviation Drone: దేశంలో డ్రోన్‌ల వినియోగం పెరిగిపోయింది. అనేక రంగాలు డ్రోన్ సేవలు ఉపయోగించుకుంటున్నాయి. పార్సిల్స్ డెలివరీ నుంచి ఏరియల్ వ్యూస్ రికార్డు చేయడం, గంజాయిని అరికట్టడం, భూమి కొలతలు, నిఘా ఇలా అనేక రంగాలు డ్రోన్ సేవలు వాడుకుంటున్నాయి. అయితే తాజాగా వ్యవసాయరంగంలో డ్రోన్ సేవలు విస్తరించనున్నాయి.దేశీయంగా అగ్రి డోన్ అగ్రిబాట్ ఏ6కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి టైప్ సర్టిఫికెట్ లభించినట్టు ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్ సంస్థ తెలిపింది. నిర్దేశిత సాంకేతికత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగగా నిర్ధిష్ఠ ఉత్పత్తి ఉన్నట్లు సర్టిఫై చేస్తూ డీజీసీఏ సర్టిఫికేషన్ జారీ చేసింది.
అధునాతన డిజైన్ దీని సొంతం
ఐవోటెక్ వరల్డ్ గతంలో తయారు చేసిన మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఆవిష్కరించిన మోడల్ పరిమాణంలో 30 శాతం చిన్నదిగా ఉంటుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు దీపక్ భరద్వాజ్ వెల్లడించారు. అధునాతన డిజైన్ అయినప్పటికీ కొత్త ఉత్పత్తి రేటును పెంచలేదని వారు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేలకు పైగా డ్రోన్‌లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు భరద్వాజ్ చెప్పారు.
Also Read: Telangana Rains: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఏడాదంతా కురవాల్సిన వాన ఒక్కరోజులోనే..
రక్షణ రంగంలో డ్రోన్ సేవలు
రక్షణ రంగంలో డ్రోన్లు విశిష్ఠ సేవలు అందిస్తున్నాయి. సరిహద్దుల వెంట నిఘాలు ఇవి చక్కగా పనిచేస్తున్నాయని రక్షణ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. అంతే కాదు స్వల్పదూర లక్ష్యాలను చేధించేందుకు కూడా డ్రోన్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. రాబోయే రోజుల్లో డ్రోన్ సేవలు మరిన్ని రంగాలకు విస్తరించే అవకాశం ఉందని ఐవోటెక్ వరల్డ్ సహ వ్యవస్థాపకుడు భరద్వాజ్ తెలిపారు. వ్యవసాయరంగంలో మందులు పిచికారి చేయడం, పక్షుల నుంచి పంటలను కాపాడటం వంటి పనులను డ్రోన్లు సమర్థవంతంగా చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. రక్షణ రంగానికి అవసరం అయిన డ్రోన్లు కూడా ఉత్పత్తి చేయనున్నట్టు భరద్వాజ్ ప్రకటించారు.
విదేశాల నుంచి డ్రోన్ల దిగుమతి
ఇటీవల ప్రధాని మోదీ అమెరికా నుంచి డ్రోన్లు దిగుమతి చేసుకునేందుకు ఆ దేశంలో ఒప్పందం చేసుకున్నారు. అధునాతన డ్రోన్ల తయారీలో ప్రాన్స్, అమెరికా దేశాలు దూసుకుపోతున్నాయి. పక్షల సైజులో కూడా డ్రోన్లు తయారు చేసి నిఘాకు ఉపయోగిస్తున్నారు. రాబోయో కాలంలో నిఘా నేత్రాలుగా డ్రోన్లు పనిచేయనున్నాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలోనూ అనేక స్టార్టప్ కంపెనీలు డ్రోన్లు తయారు చేసి విక్రయిస్తున్నాయి. వాటి నిర్వహణపై కూడా ఉచితం శిక్షణ అందిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయరంగంలో నిరుద్యోగ యువతకు డ్రోన్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఒక డ్రోన్ చేతిలో ఉంటే ఒక నిరుద్యోగ యువతకు కావాల్సిన ఉపాధి లభిస్తుందని భరద్వాజ్ పేర్కొన్నారు.
Also Read: Minister Niranjan Reddy: 24 గంటలు కరెంటు ఉందంటే అది తెలంగాణ మాత్రమే.!