వార్తలు

ధరణి సమస్యల పరిష్కారానికై కొత్త ఆప్షన్స్

0
dharani portal

Harish Rao Review Meeting On Dharani Portal Issues రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మానస పుత్రిక, భూ సంస్కరణలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో అనేక సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ధరణి పోర్టల్ లో లోపాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం భావిస్తున్నట్టు భూ సమస్యలకు పరిష్కారం దక్కకపోగా కొత్త సమస్యలు వచ్చి పడుతుండడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తిరగలేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు రైతులు ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ అనేది పూర్తిగా నిబద్దతో పని చేస్తుందని చెప్పుకొస్తుంది. తాజాగా ధరణి పోర్టల్ సమస్యల పరిష్కరానికి రాష్ట్ర మంత్రి వర్గం పరిశీలించింది. ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సీస్ సోమేశ్ కుమార్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

harish rao

Dharani Need New Options ధరణి పోర్టల్ లో 46 సమస్యలకు సంబంధించిన మాడ్యూళ్లు లేవని గుర్తించింది అధికార బృందం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టాలంటే పోర్టల్ లో మరిన్ని ఆప్షన్స్ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ధరణి పోర్టల్ లో 31 సేవలు మరియు 10 సమాచార మాడ్యూళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వీటిని పెంచేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ సమస్యను పరిష్కరిస్తే రైతులు ఇబ్బందులు పడరని , సాంకేతికంగా మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ధరణి పోర్టల్ లో ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేలా పోర్టల్ ఏర్పాటు చేయాల్సిందిగా నేతలు చర్చించారు.

dharani portal

Dharani Portal Problems కాగా.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. తెలంగాణలో భూముల వివాదాలే ఉండకూడదని.. అన్ని లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో దీనిని రూపొందించారు. అన్ని భూ సమస్యలకు ధరణియే పరిష్కారమని ప్రభుత్వం చెబుతోంది. రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్, విచక్షణ లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ ఈ ధరణి. భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. ధరణి ప్రారంభంతో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయి. అయితే పోర్టల్ లో అవసరమైన మరికొన్ని అప్షన్స్ ఎర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొస్తే మరిన్ని ఫలితాలు చూడవచ్చు. Harish Rao Review Meeting

Leave Your Comments

ఆరుతడి పంటలే వేయాలి: సీఎం కేసీఆర్

Previous article

వెంకయ్య…కేంద్రం వడ్లు తీసుకోమంటుంది ఏం చేద్దాం మరి!

Next article

You may also like