తెలంగాణవార్తలు

 PJTSAU: వ్యవసాయ విశ్వవిద్యాలయము M.P.C స్ట్రీం కోర్సులకు వాక్.ఇన్.కౌన్సిలింగ్

3
PROFESSOR JAYASHANKAR TELANGANA STATE AGRICULTURAL UNIVERSITY
PROFESSOR JAYASHANKAR TELANGANA STATE AGRICULTURAL UNIVERSITY

 PJTSAU:  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందిస్తున్న ఎం.పీ.సీ స్ట్రీం కోర్సులైన టువంటి బి.టెక్. (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) బి.టెక్ (ఫుడ్ టెక్నాలజీ) మరియు బి.ఎస్సి (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో మిగిలిపోయిన కాలేజీ సీట్ల భర్తీకి 30.08 2023 తారీకు వాక్. ఇన్. కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. వెంకట రమణ తెలిపారు.

బి.టెక్. (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) మరియప బి.టెక్ (ఫుడ్ టెక్నాలజీ) 40 శాతం సీట్లు ఫార్మర్ కోటాకు మరియు బీ.ఎస్సీ (ఆన్సర్) కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో 40 శాతం సీట్లు రూరల్ కోటకు కేటాయించబడినవి.

Also Read: Palamuru-Rangareddy: ఇది తెలంగాణ చారిత్రాత్మక విజయం, రైతుల విజయోత్సవాలు

PJTSAU

PJTSAU

ఇంటర్మీడియట్ ఎం.పీ.సీ స్ట్రీంలో పాసై TS EAMCET ర్యాంక్ లేదా ఇంటర్మీడియట్ (ఎంపీసీ) మరియు తత్సమానమైన కోర్సులలో ఉత్తీర్ణులైన ఆసక్తిగల అభ్యర్థులు ఈ వాక్ ఇన్ కౌన్సిలింగ్ కి హాజరు కావచ్చు.

TS EAMCET లో ఉత్తీర్ణులై PJTSAU కి ఇంతకు ముందు అఫ్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఈవాక్ ఇన్ కౌన్సిలింగ్ కు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు నిర్ణీత ఫీజు సూమారు 45,000తో హజరు కావలెనని రిజిస్టార్ తెలిపారు. సీట్లు సంఖ్య, ఫీజు, అర్హత ప్రమాణాలు తదితర సమగ్ర సమాచారం కొరకు యూనివర్సిటీ వెబ్సైట్ WWW. PJTSAU. EDU.IN ను చూడగలరని రిజిస్టార్ డా.యం. వెంకటరమణ తెలిపారు.

Also Read: Acharya N.G. Ranga Agricultural University: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో డ్రోగో డ్రోన్స్ అవగాహన ఒప్పందం

Leave Your Comments

Palamuru-Rangareddy: ఇది తెలంగాణ చారిత్రాత్మక విజయం, రైతుల విజయోత్సవాలు

Previous article

Niranjan Reddy: మూడవరోజు పర్యటనలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Next article

You may also like