వార్తలు

ఉద్యమానికి స్వస్తి.. ఇంటికి వెళ్లనున్న రైతులు

0
rakesh tikait

Farmers Set To End Protests

Farmers Set To End Protests కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుదీర్ఘ పోరాటం చేసిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన చట్టాల్లో లొసుగులు ఉన్నాయంటూ, ఆ చట్టాలు రైతులను కూలీలుగా మార్చేవిధంగా ఉన్నాయంటూ రైతులు భగ్గుమన్నారు. దాదాపు ఏడాదిపాటు అలుపెరగని ఉద్యమానికి నాంది పలికారు. 40 రైతు సంఘాలతో కూడిన ఈ పోరాటంలో చివరకు రైతే గెలిచాడు. కేంద్రం మెడలు వంచి ఆ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకునేలా చేసింది. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ దిగివచ్చారు. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. సాగు చట్టాలను కేంద్రం పార్లమెంటు సాక్షిగా రద్దు చేసి బిల్ పాస్ చేసింది. అయితే మరికొన్ని డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు నష్టపరిషారం, కేసులు కొట్టివేత, కనీస మద్దతు ధర తదితర డిమాండ్లను లేవనెత్తారు. అయితే తాజా పరిస్థితి చూస్తుంటే రైతు ఉద్యమానికి పుల్ స్టాప్ పడే అవకాశాలున్నాయి. రైతుల డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో ఢిల్లీ రైతుల ఉద్యమానికి స్వస్తి పలికేందుకు రైతులు సిద్ధమయ్యారు.

 

amit shah

Delhi Farmers రైతు సంఘాలతో నిన్న మంగళవారం కేంద్రం హోమ్ మినిష్టర్ అమిత్ షా మాట్లాడారు. రైతు సంఘాలతో కూలంకషంగా చర్చించిన అమిత్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని రైతు సంఘాలకు సూచించారు, ఈ విషయాన్నీ రైతు సంఘం నేత కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. కేంద్రంతో జరిపిన చర్చలపై దాదాపుగా సానుకూలమైన హామీలు వచ్చినట్లు అయన అన్నారు. అదేవిధంగా కేంద్ర సర్కారు నుంచి లేఖ వచ్చినట్లు అయన మీడియా సమావేశంలో తెలిపారు. మున్ముందు లేవనెత్తాల్సిన సమస్యలు, మరియు ఆందోళనపై రైతు సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు కుల్వంత్ చెప్పారు. మొత్తంగా రైతులతో అమిత్ షా చర్చలు ఫలించినట్లు తెలుస్తుంది. రైతులపై సానుకూలంగా కేంద్రం వ్యవహరించడంతో రైతులు నేడు ఉద్యమానికి స్వస్తి చెప్పేందుకు సిద్ధమయ్యారు. Farm Laws

Farmers Set To End Protests

దీనిపై భారత్‌ కిసాన్‌ యూనియన్‌ రాకేష్‌ టికాయత్‌ Rakesh Tikait కూడా కొంత క్లారిటీ ఇచ్చారు.. ఆందోళన విరమణపై తుది నిర్ణయం బుధవారం తీసుకుంటామని వెల్లడించారు. ఆయన ఉత్తరాఖండ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో మంగళవారం జరిగిన సమావేశంలో పాల్గొనలేదు. అయితే బుధవారం జరిగే సమావేశంలో టికాయత్‌ పాల్గొననున్నారు. ఏదిఏమైనా ఈ విషయంలో ఎస్‌కేఎం బుధవారం ప్రకటనతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఇవాళ ఆందోళన విరమణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు రైతు సంఘాల నేతలు. ఏడాదిపాటుగా అలుపెరగని పోరాటానికి నేడు ఫుల్ స్టాప్ పడనుంది. Delhi Farmers Protest Will End Today

Leave Your Comments

Animal Husbandry: పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా డా. రామచందర్.!

Previous article

రైతులపై కోవిడ్ ప్రభావం ఎంత?

Next article

You may also like