మన వ్యవసాయంవ్యవసాయ వాణిజ్యం

రంగురంగుల కాలీఫ్లవర్​.. పోషకాలు పుష్కలం

0
maharashtra-mahindra-nikam-from-malegaon-dabhadi-village-cultivated-hybrid-cauliflowers

కాలిఫ్లవర్​ను మనం ఎప్పుడూ తెలుపు రంగులోనే చూసుంటాం. కానీ, పుసుపు, గులాబీ రంగుల్లో ఎప్పుడైనా చూశారా?.. అసలు అలాంటివి ఉంటాయా?.. అనిపిస్తోంది కదూ?.. అవును.. మీరు విన్నది నిజమో.. కాలిఫ్లవర్​లో కలర్స్ కూడా ఉన్నాయి. అది కూడా మన దేశంలోనే.. మహారాష్ట్రలోని నాశిక్​లో దభారీ గ్రామానికి చెందిన ఓ రైతు హైబ్రీడ్​ కాలీఫ్లవర్​ను పండించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే హాట్​టాపిక్​గా మారింది.

అసలు ఇది ఎలా సాధ్యమని అతన్ని అడగ్గా.. 2 నెలల క్రితం 40వేలు పెట్టి కాలిఫ్లవర్ విత్తనాలను కొని.. ఎకరా పొలంలో చల్లాడట. అయితే, పంట వేసిన తర్వాత ఇలా పసుపు, గులాబీ రంగు కాలీఫ్లవర్స్​ రావడం మొదలయ్యిందని చెప్పుకొచ్చారు. అయితే, వీటిని పండించేందుకు పెద్దగా ఖర్చేమీ కాలేదని అన్నారు.

సాధారణ కాలీఫ్లవర్​ కంటే.. హైబ్రీడ్​ పంటతో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం, పాస్పరస్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఇనుము, A, B, C విటమిన్లు, అయోడిన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. తెలుపు రంగులో ఉండే కాలీఫ్లవర్​ను భారతీయులు విరివిగా వంటల్లో ఉపయోగిస్తుంటారు.

అలాగే, వీటిని కూడా ఎలాంటి సందేహాలు లేకుండా వంటల్లో వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉపయోగించడంలో ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని హామీ ఇస్తున్నారు. కాగా, తెల్లగా ఉన్న కాలీఫ్లవర్​ దరకే ఈ రంగురంగుల కాలీఫ్లవర్​ పలుకుతుందని.. అదనంగా ఎటువంటి ధరలు పెంచే ప్రసక్తి లేదని మహారాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తెలిపారు.

Leave Your Comments

ఆంధ్రా అరటికి విదేశాల్లో పెరుగుతోన్న డిమాండ్​…

Previous article

ప్రతి రైతుకు కచ్చితంగా కనీస మద్దతు ధర దక్కాలి: సీఎం జగన్

Next article

You may also like