Environmental Activities Sneha Shahi Story ప్రకృతి ఇచ్చిన వాటిని అవసరాలకు వాడుకుని అదే ప్రకృతిని సర్వ నాశనం చేస్తున్నాం. ప్రతి ఏడాది జూన్ 5న పర్యావరణ దినంగా పాటిస్తూ.. మిగతా రోజులన్నీ ప్రకృతిపై పగపడుతున్నాడు మనిషి. తన స్వార్ధ ప్రయోజనాలకోసం ప్రకృతి వనరులను అవసరానికి మించి వాడుకోవడం ద్వారా ప్రకృతిపై కోలుకోలేని ప్రభావం పడుతున్నది. ఇక పరిశ్రమలను స్థాపించి ఆ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో పీల్చేగాలి, తాగే నీరు, తినే ఆహారం కాలుష్యమవుతున్నది. అయితే ఈ కాలుష్యాన్ని అరికట్టకపోతే మునుముందు అనేక క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే అనేక సంస్థలు సూచించాయి. ఇక మనిషి చేసిన తప్పుగా జంతువులు శిక్ష అనుభవిస్తున్నాయి. మనిషి సృష్టించే కాలుష్యానికి అనేక జంతువులు, నీటిలో నివసించే జీవరాశులు బలి అవ్వడమే కాదు, ఆ జాతులు అంతరించిపోతున్నాయి. UNEP Plastic Tide Turner Ambassador
UNEP మనిషి సృష్టించే జల కాలుష్యం మూలంగా ఇప్పటికే నీటిలో నివసించే జంతు జాతులు గంగలో కలిసిపోయాయి. నీటిలో వ్యర్ధాలను వేయడం ద్వారా నీటిలో నివసించే చేపలు, మొసళ్ళు, తాబేళ్లు ఇలా అనేక జీవరాశులు మరణిస్తున్నాయి. కానీ కొందరు ప్రకృతి ప్రేమికుల మూలంగా నీటిలో నివసించే జంతువులు బ్రతుకు సాగిస్తున్నాయి. గుజరాత్ కి చెందిన స్నేహ షాహీ ఒక ప్రకృతి ప్రేమికురాలు. 2019 లు ఆమె తీసుకున్న నిర్ణయం ఎన్నో జీవరాశుల్ని బ్రతికిస్తుంది. 2019లో బరోడాలో Baroda ని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ప్లాస్టిక్ టైడ్ టర్నర్ ఛాలెంజ్ లో చేరిన స్నేహ 300 మంది ఇతర విద్యార్థులతో పర్వావరణ కాలుష్యంపై పోరాటం మొదలు పెట్టింది. ఆమె చేపట్టిన ప్రచారం కోసం దేశం నుండి 18 అనుబంధ సభ్యులు ఉన్నారు. Who Is Sneha Shahi
ముందు వారు తమ కాలేజీ క్యాంపస్ లోని ఒక కాలువను శుభ్రం చేయగా ఆమె అనేక షాకింగ్ విషయాలను చూసిందట. ఒక చిన్న కాలువలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాల ద్వారా ఎన్నో జీవరాశులు మరణిస్తున్నాయని స్నేహ గ్రహించింది. ఆమె కార్యకలాపాల్లో భాగంగా ముందుగా 700 కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించింది. వర్షాకాలంలో గంగానది ఫ్లాప్‌షెల్ తాబేళ్లు మరియు మొసళ్లు నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చాయని, అయితే విశ్వవిద్యాలయం ద్వారా కంచెలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. మైక్రోప్లాస్టిక్, థర్మాకోల్ మరియు గాజు సీసాలతో సహా ప్రవాహం నుండి సేకరించిన వ్యర్థాలను రీసైకిల్ చేశారు. వాటిలో కొన్ని క్యాంపస్ లోపల వాల్ హ్యాంగింగ్‌లు మరియు ప్లాంటర్‌లుగా మార్చారు. స్నేహ మరియు ఆమె బృందం చేస్తున్న మంచి పనికి గానూ.. భుఖి స్ట్రీమ్ ప్రాజెక్ట్ యూత్ ఫర్ ఎర్త్ అవార్డుకు నామినేట్ చేసింది. Sneha Shahi Story