Tractor Platform Trolley: పాడి పశువులని పెంచుకునే రైతులు రోజు పశువుల కోసం గడ్డి కోయాల్సి ఉంటుంది. పశువులకి ఎక్కువ గడ్డి అవసరం ఉంటుంది. గడ్డి తీసుకొని రావడానికి ట్రాక్టర్ని వాడుకోవాలి. ట్రాక్టర్ వాడడం అని ప్రదేశంలో వీలు కాదు. ట్రాక్టర్ ట్రాలీలో గడ్డి తీసుకొని రావడం వల్ల చాలా వరకు ట్రాలీ బరువు ఎక్కువగా ఉండి ట్రాక్టర్ ఇంజిన్ వెనకల్కి పడి చాలా మంది చనిపోయారు. ఈ సమస్యని పరిష్కరించడానికి నగర్ కర్నూల్ రైతు పర్వత్ రెడ్డి గారు ట్రాక్టర్‌తో గడ్డి తీసుకొని వెళ్ళడానికి ఒక ప్లాటుఫారం లాంటిది ఇనుప రాడ్‌తో ఏర్పాటు చేసుకున్నారు.
Also Read: Mist Blower Sprayer: ఎరువులు వృధా కాకుండా ఉండాలంటే ఈ పరికరాన్ని వాడాల్సిందే.!
ఈ ప్లాటుఫారం ట్రాక్టర్ 3 పాయింట్ హిచ్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. గడ్డి కింద పడకుండా రెండు పక్కన కర్రలు పెట్టుకోవాలి. ఈ ప్లాటుఫారంలో ట్రాలీలో పట్టే అంత గడ్డి పడుతుంది. ఈ ప్లాటుఫారం వాడడం ద్వారా ట్రాక్టర్ మలుపులో కూడా సులువుగా తిరుగుతుంది. దీని వాడడం వల్ల ఇంజిన్ బోల్తా పడే ప్రమాదం ఉండదు.
ఇంకా ఎక్కువ గడ్డి తీసుకొని రావాలి అనుకుంటే ట్రాక్టర్ ముందు భాగంలో ఈ ప్లాటుఫారంని ట్రాక్టర్ బంపర్‌కి కనెక్ట్ చేసుకోవాలి. ఇలా రెండు ప్లాటుఫారం ద్వారా ఒకేసారి ఎక్కువ గడ్డిని పశువుల దగరికి తీసుకొని రావచ్చు. ఈ ప్లాటుఫారం తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. మనకి దగరలో ఉన్న వెల్డింగ్ వాళ్ళు కూడా తయారు చేసి ఇస్తారు. ఈ ప్లాటుఫారం వాడడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ గడ్డిని కావాల్సిన స్థలంలోకి తీసుకొని వెళ్ళవచ్చు.
Also Read: Water Bubble Gate Valve: ఈ పరికరం ద్వారా ఎరువులు సులువుగా వేసుకోవచ్చు…