Micro Nutrient Management in Mango: సూక్ష్మపోషకాలు మొక్కలకు అతి తక్కువ పరిమాణంలో కావలసిన పోషకాలను సూక్ష్మపోషకాలు అంటారు. కాపర్, జింక్, ఇనుము, మాంగనీసు మరియు మాలిబ్దినం మొదలగునవి.
సూక్ష్మపోషకాలు లోపాలు రావడానికి గల కారణాలు :
1. సరిగా చివకని సేంద్రియ ఎరువుల వాడకం, తగినంతగా సేంద్రియ ఎరువుల వాడకం
2. మోతాదుకి మించి నత్రజని, భాస్వరం వంటి ఎరువులను విరివిరిగా వాడడం వలన
3. బహుళ పోషక ఎరువులు (కాంప్లెక్సు) ఎరువులు అధికంగా వాడటం వలన
4. సున్నపు క్షారగుణం అధికంగా గల నేలలు
5. ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండడం.
తెలంగాణలో మామిడి ఉత్పత్తి 10.23 లక్షల మెట్రిక్ టన్నులు. మామిడి ఉష్ణమండల పంట, సరాసరి 24`30ం సెల్సియస్ ఉష్టోగ్రత మిక్కిలి అనుకూలము.
ఫలరాజు అయిన మామిడి సాగుకు మన రాష్ట్రంలోని వాతావరణము చాలా అనుకూలంగా ఉండి మంచి నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది. మన రాష్ట్రములో పండిరచే మామిడి పండ్లు మన దేశములోనే కాక ఇతర దేశాల వారు కూడా దిగుమతి చేసుకొని ఇష్టంగా తింటున్నారు
1. జింక్
2. బోరాన్
3. ఇనుముథాతు
4. కాల్షియం
Also Read: Jasmine Cultivation: సువాసన వెదజల్లే మల్లెల సాగుకు వేళాయె.!
1. జింక్
లక్షణాలు :
. జింకు లోపం సాధారణంగా చౌడు నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాయి.
. పెరుగుదల దశలలో జింకు లోపమున్న ఆకులు చిన్నవిగా మారి, సన్నబడి, పైకి లేదా క్రిందికి ముడుచుకొని పోతాయి.
. జింక్ లోపమున్న మొక్కలలో కణుపుల మధ్యదూరం తగ్గిపోయి, ఆకులు గులాబి రేకుల వలె గుబురుగా తయారవుతాయి.
. మొక్కల పెరుగుదల క్షీణించి, కాయల పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది.
నివారణ :
కాయలు కోసిన వెంటనే జూన్`జూలై మాసాల్లో 15 రోజుల వ్యవధిలో 2 సార్లు లీటరు నీటికి 5 గ్రా. జింక్ సల్ఫేట్తో పాటు 10 గ్రా. యూరియాను మరియు 0.1 మి.లీ. స్టికర్/వెట్టర్ (ఇన్డోట్రాన్ లేదా (టైటాన్) కలిపి పిచికారి చేయడం వలన జింకు లోపాన్ని నివారించవచ్చు.
2. బోరాన్ :
లక్షణాలు :
. చెట్ల ఆకులు కురచబడి, ఆకు కొనలు నొక్కుకుపోయినట్లయి పెళుసుగా తయారవుతాయి.
. కాయ దశలో కాయలు పగుళ్లు చూపడం సర్వసాధారణంగా కనబడే లక్షణం
నివారణ :
. బోరాన్ లోప నివారణకు ప్రతి మొక్కకు 100 గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి లేదా 0.1`0.2% బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినపుడు 1 లేదా 2 సార్లు పిచికారి చేయాలి.
3. ఇనుముథాతు లోపం :
లక్షణాలు :
. చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి.
. ఆకుల సైజు తగ్గిపోయి, తీవ్రమైన లోపం ఉన్న ఎడల మొక్కల ఆకులు పై నుండి క్రిందికి ఎండిపోతాయి.
. ఇనుముథాతు లోపం సాధారణంగా సున్నపురాయి నేలలో కనబడుతుంది.
నివారణ :
. 2.5 గ్రా. అన్నబేధి G 1 గ్రా. నిమ్మ ఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
Also Read: Acacia Tree Medicinal Uses: ఎన్నో ఆయుర్వేద గుణాలున్న తుమ్మ చెట్టు గురించి మీకు తెలుసా.!
Also Watch: