Irrigation Water Management: ప్రకృతి ఇచ్చిన సంపదలలో నీరు ప్రధానమైనది. జీవకోటికి నీరు ప్రాణాధారము అదే విధం గా పంటలకు కూడా నీరు చాలా అవసరం. నీటిని ఒక ప్రధాన పోషక పదార్థం గా పరిగణించవచ్చు. నీరు యానకంగా పనిచేసి అనేక పోషక పదార్థాలను మొక్కలకు అందిస్తుంది. నీటి పారుదల వసతులు లేని చోట పంటలు వర్షాధారం గానే పండించ బడతాయి.
వర్షాధారపు పంటలు వర్షాభావము వల్ల గానీ, వర్షాలు ఎక్కువయి గాని ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. నీటి పారుదల గల ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడగానే పంటకు నీరు పెట్టి అధిక దిగుబడులను పొందవచ్చును.
ప్రస్తుతం మన రాష్ట్రంలో 115 లక్షల ఎకరాకు మాత్రమే నీటి పారుదల సౌకర్యం కలదు. రాష్ట్రంలో గల నీటి వనరులన్నీ సవ్యం గా వినియోగించ గలిగితే 254 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం కల్పించవచ్చు.
నీటీ పారుదల వసతులు కల్పించడం లో గల ఇబ్బందులు:-
ఒక ఎకరాకు నీటి పారుదల సౌకర్యం కల్పించాలంటే ప్రాజెక్టు నిర్మాణం, కాల్వాల త్రవ్వకం , నేల చదును చేయడం మురుగు నీరు పోవు సౌకర్యం కల్పించడం సుమారు రూ 15 వేల ఖర్చు ఆగును. ప్రస్తుతం పరిస్థుతులలో ఈ ఖర్చు ఇంకా అధికం అవుతుంది. అధిక ఖర్చుల దృష్ట్యా నీటి పారుదల సౌకార్యాలను ఇతర ప్రాంతాలకు కల్పించడం కష్ట తరం అవుతుంది.
మనదేశంలో సాగు నీరు చాలా దుర్వినియోగం చెందుతున్నది. జపాన్ లో ఒక ఎకరాకు వరి పండించడానికి వాడే నీటికి 3 రెట్లు నీరు మన దేశంలో వరి పండించడానికి వాడుతున్నారు. రైతులు నీటిని సమ్మర్ద వంతంగా వాడిన అధిక దిగుబడులు రాబట్ట వచ్చును.
Also Read: Watershed Management: నీటి పరీవాహక ప్రాంతం అంటే ఏంటి దానికి అనుకూలించే అంశాల గురించి తెలుసుకుందాం.!
అవసరానికి మించి నీటిని వాడిన మురుగు నీరు నిల్వ వలన , మరియు ఆవిరి రూపంలో నీరు వృధా అవడమే కాకుండా చవిటీ నేలలు గా మారిపోతాయి.
వేసిన రాసాయనిక ఎరువులు అధిక నీరు వల్ల నేల అడుగు పొరల లోనికి పోయి పంటకు అందకుండా పోతాయి. పంటలకు అధికంగా నీరు పెట్టడం వల్ల నేలలో కావల్సినంత ప్రాణ వాయువు లేక వేర్లు, మరియు సూక్ష్మ జీవులు పెరుగుదల తగ్గి పోషకాలు లభ్యత తగ్గును. కొన్ని పోషక పదార్థాలు ముఖ్యం గా నైట్రేట్లు భూ గర్భజలల్లో కలిసి నీటిని కలుషిత పరుస్తున్నాయి.
నీటి వసతులు – నాటి క్రింద సాగయ్యే జిల్లాలు:-
కాల్వల క్రింద – తూర్పు , పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, కరీంనగర్, ఖమ్మం, కర్నూలు
చెరువుల క్రింద – శ్రీకాకుళం, వరంగల్, నెల్లూరు, ఖమ్మం
బావుల క్రింద – కరీంనగర్, చిత్తురు, అనంతపూర్
వివిధ పంటలకు వినియోగించే నీటి శాతం:-
వరి -76.9%
వేరుశెనగ -5.5%
చేరకు -4.2%
రాగి -2.5%
మిర్చి -1.9%
సజ్జ -1.7%
మొక్కజొన్న – 1.2%
ప్రతి -0.6%
పొగాకు -0.7%
జొన్న -0.5%
పండ్లు – 3.6%
వరికి 3-4 రెట్లు నీరు మిగతా పైర్ల కంటే అధికంగా కావాలి.
Also Read: Salt Water Fish Farming: ఉప్పు నీటిలో చేపల పెంపంకం.!