Watershed Facts: వర్షం పడినప్పుడు నేలలో ఇంక గలిగినంత నీరు నేలలోనికి పోగా మిగిలిన నీరు ఉపరితల భూమి పై వాలు ను అనుసరించి ఒక ప్రత్యేక స్థానానికి చేరుటను వాటర్ షెడ్ అంటారు. ఈ నీటిని పరీవాహక ప్రాంత భౌగోళిక పరిస్థితిని బట్టి (ఎత్తు పల్లాలు) నీటిని నిల్వ చేయుటకు మరియు నేల కోతకు గురి కాకుండా తగు సంరక్షక డిజైన్లు తయారు చేసి – గట్లు, నీటి దారులు, చెక్ డాం లు, నీటి కుంట నిర్మాణాలు చేపడతారు. డిజైన్లు అత్యధిక నీటి ప్రవాహ పరిమాణాన్ని అనుసరించి తయారు చేస్తారు.
పరీవాహక ప్రాంత అభివృద్ధి చేయుటకు ముందు సేకరించ వలసిన సమాచారo (basic information)
· భూమి యాజమాన్యం
· నేల రకాలు, పంటలు పండించు పద్ధతులు, దిగుబడులు, సేద్యం చేయుటకు భూమి సామర్ధ్యం
· పశు సంపద గణాంకాలు
· వర్షపాతం, నేల కోత సమస్యలు, భూగర్భ జలాల సమాచారం
· ప్రస్తుతం ఉన్న, చెరువులు, బావులు, నీటి వనరుల సమాచారం
· పాఠశాలలు, బ్యాంకులు, పరపతి సౌకర్యం, మార్కెట్, ఆరోగ్య మరియు పశు వైద్య శాలలు వంటి సేవా సదుపాయాలు.
Also Read: Water Taking Methods: నీటి వనరుల నుండి పొలం లోకి నీరు తీసుకొని పోవు పద్ధతులు
పరీవాహక ప్రాంత యాజమాన్య సూత్రాలు: (principles of water shed management)
· భూమిని దాని సామర్ధ్యం ను అనుసరించి వినియోగించుట
· సారవంతమైన ఉపరితల నేలను రక్షించుట
· చెరువులు, రిజర్వాయిర్లు, పల్లపు భూముల్లో మేట వేయుట తగ్గించుట
· నేలలో నీరు ఇంకు గుణము ను పరి రక్షించుట
· ఉపరితల ప్రవాహాలు నేల కోత లేకుండా నీటి నిల్వ నిర్మాణం లకు మళ్ళించుట
· వృక్ష సంపద ను పెంపొందించుట
· నేల కోత వలన గల్లీలు ఏర్పడ కుండా చెక్ డ్యాములను నిర్మించుట – దీనివల్ల భూ గర్భ జలాలను పరిరక్షించుట
· అంతర పంటలు, పంటల సాంద్రత ను పెంచుట
· భూమి రకాన్ని బట్టి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా సమర్ధ వంతం గా వినియోగించుట
· water harvesting ద్వారా నీటి నిల్వ సామర్ధ్యం పెంచుట
· చిన్న తరహా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుట
· వ్యవసాయ అనుబంధ వ్యవస్థలైన పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం ద్వారా సంవత్సరాదాయం పెంచు కొనుట
· రైతుల సాంఘిక, ఆర్ధిక పరిస్థితులను మెరుగు పరచుట
పరీవాహక ప్రాంత యాజమాన్యo ను ప్రభావితం చేసే అంశాలు:
· వర్షపాత తీవ్రత – కాలం – పరిమాణం
· భూమి వాలు, భౌగోళిక పరిస్థితులు
· నేలల రకాలు – నీరు ఇంకు స్వభావం
· తేమ నిలుపుకునే సామర్ధ్యం
· పరీవాహక ప్రాంతం లో పండించు పంటలు, వృక్ష సంపద, నేలపై పెరిగే గడ్డి జాతి మొక్కలు మొదలైనవి.
పరీవాహక ప్రాంత యాజమాన్యం విభాగాలు:
· నేల మరియు నీటి సంరక్షణ
· ఎక్కువ వర్ష పాతం పడినప్పుడు అధికమైన నీటిని పల్లపు చోటికి చేర్చుట (water harvesting)
· పంట యాజమాన్యం
· ప్రత్యామ్నాయ భూ వినియోగ పద్ధతి
Also Read: Rules for Watering: నీటిని పెట్టే నియమావళిని తెలుసుకోండి.!