Water Taking Methods: నీటి వనరుల నుండి కాలువల ద్వారా పంట పొలానికి తీసుకొని పోవునపుడు దాదాపు 20% నీరు నేల లో ఇంకిపోవడం, నీరు ఆవిరిగా మారి గాలిలో కలవడం ద్వారా వృధా అవుతుంది. అంతే కాకుండా కాలువలు తెగిపోవడం, కలుపు మొక్కలు పెరిగి నీటి ప్రవాహాన్ని అడ్డుకొనడం, ఇవన్ని జరుగుతూ ఉంటాయి. ఇసుక నేలలో నీరు బాగా ఇంకి పోతుంది. ఇటువంటి నష్టాలను తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
· కాలువ లో కాన్వాసు పట్టా ను పరిస్తే నీరు ఇంకదు. ఈ పట్టా లను ఒక కాలువ నుండి మరొక కాలువ కు మార్చ వచ్చు.
· అర్ధ చంద్రాకారం గా చేసిన మట్టి పెంకులు లేదా సిమెంటు పెంకులను కాలువ పొడవునా పేర్చుకొని నీరు పెట్ట వచ్చు. కాని వీటిని ఒక కాలువ నుండి మరొక కాల్వ కు మార్చడానికి వీలు కాదు. జాగ్రత్త గా వాడితే చాలా కాలం మన్నుతాయి.
· కాలువలు లేకుండా బావి దగ్గర నుండి చాలా దూరం గా ఉండే పొలానికి నేల లోపల వేసిన సిమెంటు గొట్టాల ద్వారా నీరు తీసుకొని పోతుంది . ఈ పద్ధతి చిత్తూరు జిల్లా రైతులు ఇతరుల సాంకేతిక సహాయం లేకుండా వేసుకొని నీటి నష్టాన్ని తగ్గించి పంటలు పండిస్తున్నారు. 22.5 సెం. మీ వ్యాసం గల సిమెంటు గొట్టాలు భూమిలో దాదాపు 90 సెం. మీ లోతున నేలలో పరచాలి. ఈ పద్ధతి పాటించాలంటే నీటి వనరు పొలం కంటే ఎత్తులో ఉండాలి.
Also Read: Paddy Crop Protection: వరి పంటలో వచ్చే వివిధ రకాల దోమ రోగాలు మరియు వాటి నివారణ చర్యలు
నీటి పారుదల ను అదుపు చేయు పద్ధతులు:
నీరు కాల్వల ద్వారా పంటలకు పెట్టునపుడు నీటిని ఒక మడి నుండి ప్రక్క మడి కి మళ్ళించడానికి కాలువను ఒక ప్రక్క తెగ గొట్టి, ప్రవాహానికి అడ్డుగా ఆ మన్ను వేయడం కష్ట సాధ్యమైన పని. ఇలా కాల్వలు తెప్పకుండా కూలి ఖర్చులు ఎక్కువ పెట్టకుండా, కాలువ లోని నీరు సులభం గా మడుల లోనికి మళ్ళించడానికి చాలా సాధనాలు ఉన్నాయి.
సైఫస్ గొట్టాలు: ఇవి వంపు తిరిగి, అర్ధ చంద్రాకారం లో 60 సెం. మీ పొడవు కలిగి ఉంటాయి. వీటి వ్యాసం 5 – 10 సెం. మీ వరకు ఉంటుంది. ప్లాస్టిక్ కాని, అల్యూమినియం గాని లేక రబ్బరు గొట్టాలు గాని వాడవచ్చు. గొట్టము ను నీటితో నింపి ఒక కొనను కాల్వలో నీటిలో ఉంచి రెండవ చివరను మడి లోనికి పెట్టాలి. అయితే మడి కంటే కాలువ నీటి మట్టం ఎత్తులో ఉండాలి. అపుడే కాలువ లో ని నీరు మడి లోనికి వస్తుంది. కాలువ లో పారే నీటిని బట్టి ఎన్ని గొట్టాలు ఒకేసారి వాడుకోవచ్చు నిర్ణయించుకోవాలి.
స్పైల్స్: (spiles) – ఇవి 3′ పొడవు ఉండి 2 – 10 సెం. మీ వ్యాసం కలిగిన గొట్టాలు. ఇవి పాలిథీస్ తో గాని, సిమెంటు తో గాని వెదురు తో గాని చేయవచ్చు. ఈ గొట్టము గట్టు గుండా ఒక చివ కాలువలోనికి, ఇంకో చివర పొలము లోనికి పెట్టాలి. ప్రతి సారి గట్టును తెంచకుండా వీటిని వాడవచ్చు.
కాన్వాసు పట్టా (canvas dam): నీటి మట్టం పెంచే డానికి, కాలువకు అడ్డుకట్ట వేయకుండా కాన్వాసు పట్టాను ఒక 53. వెదురుకు కట్టి దానిని నీటి ప్రవాహానికి అడ్డం గా ఉండేటట్లు రాయి గాని, మట్టి గాని బరువు గా పెట్టి నింపవచ్చు. కాన్వాసు బదులు రేకును వాడవచ్చు. ముఖ్యం గా సైఫన్ గొట్టాలు వాడేటప్పుడు కాలువ లోని నీటి మట్టం పెంచ దానికి కాన్వాసు పట్టా ను అనకట్ట గా వాడుకోవచ్చు.
Also Read: Trypanosomiasis in Cow: ఆవులలో ట్రిప్ నోసోమియాసిస్ వ్యాధి ఎలా వస్తుంది