నీటి యాజమాన్యం

Sprinkler Irrigation: స్ప్రింక్లర్ పద్ధతి తో కరువు ప్రాంతాల్లో నీటి ఆదా

2
Sprinkler Irrigation Method
Sprinkler Irrigation Method

Sprinkler Irrigation: ఈ పధ్ధతి లో పైరు మీద వర్షపు జల్లు పడేటట్లు నీరు చిలకరించడం జరుగుతుంది.నేలపైన అల్యూమినియం లేదా పివిసి పైపులతో చేయబడిన తేలిక గొట్టాలను వేసి వీటికి నాజిల్స్ సమాన దూరాల్లో బిగించి పైపుల ద్వారా నీటిని ఒక క్రమ మైన పీడనము తో (1.5 నుండి 3.0 కిలోలు / సెం. మీ 2) పంపించడం వల్ల నాజిల్స్ యొక్క సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు నేల ఉపరితలం పై వర్షపు జల్లు లాగ పడుతుంది.నేలంతా తడిపే టట్లు గొట్టాలను మార్చుకోవాలి.

నాజిల్ సైజు, ఎత్తు, నాటిల్ కు నాజిల్ కు మధ్య దూరం, పంపు చేయవలసిన నీరు – ఇవన్నీ పైరు ని బట్టి, నేల రకాన్ని బట్టి, నీటి అవసరాన్ని బట్టి మార్చు కోవాలి.స్ప్రింక్లర్ లో అతి ముఖ్య భాగం “స్ప్రింక్లర్ హెడ్’. దీనికి రెండు రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రము సైజు 4 – 5.6 మి.మీ వరకు, రెండవది 3.13 మీ మీ ఉంటుంది. ఎక్కువ పీడనం కలది 2-4 కేజీలు/సెం మీ. తక్కువ పీడనం కలది 0.34 2.72 కిలోలు/చ సెం.మీ వరకు పని చేస్తాయి.

ఎక్కువ పీడనం కలది సుమారు 35 మీటర్ల వ్యాసం కలిగిన నేలను తడప గలదు. తక్కువ పీడనం కలది సుమారు 30 మీటర్ల వ్యాసం కలిగిన నేలను తడప గలదు.స్ప్రింక్లర్ నాజిల్ నుండి వచ్చే నీటి బిందు పరిమాణం పైపు లోని పీడనం పై ఆధారపడి ఉంటుంది. తక్కువ పీడనం వుంటే నీటి బిందు పరిమాణం పెద్దవి గా విడుదల అవుతాయి. అట్టి పరిస్థితులలో పంటకు, నేలకు హాని కలుగుతుంది. అందుచేత అవసరమైనంత పీడనం తోనే స్ప్రింక్లర్ ల ను ఉపయోగించాలి.

Also Read: Sorghum Insect Pests: జొన్న పంటలో మొవ్వు ఈగ రియు కాండం తొలుచు పురుగు ను ఎలా నివారించాలి

Sprinkler Irrigation

Sprinkler Irrigation

స్ప్రింక్లర్ లలో ముఖ్య భాగాలు:

· నీటి వసతి, పంపు స్టేషన్

· పంపు కనెక్షన్

· ఆరు మీటర్ల పొడవు గల HDPE పైపులు, కప్లింగ్ /లాంచింగ్ తో సహా)

· స్పింక్టర్ సాడిల్

· స్పింక్టర్ హెడీ (నాటిల్)

· రైజర్ పైపులు (20 మి.మీ చుట్టు కొలత తో 76 సెం.మీ పొడవు)

స్ప్రింక్లర్ ల వల్ల లాభాలు:

సంప్రదాయ నీటి పారుదల పద్ధతుల్లో కాల్వలకు, గట్లకు కొంత నేల నష్టం అవుతుంది. ఈ పద్ధతిలో నష్టం ఉండదు.సాంప్రదాయ పద్ధతులలో కాల్వల గుండా నీరు పారునపుడు ప్రక్కలకు నీరు పారి 35 % నీరు వృధా అవుతుంది. పంటకు కావలసిన సమయం లో తగినంత పరిమాణం లో నీరు అందించడం వలన పంట దిగుబడి 5 – 20% వరకు పెంచడమే కాక పంట నాణ్యత కూడా పెరుగుతుంది.

నీరు అట్టడుగు పొరలలోనికి పోకుండా వేరు లోతు వరకే నీరు పోయేటట్లు చేసి నీటి వృధా ను అరికట్టవచ్చు నేలపై నీరు నిలువ ఉండదు.. కనుక తగినంత గాలి మొక్కల వ్రేళ్ళు అందజేయబడుతుంది.ఎగుడు దిగుడు నేలల్లో పంటలు పండించుటకు ఈ నీటి పారుదల పధ్ధతి అనుకూలం.నీటి తుంపర్లు గా మొక్కలపై పడడం వల్ల పరిసరాలు చల్లబడి అధిక ఉష్ణోగ్రతల నుండి పంటలను కాపాడవచ్చు.

Also Read: Drip Irrigation Techniques: డ్రిప్ నీటి పారుదలలో కొన్నిమెళుకువలు.!

Leave Your Comments

Sorghum Insect Pests: జొన్న పంటలో మొవ్వు ఈగ రియు కాండం తొలుచు పురుగు ను ఎలా నివారించాలి

Previous article

Infectious Bursal Disease in Chickens: కోళ్ళలో గంబోరో వ్యాధి ని ఎలా నివారించాలి.!

Next article

You may also like