నీటి యాజమాన్యం

Irrigation for Plants: మొక్కలకి నీటి పారుదల వేటి పైన ఆధారపడి ఉంటుంది.!

1

Irrigation for Plants: మొక్కలకు అవసరమైన నీటిని నేల ద్వారా అందించడమే “సాగునీటి సరఫరా (IRRIGATION) అంటారు. లేదా మొక్కలకు అవసరమైన నీటిని నేల ద్వారా కృత్రిమం గా అందించడమే “సాగునీటి సరఫరా” అంటారు. అవసరాన్ని బట్టి పైరుకు నీరు పెట్టాలి. ఎన్ని తడులు పెట్టాలి, తడుల మధ్య ఎంత కాల వ్యవధి ఉండాలి అనే విషయం ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.

నేల స్వభావం: నేలలో ఇసుక, ఒండ్రు, బంక మన్ను (ఖనిజ పదార్ధం), సేంద్రియ పదార్ధం ఉంటాయి. ఇసుక పాలు ఎక్కువగా వుంటే తేలిక నేలలు అని, బంక మన్ను ఎక్కువ గా ఉంటే బరువైన నేలలు అంటారు. తేలిక నేలల్లో స్థూల రేంద్ర పరిమాణం ఎక్కువ సూక్ష్మ రంధ్రాలు పరిమాణం తక్కువ గా ఉండడం వల్ల నీటి నిల్వ సామర్ధ్యం తక్కువ. కాని మురుగు నీరు నిలబడదు.

బరువు నేలల్లో ఒండ్రు, బంక మన్నుల శాతం అధికం గా వుండడం వల్ల స్థూల రంద్ర పరిమాణం తక్కువగా ఉండి సూక్ష్మ రంద్ర పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల అటువంటి నేలల్లో నీటి నిల్వ సామర్ధ్యం ఎక్కువగా వుండి మురుగు నీరు పోవు సౌకర్యం తక్కువగా ఉంటుంది.

ఇసుక, ఒండ్రి(గరప), బంకమన్నులు సమ పాళ్ళలో గల నేలలు వ్యవసాయానికి మంచి నేలలు. ఈ నేలల్లో నీటి నిల్వ సామర్ధ్యం, మురుగు నీరు పోవు సౌకర్యం, గాలి ప్రసరణ సమ స్థాయిలో వుండడం వల్ల పంటల ఎదుగుదల, దిగుబడులు బాగుంటాయి.నేలను 30 సెం.మీ లోతుకు తడిపినచో – ఇసుక నేలలు 2.5 సెం. మీ గరువు నేలలు 3.75 సెం.మీ, బంక నేలలు 5.0 cm నీటిని నిలబెట్టుకుంటుంది. పైన పేర్కొనబడిన నేలల స్వభావాన్ని బట్టి తడుల సంఖ్య, తడుల మధ్య కాల వ్యవధి నిర్ణయించ బడుతుంది.

పైర్ల లక్షణాలు: పంటకు పెట్టిన నీరు వ్రేళ్ళ ద్వారా మొక్కలు తీసుకుంటాయి కాబట్టి, వేర్ల లోతు, విస్తరణ పై నీటి తడులు ఆధారపడి ఉంటాయి.పంట రకాన్ని బట్టి కూడా వేర్ల లోతు, వ్యాప్తి లో బేధాలు ఉంటాయి. సాధారణం గా అన్ని పైర్ల వేర్లు మొదటి 1′ లోతులో ఎక్కువ విస్తరించి ఉంటాయి. ఉదా: వరి, క్యాబేజీ-2′, ఆముదం, పొగాకు, గోధుమ 3′ మొక్కజొన్న, టొమాటో, చెరకు 4′, లోతు వరకూ విస్తరిస్తాయి. ఈ వేర్ల విస్తరణ నేల స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటుంది.పంట పెరుగుతున్న కొలది – నేలలో వేర్ల విస్తరణ కూడా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల పంట మొదటి దశలలో తక్కువ నీరు, తర్వాత దశలలో ఎక్కువ నీరు పెట్టాలి.

పైర్లలో తేమ సున్నిత దశలు: ప్రతి పైరుకి – అన్ని దశలలో నీరు అవసరం ఉన్నా, కొన్ని కీలక దశ లలో పంట నీటి ఎద్దడికి గురైతే దిగుబడులు విపరీతంగా తగ్గుతాయి. ఆ దశలను “తేమ సున్నిత దశలు” అంటారు.చాలా పంటలలో పూత దశ, గింజ కట్టు దళ లు సున్నిత దశలు గా పరిగణింప బడతాయి. కనుక ఈ దశలలో పంట ఏ మాత్రం టెట్టకు గురి కాకుండా తడులు పెట్టాలి. ఈ దశ లలో నీరే కాకుండా తగు పోషక పదార్ధాలను అందజేయాలి.

Also Read: Irrigation Methods: వివిధ నీటి పారుదల పద్ధతుల గురించి తెలుసుకోండి.!

Irrigation for Plants

Irrigation for Plants

వాతావరణం: పైరుకి ఎంత వ్యవధి లో నీరు పెట్టాలి అన్న విషయం వాతావరణం పై ఆధారపడి ఉంటుంది. వాతావరణం ముఖ్యం గా ఉష్ణోగ్రతలు అధికం గా ఉన్నపుడు నేలలో తేమ ఆవిరై బయటకు పోతుంది (EVAPORATION). అదే విధం గా మొక్క తీసుకున్న నీరు ఆకుల ద్వారా ఆవిరి రూపంలో పోతుంది (TRANSPIRATION). అనగా అధిక ఉష్ణోగ్రతలు గల కాలం లో (మార్చి, ఏప్రియల్, మే నేలల్లో) నేలకు తడులు తక్కువ వ్యవధి లో ఇవ్వాలి. అదే విధం గా గాలిలో తేమ, గాలి వీచు తీవ్రత లపై కూడా పంటకు నీరు సరఫరా ఆధారపడి ఉంటుంది.

గాలిలో అధిక తేమ ఉన్నపుడు ఎక్కువ వ్యవధి లో నీరు పెట్టవచ్చు. గాలి తీవ్రత అధికంగా ఉన్నపుడు నీరు ఆవిరి రూపం లో ఎక్కువగా నష్ట పోవడం వల్ల తడులు దగ్గరగా పెట్టుకోవాలి. పంటకు పెట్టిన నీరంతటిని మొక్క ఉపయోగించదు- పెట్టిన నీటిలో నేల నుండి ఆవిరై పోవు నీరు, మొక్కలు తీసుకొన్న నీరు ఆవిరై ఆకుల నుండి పోవు నీరు కలిసి 99% వరకూ ఉంటుంది. అంటే మొక్క తన జీవ, రసాయనిక చర్యలన్నిటికి 1% నీరు మాత్రమే ఉపయోగించు కుంటున్నదన్నమాట.

అయితే నేల నుండి (evaporation) మొక్కల నుండి (transpiration) తేమ నష్ట పోతున్నామనుకొంటున్నాము. కాని వాటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. evaporation వల్ల నేలలోపలి పొరల నుండి నీరు “కేపలరీ”రంధ్రాల ద్వారా పైకి తీసుకు రాబడి మొక్క వ్రేళ్ళ కు నీటి తో పాటు పోషక పదార్థాలను అందిస్తుంది. అదే విధంగా transpiration వల్ల మొక్కలో ఉష్ణోగ్రత నియంత్రించ బడుతుంది. అందువల్ల evaporation, transpiration రెండూ మొక్కల పెరుగుదల కు అవసరమైనవే.

Also Read: Drip Irrigation: డ్రిప్ తో ఎన్ని రకాలుగా నీరు అందించవచ్చు.!

Leave Your Comments

Irrigation Methods: వివిధ నీటి పారుదల పద్ధతుల గురించి తెలుసుకోండి.!

Previous article

Drip Irrigation Techniques: డ్రిప్ నీటి పారుదలలో కొన్నిమెళుకువలు.!

Next article

You may also like