Phytophthora Blight in Chilli: మిరప వాణిజ్య పంటలలో ముఖ్యమైన పంట. భారతదేశంలో 8,30,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. దిగుబడి18,72,000 టన్నలు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మిరప 1,20,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు 3.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని పొందుతున్o.
Also Read:
నారు కుళ్ళుతెగులు:
లక్షణాలు:
- ఈ తెగులు లక్షణాలు 2 దశల్లో కనిపించును.
- మొలకలు నేల పైకి రాక ముందు – ఈ దశలో మొలకెత్తిన విత్తనాలు నేల పైకి రాక ముందే కుళ్ళి చనిపోతాయి.
- కొన్ని సార్లు విత్తనాలు మొలకెత్తకుండానే కుళ్ళి పోవును.
- విత్తనం నుండి ప్రధమ మూలం మరియు ప్రధమ కాండం పూర్తిగా రాక ముందే కుల్లిపోవును.
- ఈ దశలో తెగులు లక్షణాలన్నీ నేలలోనే జరుగును. కనుక దీనిని గుర్తించలేక విత్తనం మొలకెత్తలేదని భావిస్తారు.
- మొలకలు నేలపైకి వచ్చిన తరువాత విత్తనం మొలకెత్తిన తరువాత మరియు మొక్కల కాండం గట్టి పడే వరకు ఏ దశలోనైనా ఈ తెగులు ఆశించవచ్చు.
- సాధారణంగా తెగులు మొక్క యొక్క వేర్ల ద్వారా లేదా నేలను తాకే కాండం ద్వారా సోకుతుంది.
- తెగులు సోకిన భాగాలు మెత్తగా ఉండి నీటిని పీల్చుకున్నట్లు కనిపిస్తాయి.
- తెగులు తీవ్రత వలన నేలను తగిలే కాండం వద్ద కుళ్ళిపోయి నేలపై విరిగితాయి.
- ఆరోగ్యంగా ఉన్న నారు మొక్కలు ఒక రోజులోనే ఈ తెగులుకు గురి అగును.
- సాధారణంగా నారు మొక్కలు చనిపోయే ముందు బీజదళాలు ఆకులు వాడిపోవడం
- ఈ తెగులు ఆశించడం వలన నారు మడిలో మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి.
అనుకూల పరిస్థితులు:
- లేత మొక్కలలోనే ఈ శిలీంద్రం తెగులును కలుగజేస్తుంది. కణజాలాలు గట్టిపడిన తర్వాత తెగులు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది.
- నేలలో అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రత ఉండడం.
- బాగా చివకని పశువుల ఎరువు వాడటం.
- గత పైరుకు సంభందించిన మోళ్ళు, ఎండిన ఆకులుండడం.
- మురుగు నీరు పోయే సౌకర్యం సరిగా లేకుండుట.
- పంట మార్పిడి చేయకపోవటం.
- నారు మడిలో విత్తన మోతాదు ఎక్కువ వేయడం.
వ్యాప్తి: ఈ శిలీంధ్రబీజాలు భూమి ద్వారాను, నీటి ద్వారాను ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందును.
నివారణ:
- తేలిక పాటి నెలల్లో నారు మడి వేయాలి.
- భూమట్టం కంటే 6-8 అంగుళాలు ఎత్తైన నారు మడిలో విత్తనం పోయాలి.
- నారు మడిలో విత్తనాలు పల్చగా చల్లాలి.
- పూర్తిగా చివికిన పశువుల ఎరువు వాడాలి.
- తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు నీరు పెట్టాలి.
- ఒకే మడిలో ప్రతి సంవత్సరం నారు పెంచరాదు.
- అధిక మోతాదులో నత్రజని వాడరాదు.
- నారుమడి వేసే స్థలంలో నేలపై చెత్త వేసి కాల్చాలి.
- థైరామ్ / కాప్టస్ 3 గ్రా. 1 కేజి విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.
- నారు మడిని తీసిన తర్వాత 10-15 రోజుల వ్యవధిలో మాంకోజెబ్ 0.25% లేదా కార్బండిజం 0.1% మందును నేల తడిచేలా పిచికారి చేయాలి.
Also Rea:
Leave Your Comments