Mulberry Cultivation:
వర్షాధార పరిస్థితులలో నాటడం: మల్బరీని తేమ తక్కువగా ఉన్న పరిస్థితులలో (అర్థ -శుష్క లేదా వర్షాధారం) మరియు నీటిపారుదల పరిస్థితులలో సాగు చేయవచ్చు. వర్షాధార పరిస్థితిలో, వార్షిక వర్షపాతం పరిమితంగా (<700 మిమీ) ఉన్నప్పుడు మల్బరీ మొక్కలు నిజమైన నీటి ఎద్దడిని అనుభవిస్తాయి.
దక్షిణ భారతదేశంలోని దాదాపు 1/3వ వంతు మల్బరీ ప్రాంతం ఈ వర్గానికి చెందినవి.అటువంటి పరిస్థితులలో సాధారణంగా, దిగుబడి మరియు ఆకు నాణ్యత తక్కువగా ఉంటుంది. వర్షాధార పరిస్థితులలో ఆకు దిగుబడి మరియు నాణ్యత రెండింటిని మెరుగుపరచడం కోసం కేంద్ర పట్టు బోర్డు అభివృద్ధి చేయబడిన ప్రత్యేక యాజమాన్య పద్ధతులు.
- ఎర్ర లోమీ నేలల్లో s-13 మరియు నల్ల రేగడి నెలల్లో S-34 వంటి అధిక దిగుబడినిచ్చే రకాలను ఉపయోగించడం.
- తోటల పెంపకం ప్రారంభ దశల్లో మెరుగైన ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.
- నేలలోని తేమ పరిరక్షణ పద్ధతులు అవలంభించాలి.
- సకాలంలో సస్యరక్షణ చర్యలు అవసరం.
- భూమి ఎంపిక మరియు భూమి తయారీ.
➢ చదునైన లేదా కొద్దిపాటి వాలు ఉండే భూమి అనుకూలంగా ఉంటుంది.
➢ మరింత నిటారుగా ఉన్న భూములకు సరైన భూమి ఆకృతి అవసరం.
Also Read: నూతన పద్ధతిలో మల్బరీ మొక్కల పెంపకం
నాటడం:
➢ గుంత పద్దతిలో నాటుటకు 90 x 90 సెంటీమీటర్ల ఎడం పాటించాలి. అలాగే మట్టి మరియు FYM (2 కిలోల / పిట్) మిశ్రమమును గుంతలలో నింపుటకు ఉపయోగించాలి.
➢ కటింగుల ఎంపిక : 4 నెలల వయస్సు గల మొక్కలు నాటుట సిఫాహారసు చేయడమైనది.
ఇతరులు:
➢ మొక్కలు పూర్తి ఎదుగుదలకి ముందు కోయరాదు. దిగుబడి ఒక సంవత్సరం వయసు గల మొక్కల నుండి మాత్రమే తీసుకోవాలి.
➢ మొదటి కత్తిరింపు తదుపరి వర్షాకాలంలో జరుగుతుంది.
➢ స్థాపించబడిన సంవత్సరంలో ఒక ఎకరాకు 25:25:25 kg NPK మరియు 2వ సంవత్సరం నుండి 50:50:50kg NPK వేసుకోవాలి.
➢ ఋతుపవనాల ప్రారంభం అయినా వెంటనే మల్బరీ చెట్ల కాండం మొదలు దగ్గర కత్తిరించాలి.
➢ కత్తిరింపు చేసిన 10-15 రోజులలోపు ఎకరాకు 10 టన్నుల సేంద్రియ ఎరువును వేసుకోవాలి.
➢ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు నీటి సంరక్షణ కొరకు ఉలవలు లేదా పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి.
➢ కత్తిరింపు చేసిన దాదాపు 2 ½ నెలల తర్వాత మాత్రమే ఆకు కోయు పద్ధతి ద్వారా మొదటి పంట ఆతరువాత రెండు నెలలకు రెండవ పంట తీసుకోవొచ్చు. మొత్తం 6 ఆకు కోతలు 2 నెలల విరామంతో తీసుకోవొచ్చు.
➢ రెండవ సంవత్సరంలో సుమారుగా ఆకు దిగుబడి 7 – 8 MT/హెక్టార్ మరియు మూడవ సంవత్సరం నుండి 10 – 12 MT/ha వరకు దిగుబడి ఆశించవచ్చు.
Also Read: మల్బరీ సాగు, పట్టు పరుగుల పెంపకం