ఈ నెల పంట

అల్లం పంట సాగు – ఉపయోగాలు

0

అల్లం ఉత్పత్తిలో మాత్రం భారతదేశం 32.75శాతంతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అల్లం సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది. తాజా అల్లాన్ని వంటకాల్లో ఎక్కువగా వాడుతారు. పచ్చి అల్లం మీద ఉన్న పొట్టు తీసి సున్నపు నీటితో శుద్ధి చేసి ఎండబెట్టిన అల్లాన్ని శొంఠి అంటారు. దీన్ని ఉదర సంబంధమైన వ్యాధులకు ఉపయోగిస్తారు. ఎండబెట్టిన అల్లాన్ని పొడిగా చేసి వివిధ పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం. దీని సాగుకు బరువైన బంకమట్టి నేలలురాతి నేలలు పనికిరావుమురుగునీటి పారుదల చాలా అవసరం. అల్లం ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెల మొదటి పక్షం వరకు నాటవచ్చు. ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిల్లో నర్సీపట్నంతుని స్థానిక రకాలున్నాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పరిశోధనలు జరిపిన అధిక దిగుబడులనిచ్చే అల్లం రకాలను ఏజన్సీ రైతులు పండిస్తున్నారు. 

అల్లం ఒక చిన్న మొక్క వేరు నుండి తయారవుతుంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశంచైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూకూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండాఅల్లాన్ని కరివేపాకుమజ్జిగలతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్ట్రాల్‌ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకుపోవడం జరుగదు. కీళ్లవారు, ఆస్తమాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లంచిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీతర్వాత గానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. 

వాతావరణం:  

తేమతో కూడిన వాతావరణం అనువైనది. పాక్షికంగా నీడ ఉన్న ప్రాంతాల్లో కూడా అల్లం పెరుగుతుంది. సముద్ర మట్టానికి 1500 మీ. ఎత్తు వరకు గల ప్రదేశాలలో అల్లం పంటను సాగుచేసుకోవచ్చు. అధిక సూర్యకాంతిఅధిక వర్షపాతంఅధిక తేమగల వాతావరణంలో దిగుబడులు అధికంగా వస్తాయి. నీటి వసతి బాగా ఉండి1000 నుంచి 1500 మి.మీ వర్షపాతం 7 నుంచి 8 నెలలు విస్తరించి ఉన్న ప్రదేశాలు అల్లం సాగుకు అనుకూలం. 

నేలలు:  

ఎర్రగరప నేలలు అనుకూలం. బరువైన బంక మట్టి నేలలునీరు నిలిచే నేలలు అల్లం సాగుకు పనికిరావు. వేర్లుదుంపలు నేలలో 25 సెం.మీ లోతులో విస్తరించి ఉంటాయి. కనుక కనీసం 30 సెం.మీ లోతుగల సారవంతమైనగుల్ల నేలలు సాగుకు అనుకూలం. పిహెచ్‌ విలువ 6.0-6.5 ఉన్న నేలల్లో దిగుబడి అధికంగా వస్తుంది. 

విత్తే కాలం:  

రాష్ట్రంలో ఏప్రిల్‌ మొదటి వారం నుండి మే నెలాఖరు వరకు విత్తుకోవాలి. మే నెలలో విత్తుకోవాలంటే నీటి వసతి ఉండాలి. ప్రాంతాల వారిగా విత్తే సమయంలో పెద్దగా మార్పులుండవు. దుంపలను విత్తేందుకు వర్షపాతం లేదా నీటి వసతి కావాలి. దుంపలను రుతుపవన కాలంలో నైరుతి రుతుపవన కాలం ముందుగా విత్తుకోవడం చాలా మంచిది. దీని వల్ల వర్షాలు పడేలోపు మొక్కలు భూమిలో బాగా నిలదొక్కుకొని పెరిగి ఉంటాయి. అనంతరం వర్షాలు పడినప్పుడు మొక్కలు నిలబడగలుగుతాయి. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు లేదా భూమి తయారీ ఆలస్యమైనప్పుడు మే చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యం అయితే దుంపకుళ్లు ఎక్కువగా రావడమే కాకుండా దిగుబడులు తగ్గుతాయి. 

విత్తన పరిమాణం, మోతాదు:  

ఆరోగ్యంగా ఉండి 2-3 మొలకలు వచ్చి 40-50గ్రా. బరువున్న దుంపలను విత్తనం కింద వాడుకోవచ్చు. విత్తే దూరం రకాన్ని బట్టి 600 నుంచి 1000 కిలోల విత్తనం ఒక ఎకరంలో నాటడానికి అవసరం ఉంటుంది. ఎతైన గిరిజన ప్రాంతాలలో 900 నుంచి 1000 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులు మే నెలలో 200-250 గ్రాముల బరువు గల అల్లం దుంపలను విత్తనంగా వేయడం జరుగుతుంది. ఆగస్టుసెప్టెంబర్‌ నెలల్లో అల్లం మొక్కలు 30 నుంచి 35 సెం.మీ ఎత్తుకు చేరుకోగానే కింద ఉన్న పాత అల్లం దుంపలను 90 శాతం వరకు తవ్వి బయట మార్కెట్‌లో అమ్ముకోవడం ద్వారా విత్తన ఖరీదులో 60 నుంచి 70 శాతం వరకు ఆదాయం పొందవచ్చు. 

విత్తన ఎంపిక- విత్తన శుద్ధి:  

తెగుళ్లు సోకని పంట నుండి బలమైన విత్తన దుంపలను ఎంపిక చేసుకోవాలి. మొలకొచ్చిన దుంపలను సుమారు 30నుంచి 35గ్రా. బరువు ఉండేటట్లు ముక్కలుగా చేయాలి. బెల్లం లేదా పసుపు వండే కడాయిల్లో తగినంత నీరుపోసి లీటరు నీటికి 3గ్రా. రిడోమిల్‌-యం-జడ్‌ లేదా 3గ్రా. మాంకోజెట్‌, 5మి.లీ మలాథియాన్‌ చొప్పున కలిపి ఆ ద్రావణంలో దుంపలను40 నిమిషాలు నానబెట్టాలి.రిడోమిట్‌-యం-జడ్‌తో విత్తన శుద్ధి చేసినట్లయితే మాంకోజెట్‌ కన్న మెరుగుగా దుంపకుళ్లును అరికట్టవచ్చు. తరువాత తీసి నీడలో ఆరబెట్టాలి. తరువాత కొత్తగా నీరు తీసుకొని లీటరు నీటికి 10గ్రా.ట్రైకోడెర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో ఈ దుంపలను 40 నిమిషాలు నానబెట్టాలి. 

మడుల తయారీ, నాటడం:  

భూమిని బాగా దున్నిన తర్వాత నేల స్వభావాన్ని బట్టి ఇసుక లేదా ఎర్ర చెల్క నేలలైతే సమతుల మడులు(1.8ఇంటు1.2మీ) ఉండేలా ఏర్పాటు చేయాలి. నీటిపారుదల మురుగు నీటి కాల్వలు ఒక దాని పక్కన ఒకటి ఉండేటట్టు చేయాలి. నీటిపారుదల కాల్వలు 30 సె.మీ లోతుమురుగునీటి కాల్వలు 45సె.మీ లోతు ఉండేలా తవ్వాలి. లేని పక్షంలో బోదెలుకాల్వలు 45సె.మీ ఎడంలో ఏర్పాటు చేసి బోదెలపై నాటుకోవచ్చు. విత్తన దుంపలను నాటినప్పుడు మొలకెత్తిన బుడిపెలు పైకి ఉండే విధంగా నాటాలి. నాటేటప్పుడుగానీ విత్తన శుద్ధి చేసేటప్పుడుగానీ మొలకలు దెబ్బతినకుండా చూడాలి. అల్లపు విత్తన దుంపను నాలడానికి 10 రోజుల ముందు మంచి నీటిలో 24 గంటలు నాబెట్టడం వల్ల మంచి మొలక శాతం కలిగి ఉండి నాటేందుకు అనుకూలంగా ఉంటుంది.వరుసకు వరుసకు మధ్య 35సెం.మీ వరసలో దుంపల మధ్య 20సెం.మీ దూరం ఉండేట్లు నాటుకోవాలి. నాటిన మూడు వారాలకు మొలకెత్తుతాయి. మొక్కలు దాదాపు 2 అడుగుల ఎత్తు పెరుగుతాయి. వరుసల మధ్యలో మొక్కజొన్నఅలసందఆముదం వంటి పంటలు వేసి పంటకు కావాల్సిన నీడను కల్పించాలి. పొలం చుట్టూ గట్ల మీద కూడా ఆముదం పెంచవచ్చు. నాటిన రెండు మూడు వారాలకు, 60 రోజులకు అల్లం నాటిన బోదెలకు మట్టి ఎగదోయాలి. నీడనిచ్చే నెట్స్‌ కింద కూడా అల్లం సాగు చేయవచ్చు. దీని వల్ల ఆకుమచ్చ రోగం కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. 

అంతర పంటలు:  

అల్లం పంట వెలుతురు పడే ప్రదేశంలో కంటే నీడపట్టున బాగా పెరుగుతుంది. అందుకే కొబ్బరి తోటల్లో అంతర పంటగా అల్లం అనుకూలం. తక్కువ వేడిమి తోపాటు తక్కువ కాంతి తీక్షణత కలిగిన వాతావరణం అల్లం మొక్కల్లో ఎక్కువ పత్రహరితాన్ని వృద్ధి చేసేందుకు దోహదం చేస్తుంది. కొబ్బరికాఫీఅరటిద్రాక్షనిమ్మ తోటల్లో అల్లాన్ని అంతరపంటగా వేసుకోవచ్చు. తెలంగాణలో అరటిబొప్పాయిలను కూడా అల్లంతో అంతరపంటగా సాగు చేస్తారు. 

నీటి యాజమాన్యం:  

వర్షాకాలం చివరిలో 7 రోజులకొకసారివేసవిలో నాటిన తొలి రోజుల్లో రోజులకొకసారి,అక్టోబర్‌లో వారానికొకసారి నీరు పెట్టాలి. వర్షాకాలం లో 2-5 సెం.మీ వర్షపాతం కనుక నమోదు అయితే 15 రోజుల వరకు నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మురుగు నీటి కాల్వలు లేకపోతే దుంపకుళ్లు సమస్య తీవ్రమవుతుంది. డ్రిప్‌లో మైక్రోజెట్స్‌ ద్వారా కావాల్సిన తేమను అందిస్తూ అధిక దిగుబడులు సాధించవచ్చు. 

అంతరకృషి:  

మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు కలుపు ఎక్కువగా ఉంటుంది. జూన్‌సెప్టెంబర్‌ నెలల మధ్య మూడుసార్లు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. కలుపు తీసిన తర్వాత పైపాటుగా ఎరువు వేసి నీరుకట్టి మల్చింగ్‌ చేయాలి. కలుపు తీసిన ప్రతిసారి భూమిని పైపైన గుల్లబర్చాలి. మొక్కల చుట్టూ మట్టిని ఎగదోసి పాత మల్చింగ్‌తీసి కొత్త మల్చింగ్‌ వేయాలి. 

పచ్చిఆకు మల్చింగ్‌ చేయడం వల్ల లాభాలు:  

కలుపు పెరుగుదల తగ్గుతుంది. అల్లం మొలక వృద్ధి చెందేందుకు కావలసిన తేమను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎత్తయిన మడుల్లో వర్షపు చినుకులు పడేటప్పుడు మట్టి చెదిరి పోకుండా రక్షిస్తుంది. భూమి భౌతిక రసాయనిక లక్షణాలు చెడిపోకుండా ఉంటాయి. అల్లం మొలకశాతం బాగా వృద్ధి చెంది మొక్కలు ధృడంగా ఉంటాయి. దుంపకుళ్లు వ్యాప్తిని తగ్గిస్తుంది.3 లేదా 4సార్లు కలుపు తీసి రెండుసార్లు మట్టిని ఎగదోయాలి. 

ఎరువులు:  

అల్లం దుంప జాతికి చెందినది కనుక పోషకాలను భూమి ద్వారా గ్రహిస్తుంది. కనుక నేలను సారవంతం చేసి ఎరువులు వేయాలి. కానీ యూరియా ఎరువులను ఎక్కువ మోతాదులో వేయకూడదు. పశువుల ఎరువు ఎకరానికి 8నుంచి 10 టన్నులు ఆఖరి దుక్కిలో వేయాలి.పచ్చిరొట్ట ఎకరానికి 3 టన్నులు ఎత్తైన మడులలో నాటేటప్పుడు వేయాలి. సూపర్‌ ఫాస్పేట్‌ ఎకరానికి 150 కిలోలు ఆఖరి దుక్కిలో వేయాలి. యూరియా మాత్రం 40వ రోజు 26కిలోలు, 80వ రోజు 54 కిలోలు, 120వ రోజు 26 కిలోల చొప్పున వేయాలి.మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 40వ రోజు 20 కిలోలు, 80వ రోజు 42 కిలోలు, 120 వరోజు 20 కిలోలు వేయాలి. సూక్ష్మ పోషక పదార్ధాలయిన జింక్‌మెగ్నీషియ వంటివి లోపించినట్టయితే అవసరం మేరకు వాటిని ఆకులపై పిచికారీ చేయాలి. 

యాజమాన్య పద్ధతులు: 

  • విత్తనం నాటిన 25-40 రోజుల మధ్య 3 కిలోల అమ్మోనియా సల్ఫేట్‌, 0.5 గ్రాముల ఫాస్ఫరిక్‌ యాసిడ్, ఒక గ్రాము మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌లను కలిపి డ్రిప్‌ పైపుల ద్వారా నీటిలో వదలాలి. 
  • 40-100 రోజుల వ్యవధిలో 1.5 కిలోల యూరియా, 0.25 గ్రాముల పాస్పరిక్‌ యాసిడ్, ఒక గ్రాము మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ కలిపి రెండు నెలల పాటు పంటకు అందించాలి. 
  • 100-150 రోజుల వ్యవధిలో యూరియా 1.5 కిలోలు, కాల్షియం నైట్రేట్‌ 1 కి.గ్రా, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ లేదా సల్ఫేట్‌ 1.5 గ్రాములు కలిపి నీటి ద్వారా అందించాలి. 
  • 150-180 రోజుల మధ్య మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఒక గ్రాము వేయాలి. 

తెగులు నివారణ: 

  • రైజోమ్‌వాట్‌: ఈ తెగులు ఆశిస్తే మొక్క ఎండిపోతుంది. ఆకులు పసుపు రంగుగా మారుతాయి. ఈ తెగులు ఆశిస్తే మాటల్‌ ఎక్సిల్‌ 2 కి.గ్రా మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 
  • రైజోమాప్లే:  ఈ తెగులు సోకితే అల్లం కుళ్లిపోతుంది. ఎకరానికి 4 కిలోల ఫ్లోరేడ్‌ గ్రానివల్స్‌ను వేయాలి. 
  • లీఫ్‌ బైట్‌: ఈ తెగుల కారణంగా ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఆశించకుండా పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కార్బన్‌డిజమ్‌ కిలోను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 

ఎకరంలో అల్లం (కొమ్ములు) విత్తడానికి ఏడున్నర క్వింటాళ్లు అవసరం పడుతుంది. క్వింటాలుకు రూ. 8 వేల చొప్పున ఎకరాకు రూ.60 వేలకు వరకు విత్తనం ఖర్చుఎరువులుకలుపు నివారణకు మరో రూ. 60 వేలుమొత్తం రూ.1.20 లక్షలు ఖర్చు వస్తోంది. ఎకరాకు 100 క్వింటాళ్ల అల్లం పండుతోంది. రైతులు అల్లం విత్తనాలను రూ. 8 వేలకు క్వింటా ల్‌ చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌కు తరలించి విక్రయిస్తే రూ.5 వేల ధర పలుకుతోంది. అల్లం పంట కాలం ఎనిమిది నెలల నుంచి ఏడాది. ఎకరంలో రూ.1.20 లక్షల పెట్టుబడి పెట్టివచ్చిన పంటను రైతులకు విత్తనాల రూపంలో విక్రయిస్తే రూ. 8లక్షలు వస్తుండగామార్కెట్‌లో విక్రయిస్తే రూ. 5లక్షలు వస్తున్నాయి. 

                                                                 డాక్టర్.యన్.కృష్ణ ప్రియ, అసిస్టెంట్ ప్రొఫెసర్,                                                                          అగ్రికల్చరల్ పాలి టెక్నిక్ ,ఊటుకూర్, కడప. 

Leave Your Comments

మల్చింగ్ విధానం.. పంట దిగుబడి అధికం

Previous article

మేలైన పంట దిగుబడిలో పొటాషియం పాత్ర..

Next article

You may also like