రైతులు

Gunny Bag Shortage: గోనె సంచుల కొరత సమస్యను ఎదుర్కొంటున్న రైతులు.!

2
Gunny Bag Shortage
Gunny Bags

Gunny Bag Shortage: వరి కోతలు, ధాన్యం కొనుగోలు ఎప్పుడు ప్రారంభించిన ముందుగా మొదలయ్యే సమస్య గోనె సంచుల కొరత. కొనుగోలుకు తగిన రీతిలో గోనె సంచులు సరాఫరా చేయకపోవడంతో రోజుల తరబడి కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు నిలిచిపోతున్నాయి. అసలు కొనుగోలకు ఆలస్యం ఆవుతుందని రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు గోనె సంచుల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఆఘమేఘాల మీద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న గోనె సంచులు లేకపోవడంతో కొనుగొలు సజావుగా సాగుతాయా లేదా అన్న అనుమానం కలుగుతుంది.

కల్లాల్లో ధాన్యం కుప్పలు కుప్పలు పేరుకుపోవడం, అకాల వర్షాలతో రైతులు భయపడుతున్నారు. ఈసారి ధాన్యం కొనుగోలులో గన్ని బ్యాగులు తిప్పలు తప్పేలా లేవు. ప్రతి సంవత్సరం ఎంత దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం దానికి తగ్గట్టుగా గోనె సంచులను అందుబాటులో ఉంచలేక పోయింది.

40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం

ఖరీఫ్‌ 2023–24 ధాన్యం సేకరణకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రా ఆర్బీకేల ద్వారా 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం అవుతోంది. ప్రతిసారి లాగా ఈసారి గోనెసంచులతో ఇబ్బంది రాకుండదనే ఉద్దేశంతో గోనె సంచుల సమస్యను అధిగమించడం పై ప్రత్యేక దృష్టి సారించింది.

Also Read: ఏరువాక ఫౌండేషన్‌ కిసాన్‌ మహోత్సవం 2023 మరియు వ్యవసాయ వార్షిక అవార్డులు – 2022, ఆంధ్రప్రదేశ్‌.!

Gunny Bag Shortage

Gunny Bag Shortage

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌక దుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులను సేకరించి.. ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తోంది. సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూరకంగా మిల్లర్లు సహకరించకుంటే తొలగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది.

Also Read:  భారీగా పడిపోయిన టమాటా ధరలు.. ఛాయ్‌ కంటే చీప్‌..!

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గోనె సంచుల వినియోగానికి అయ్యే చార్జీలను సైతం మిల్లర్లకు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిల్లర్లు ఇచ్చే గోనె సంచుల నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వాటిని ధాన్యం నింపడానికి వినియోగించనున్నారు. ఆయా సీజన్‌లలో కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మిల్లర్లు సరఫరా చేసిన గోనె సంచులను తిరిగి అప్పగించనున్నారు.

మూడు కోట్లకు గోనెలు అవసరం కాగా 30 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు పూర్తి స్థాయిలో మొదలు అయితే ఇప్పుడు ఉన్న సంచులు ఏ మూలకు సరిపోవని రైతులు అంటున్నారు. ప్రతి సీజన్ లో గన్నీ సంచుల కొరత కొట్టుచేలా కనిపిస్తుంది. మొత్తానికి ఈ సీజన్ లో గన్నీలతో గట్టెక్కేదెలా అని తలలు పట్టుకుంటున్నారు.

Also Read: మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే రైజోబాక్టీరియా – (అజోటోబాక్టర్‌)

Leave Your Comments

Tomato Prices: భారీగా పడిపోయిన టమాటా ధరలు.. ఛాయ్‌ కంటే చీప్‌..!

Previous article

Terrace Gardening: మిద్దె తోటల పెంపకంతో లాభాలు ఎన్నో.!

Next article

You may also like