Water Management in Tobacco: ఇండియాలో పెంచే ముఖ్య మత్తు, ఉత్తేజము కల్గించే పదార్థాలు పంటలలో పొగాకు ఒకటి. ఈ పంటను దాని ఆకుల కోసం పెంచుతారు. వాటిని పదును చేసిన తరువాత పైపు కాల్చడానికి చుట్ట, సిగరెట్, హుక్కా, పీల్చడానికి నశ్యంగాను అనేక రూపాలలో నమలడానికి ఉపయోగిస్తారు.పొగాకు అనేక రకాల పరిస్థితులలో పెంచుతారు. ఉష్ణమండలం నుండి ఉప ఉష్ణమండలం, సమశీతోష్ణమండలం వరకు విస్తరిస్తుంది.
Also Read: Healthy Chemical Preservatives: మన ఆరోగ్యానికి ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ మంచివి?
సాగునీటి యాజమాన్యం: ఇది ఎక్కువ తేమ కన్నా జలాభావాన్ని బాగా సహించగలదు. పంటకు మొత్తం నీటి అవసరం సుమారు 588 మిల్లీ మీటరు నారు మొక్క పుష్పించే దశలు తేమకు సందిగ్ధమైనవి. గోదావరి జిల్లాల్లో ఇసుక లోమి నేలల్లో పెంచిన పొగాకుకు 6-7 సార్లు తడులు ఇవ్వాలి. నది పక్కనున్న లంకలలో పొగాకును నాటిన తర్వాత 30-60 రోజుల మధ్య 3 సార్లు నీరు పెట్టవలయును నాటిన తర్వాత 7 వారాలకు ఒకసారి నీరు పెడితే, 4 వ వారము లేదా 9 వ వారం నీరు పెట్టడంతో పోలిస్తే నేలలో తేమను సందిగ్ధ స్థాయికి పైన ఉంచుతుందని కనుగొన్నారు.
రాజమండ్రి పరిస్థితులలో నల్లనేలలో సిగరెట్ పొగాకుకు అందుబాటులో ఉన్న నేలలోని తేమలో 40% తగ్గినపుడు క్షేత్ర జలధృతి (సంతృప్త దశ) వరకు నీరు పెట్టడం మంచిదని కనుగొన్నారు. తేలిక నేలల్లో సాగునీటిలో క్లోరైడ్ అంశం 50 పి.పి.యం కన్నా ఎక్కువైతే, నల్ల రేగడి నేలల్లో 30 పి.పి.యం.కన్నా ఎక్కువైతే హానికరం.
పొగాకుకు నీరు పెట్టడం సరైన సమయాలలో చేస్తే ఆకు దిగుబడే కాక, నాణ్యత కూడా పెరుగుతుంది. మరీ ఎక్కువ నీరు పెడితే నాణ్యత క్షీణించవచ్చు.
సాధారణంగా పంటకు కావలసిన నీటిలో అధిక భాగం నేలలో నిల్వ వున్న తేమ వల్ల లభ్యం అవుతుంది. మిగిలిన మొత్తం కొంత వానవల్ల, కొంత సాగునీటివల్ల లభ్యం కావాలి. పొగాకులో సాధారణంగా వాళ్ళ పద్ధతిలో నీరు పెట్టుట పాటిస్తారు. నీటిని ఆదా చేయుట కొరకు దాలు విడిచి చాలు పద్ధతి పాటించుట వలన నీటి వృధాను తగ్గించవచ్చు. ఇది ఆకు నాణ్యతను మరియు 10-20% అధిక దిగుబడిని అన్ని చాళ్ళలో నీరు పెట్టే పద్ధతికన్నా ఇచ్చును. రైతుకు పెట్టుబడి సామర్ధ్యం ఉన్న పరిస్థితుల్లో స్ప్రింక్లర్ పద్ధతి పాటించుట మంచిది. నాటిన వెంటనే 3 రోజుల వరకు, ఎరువులు వేసిన తరువాత (ప్రతిసారి 2 గంటలు) 1,2 సార్లు, మోకాలి ఎత్తు: నుండి టాపింగ్ దశ వరకు 3 సార్లు (ప్రతిరోజు 5 గంటలు) ప్రతి కోతకు ముందు 3 రోజులకు ఒకసారి (ఒక గంట) స్పింక్టర్తో తడులు పెట్టాలి.
Also Read: Beedi Leaves: టెండూ ఆకుల గురించి ఎప్పుడైనా విన్నారా ?