నేలల పరిరక్షణ

Soil Acid Neutralizer: నేలల్లో రకాలు, యాసిడిక్, క్షారత్వపు నేలలను న్యూట్రల్ నేలలుగా మార్చడం ఎలా?

2
Soil Acid Neutralizer
Soil Acid Neutralizer

Soil Acid Neutralizer – 1. ఒండ్రు నేలలు: ఎత్తైన ప్రదేశాల నుండి వర్షపు నీటి ద్వారా నదుల్లో నుంచి కొట్టుకొచ్చిన సారవంతమైన మట్టిని ద్వారా ఒండ్రునేలలు ఏర్పడతాయి. ఇవి చాలా లోతుగా, సారవంతంగాను ఉంటాయి. నీరు సులువుగా ఒడిసి పోవటం వలన ఈ నేలల్లో మురుగు నీటి సమస్య అంతగా ఉండదు. ఈ నేలలు నదీ తీరాల్లోను, డెల్టాల్లోను ఉంటాయి.

ఈ నేలలకు అనుకూలమైన పంటలు : మామిడి, కొబ్బరి, సపోటా, పనస.

2. నల్ల రేగడి నేలలు : ఈ నేలలు నీటిని ఎక్కువ పట్టి ఉంచే శక్తి ఉండి, బరువైన నేలలుగా ఉంటాయి. వర్షం పడిన తర్వాత నీరు త్వరగా ఇంకదు. నేల త్వరగా ఆరదు, గాలి నేలలోకి వెళ్లడం కూడా తక్కువ, నేల ఎండినప్పుడు బీటలు వారి, దున్నినప్పుడు పెద్దమట్టి పెళ్ళలుగా వస్తుంది. ఈ నేలలు పండ్ల సాగు చేయడనికి పనికి రావు.

3. గుల్లరాతి నేలలు : ఈ నేలలు గుల్లగా, తేలికగా ఉండే రాతినేలలు, నీరు సులువుగా ఇంకి పోతుంది. భూసారం తక్కువ, అధిక వర్షపాతం ఉండే చోట్ల యాసిడిక్ గుణం కలిగి ఉంటాయి. మన దేశం పశ్చిమ తీర ప్రాంతంలో ఈ రకం నేలలు ఎక్కువగా ఉన్నాయి. తగినంత ఎరువులు వేసి కొబ్బరి, మామిడి, పోక, పనస, అనాస వంటి తోటలను పెంచవచ్చు.

4. ఎర్రనేలలు : ఈ నేలలు ఇటుక ఎరుపు రంగులో, గుల్లగా, తేలికగాను, ఖనిజ లవణాలు తక్కువగా ఉంటాయి. ఈ నేలలు న్యూట్రల్ లేదా కొద్దిగా యాసిడిక్గా ఉంటాయి. ఈ నేలలో అనువైన పంటలుగా బత్తాయి, నారింజ, నిమ్మ, ద్రాక్ష పంటలు సాగు చేసుకోవచ్చు.

5. గరప నేలలు: ఈ నేలలు గోధుమ/బూడిద/కొద్దిగా ఎరుపు రంగులో ఉండే తేలిక నేలలను గరప నేలలు అంటారు. తెలంగాణా ప్రాంతంలో ఈ నేలలో పంటలు పండిస్తారు. ఈ నేలలో ఎక్కువగా ద్రాక్ష పంట సాగు చేస్తారు.

6. సేంద్రియ నేలలు : అడవుల్లో చెట్ల క్రింద ఆకూ/రెమ్మ/పూలు పండ్లు పడి కుళ్ళి ఈ రకమైన నేలలు ఏర్పడతాయి. ఇవి చాలా సారవంతమైనవి. మన రాష్ట్రంలో అరకులోయ, రంపచోడవరం వంటి ప్రాంతాలలో ఇలాంటి నేలలు అక్కడక్కడ ఉన్నాయి. ఈ నేలల్లో ఎక్కువగా కాఫీ, తేయాకు, రబ్బరు, సింకోనా పలకాలు, మిరియాలు, దాల్చిన, వెనిల్లా పంటలని సాగు చేస్తారు.

7. ఇసుక నేలలు : ఈ నేలల్లో ఇసుక ఎక్కువ శాతం ఉండి, నీరు నిలువదు. నీరు, లవణాలు సులువుగా లోపలి పొరల్లోకి జారిపోతాయి. భూసారం తక్కువ ఉండటం వల్ల సాగునీరు, ఎరువులు ఎక్కువగా మొత్తంలో వాడాలి.

Also Read: Bengal Gram Cultivation: ఈ పంటను సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది…

Soil Acid Neutralizer

Soil Acid Neutralizer

అనువైన పంటలు : జీడిమామిడి, నేరేడు, సపోటా, కొబ్బరి, కుంకుడు, సరుగుడు.

భూసార పరీక్ష : పంట పొలాల నుండి మట్టి నమూనాలను సేకరించి వాటిని ప్రయోగశాలల్లో భౌతిక, రసాయనిక పద్ధతుల్లో పరిశీలించి నేలలో ఉన్న వివిధ రకాల మూలకాల పరిమాణం, నేల భౌతిక పరిస్థితిని అంచనా వేసే పద్ధతిని భూసార పరీక్ష అంటారు.

అధిక దిగుబడులను సాధించడానికి భూసార పరీక్షలు తప్పకుండా చేయాలి. రైతుల పొలాల నుండి సేకరించిన మట్టి నమూనాలను ప్రభుత్వ భూసార పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుపుకున్న తర్వాత ఒక కార్డులో రైతుకు అందిస్తాయి.

మట్టి నమూనా సేకరణ : శాస్త్రీయ పద్ధతిలో మట్టి నమూనా సేకరణ పద్ధతిని మట్టిశాస్త్రంలో చెప్పారు. ఈ పద్ధతులలో ఒక ఎకరం పొలం నుండి 5-6 నమూనాలు సేకరించి పంపాలి. ఒకే పంటను సంవత్సరం మొత్తం వేసే భూమి నుండి 6 అంగుళాల లోతు వరకు ఉండే మట్టిని నమూనాగా తీయాలి. కానీ పండ్ల చెట్లు వేసే పొలంలో ప్రతి అడుగు లోతుకు ఒక నమూనా చొప్పున 4-5 అడుగుల లోతు వరకు నమూనాలను వేరు వేరుగా సేకరించాలి.

మట్టి నమూనా సేకరణకు ప్రభుత్వ వ్యవసాయశాఖ సిబ్బంది, పంచాయితీ సమితిల్లోని వ్యవసాయ విస్తరణ సిబ్బంది , వ్యవసాయ విశ్వ విద్యాలయం విస్తరణ విభాగ సిబ్బంది ద్వారా మట్టి నమూనాలు సేకరించాలి. నమూనాలు ప్రయోగశాలకు చేరిన తర్వాత వాటిని రిజిష్టరు చేసుకొని, ఆరబెట్టి, మెత్తని పొడిగా చేసి పరీక్షలు జరిపి వివరాలు ఒక రికార్డు రూపంలో రైతులు తీసుకోవాలి.

ఉదజని సూచిక, లవణాల , కర్బన శాతం, నత్రజని, భాస్వరం, పొటాష్ లభించే మోతాదు వివరాలు, అందచేస్తారు. పి. హెచ్ 7.0 కంటే ఎక్కువ ఉంటే క్షారత్వపు నేలలు అనీ, 7.0 కంటే తక్కువ వుంటే యాసిడిక్ నేలలు అనీ అంటారు. నేలలోని రసాయన మోతాదులను సవరించడానికి క్షారత్వపు నేలలకు జిప్సంను, ఆమ్లత్వపు నేలలకు సున్నం వాడి ఆ నేలను న్యూట్రల్ నేలలుగా తీసుకు రావటం ద్వారా పంట పెరుగుదల , దిగుబడులను పెంచుకోవచ్చు.

Also Read: Soybean Cultivation: ఈ పంటని ఇలా సాగు చేయడం వల్ల రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి.

Leave Your Comments

Bengal Gram Cultivation: ఈ పంటను సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది…

Previous article

Different Types of Water Soil: నేలలో ఉండే నీళ్లు ఎన్ని రకాలు ఉంటాయి?

Next article

You may also like