Silkworm Farming: మల్బరీ సాగును మోరి కల్చర్ అంటారు. మల్బరీ బహు వార్షిక పంట. ఒక్కసారి నాటిన మొక్కల నుండి సుమారు 12-15 సంవత్సరాల వరకు ఆకును దిగుబడిగా పొందవచ్చు.
విత్తనం నుండి వచ్చే మొక్కలు :
మల్బరీ పండ్లను ఎండ బెట్టి వచ్చే విత్తనం ద్వారా వచ్చే మొక్కలు.
నేలలు :
ఎటువంటి నేలలు అయిన మల్బరీ సాగు చేయవచ్చు.నల్ల రెగడి లేదా తేలిక పాటి ఇసుక నేలలు అయితే శ్రేయస్కరం . నేల స్వభావాన్ని బట్టి మల్బరీ ఆకు దిగుమతి వస్తుంది.
నేల తయారీ :
మొక్కలు నాటే ముందు 1-2 సార్లు దున్నాలి.తరువాత బోదెలు వేసుకోవాలి.పశువుల ఎరువును 10-20 టన్నులు వేసినట్లు అయితే మంచి దిగుబడి పొందవచ్చు.
నాటే కాలం :
నీటి వసతి ఉన్న లేకున్నా ఋతుపవన వర్షాల తర్వాత నాటడం మంచిది.
Also Read: Late Age Silkworm Rearing: పెద్ద పురుగుల పెంపకంలో మెళుకువలు.!
పోషణ్ ద్రావణం పిచికారీ చేయుట :
పోషణ్ ద్రావణం అంటే వివిధ రకాల పోషకాలు కలిగిన ద్రావణం. దీనిని మల్బరీ మొక్కలకు అవసరమైనా పోషకాలు అందుబాటులో ఉంటాయి.దీనిని మల్బరీ ఆకులపై పిచికారీ చేయడం ద్వారా మల్బరీ ఆకు దిగుబడిని పెంచవచ్చు.ఒక ఎకరా మల్బరీ తోటకు 1 లీటర్ పోషణ్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.మల్బరీ మొక్కలు ప్రూనింగ్ చేసిన 25-30 రోజుల్లో ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి.కరువు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మల్బరీ తోటలు తేమ వత్తిడికి మాత్రమే కాకుండా సూక్ష్మ పోషకాల లోటు కూడా ఉంటుంది.కాబట్టి పోషణ ద్రావణాన్ని ఒక పంటకు ఒక పిచికారీ సిఫార్సు చేసారు.ఇది మల్బరీ మొక్కల సమాంతర ఎదుగుదలకు నాణ్యమైన పట్టు గుళ్లకు సహాయ పడుతుంది.
జీవన ఎరువులు :
నత్రజని స్థిరీకరించు ఆజాటోబాక్టీరియా, అజోస్పైరిల్లం, ఎకరానికి 80 కిలోలు వాడిన మంచి దిగుబడులు పొందవచ్చు.వీటిని ప్రతి పంటకు 1.6 కేజీల,50 కిలోల మాగిన పశువుల ఎరువులతో కలిపి తోట కత్తిరించిన 20-25 రోజుల తరువాత వేయాలి.దీని వలన రసాయనిక ఎరువుల మోతదు 20-30 % వరకు తగ్గించుకొనవచ్చు.
అంతర పంటలు :
పచ్చి రొట్ట పైర్లను అంతర పంటగా పెంచడం మంచిది.70-90 రోజులలో పంటకు వచ్చే జీలుగా,పెసర, జనుము,మొదలగునవి పెంచి దుక్కిలో దున్నాలి.దీని వలన భూమిలో నత్రజని శాతము పెరుగుతుంది.కలుపు మొక్కలు నివారించవచ్చు.
Also Read: Mulberry Plant Propagation: మల్బరీ మొక్కల ప్రవర్తనం