Timeline in Mulberry: ✓ ఒకటవ రోజు – పంటను కోసిన తర్వాత శుభ్రపరుచుకోవాలి.
✓ రెండవ రోజు నుండి ఐదవ రోజు – మొదటి పంటకు ఎకారాకు 4 టన్నుల చొప్పున పశువుల ఎరువు వేసుకోవాలి.ఇదే విధంగా మూడవ పంటకు కూడా వేసుకోవాలి.
✓ఆరవ రోజు – కాలువలు గట్టులు తయారు చేయాలి.
✓ ఏడు లేదా పద మూడవ రోజు – తోటకు నీరు కట్టుకోవాలి. ఒక వేళ అవసరం అయితే డైక్లోరోవాస్ 0.002 శాతం పిచకారి చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఆకు తిను పురుగు ఉదృతి తగ్గుతుంది.
✓ 17వ రోజు – 20 మిల్లీ లీటర్ల విపుల్ ని 100 లీటర్ల నీటిలో కలుపుకుని పిచకారీ చేసుకోవాలి.
✓19 వ రోజు – తోటకు నీరు కట్టుకోవాలి. ఇది శాఖీయ పెరుగుదలను ప్రేరేపిస్తుంది.
Also Read: మల్బరీ సాగులో మెలుకువలు
✓ 22వ రోజు– ఒక ఎకరాకు 28:11.5:11.5 న. భా. పొ. ఉండే విధంగా అనగా 140 కిలోల అమ్మోనియం సల్ఫేట్ : 70 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 19 కిలోల మురియట్ అఫ్ పొటాష్. క్షార గుణమున్న నెలలకు మరియు ఆమ్ల నేలలకు అయితే 63 అరవై మూడు కిలోల యూరియా 70 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 19 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.
25 వ రోజు- తోటకు నీరు కట్టాలి. 29వ రోజు లేదా 30 వ రోజు – పురుగులు పెంచుటకు ఆకు నాణ్యతను అంచనా వేయాలి. అవసరమైతే రెండవ సారి పిచికారి చేయాలి.
30వ రోజు పంటకు నీటిని కట్టాలి.
32వ రోజు – 20 మిల్లీ లీటర్ల విపూల్ 100 లీటర్ల నీటిని కలుపుకోవాలి. దీనిని ఆకులపైన పిచికారి చేసుకోవాలి.
37 / 43/ 49 వ రోజున తోటకు నీరు కట్టాలి.
45 వ రోజు చాకి పురుగుల పెంపకం చేపట్టాలి.53 వ రోజున చాకీ సెంటర్ నుండి పురుగులను తెచ్చుకోవాలి.
Also Read: టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ వ్యవసాయం