Important Mulberry Varieties – వి 1: తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణం లో ఉన్న రకము. ఆకులు అండ ఆకారంలో, మందంగా ఆకు పచ్చ రంగులో ఉంటాయి. దిగుబడి ఎకరాకు 20-24 టన్నులు /ఎకరాకు / సంవత్సరానికి వస్తుంది.
ఎస్ 36: కొమ్మలు నీటరుగా పెరిగి ముదురు ఆకు పచ్చ రంగు కలిగి ఉంటాయి.ఎకరాకు 16 టన్నుల దిగుబడి వస్తుంది.
ఎస్ 30: ఆకులు ముదురు ఆకు పచ్చ రంగులో పడవ ఆకారంలో మెరుస్తూ ఉంటాయి.ఆకులు చాకీ మరియు పెద్ద పురుగుల పెంపకానికి అనువైనవి.దిగుబడి 16 టన్నులు / ఎకరానికి / సంవత్సరానికి వస్తుంది.
ఆర్. ఎఫ్. ఎస్ 175: ఎక్కువ తేమ శాతం కలిగి ఎక్కువ సమయం తేమను నిలుపుకునే శక్తి కలిగిన రకము.దిగుబడి 18 టన్నుల / ఎకరానికి / సంవత్సరాల దిగుబడి వస్తుంది.
ఎమ్. ఎస్. జి 2: నూతన వంగడము ఆకులు హృదయాకారంలో నునుపు గా ముదురు ఆకు పచ్చ రంగులో ఉంటాయి.ఎక్కువ తేమ శాతం నిలుపుకోగల వంగడము.దిగుబడి ఎకరాకు 9-10 టన్నులు /ఎకరానికి / సంవత్సరానికి వస్తుంది.
అనంత: ఆకు పచ్చ రంగు కలిగి చాకీ మరియు పెద్ద పురుగుల పెంపకానికి అనుకూలం.24 టన్నులు / ఎకరానికి / సంవత్సరానికి వస్తుంది.
Also Read: Insect Pest Management in Sunflowers: ప్రొద్దు తిరుగుడును ఆశించే కీటకాలు.!
ఎన్ 13: దక్షిణ భారతదేశం సమాశోతోష్ణ మండల పరిస్థితులులకు అనుకూలంగా ఎర్రనేలలకు తగినది.దిగుబడి ఎకరాకు 5.2-6.4 టన్నులు / ఎకరాకి/ సంవత్సరానికి వస్తుంది.
ఆర్ సి 1: నీటి లభ్యత సిఫార్సు మోతదులో 50% తక్కువైన తట్టుకోగల రకము. సిఫార్సు మోతదులో 50% వరకు ఎరువులు తగ్గించిన కూడా తట్టుకొని 9-10 టన్నుల దిగుబడి ఒక ఎకరానికి ఇస్తుంది.
ఆర్. సి 2: తక్కువ నీటి వసతి గల ప్రాంతాలకు అనువైనది.ఆకు దిగుబడి 8-9 టన్నులు వస్తుంది.
సహన: నీడను తట్టుకొనే రకము . కొబ్బరి తోటల్లో అంతర పంటగా పండించవచ్చు.దిగుబడి 10-12 టన్నులు వస్తుంది.
ఎ ఆర్ 12: ఎక్కువ క్షార స్వభావం కలిగిన నేలలో అనువైన రకము. దిగుబడి 10 టన్నులు వస్తుంది.
జి 2: చాకీ పురుగుల పెంపకానికి అనువైన రకం. కొమ్మ కత్తిరింపు జరిపిన వెంటనే చిగురిస్తుంది.దిగుబడి 15 టన్నులు వస్తుంది.
మైసూర్ 5: వివిధ రకాల వాతావరణ పరిస్థితులు తట్టుకునే రకము 70% తేమ,18 % ప్రోటీన్లు,మరియు 20% పిండి పదార్ధము కలిగిన రకము.దిగుబడి 12-14 టన్నులు / ఎకరానికి / సంవత్సరానికి వస్తుంది.
Also Read: Weed Management Methods: కలుపు మొక్కల యాజమాన్యం మరియు నివారణా పద్ధతులు.!