Sericulture : వర్షాకాలం, చలికాలాల్లో పట్టుపురుగుల పెంపకంలో సున్నపుకట్టు రోగం ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు కురిసి, గాలిలో తేమ పెరిగినందున ఈ రోగం పట్టు పురుగులకు ఎక్కువగా సోకేందుకు ఆస్కారముంది. అందువల్ల వర్షాకాలం, చలికాలంలో పురుగులు ఈ రోగ బారిన పడకుండ అవగాహన కల్గి, తగిన ముందు జాగ్రత్త.
చర్యలు పాటించాలి-
సున్నంకట్టు రోగం ఎలా సోకుతుంది? పట్టు పురుగులకు సున్నంకట్టు రోగం బావిరియా బాసియానా అనే శిలీంద్రం వల్ల సోకుతుంది. ఇది అంటువ్యాధి. రోగగ్రస్త పురుగులు ఆరోగ్యవంతమైన పురుగుల దేహానికి తగిలినా అంటుకున్నా ఈ రోగం సోకుతుంది. ఈ రోగం పట్టుపురుగు లకే కాక మల్బరీ, ఇతర తోటల్లోని కీటకాలకూ సోకుతుంది.
రోగ లక్షణాలు: ఈ రోగం సోకిన పట్టుపురుగులు మొదట మెత్తబడి చనిపోతాయి. చనిపోయిన పురుగులు దేహం నెమ్మదిగా గట్టిపడి, దేహం నుంచి శిలీంద్రజాలం బయటికి చొచ్చుకొని వచ్చి దేహమంతా తెల్లనిసుద్దముక్కవలె మారుతుంది. పురుగులు మొదట గోధుమరంగుతో గృహ పట్టు కూడిన పింక్ రంగులోకి మారుతాయి. ఈ రంగు ఒకరకమైన బ్యాక్టీరియా (సెర్రిషియా మార్సిసెన్స్) వల్ల వస్తుంది. తరువాత క్రమంగా కొన్ని వల్ల శిలీంద్రజాలం దేహమంతా కప్పి వెలువ ఆ. ఈ తెల్లని సుద్దముక్కవలె మారుతుంది.
యాజమాన్య పద్దతులు-
రోగవ్యాప్తి: రోగ వ్యాప్తికి మూలాధారం రోగగ్రస్త పురుగులు, ఇతర కీటకాలైన ఆకు చుట్టు పురుగు ఎర్రగొం గళి పురుగులు మొదలైనవి. ఈ రోగ గ్రస్త పురుగులపై ఉన్న అసంఖ్యాక జాగ్రత్త శిలీంద్ర కొనిడియాలు తేలికగా , గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. కొన్నిసార్లు పల్లెలోని రైతుల గృహాల్లోకి కూడా ఇవి వ్యాపిస్తుంటాయి. పురుగుల 5వ దశలో (ఆఖరి బ్యాక్తి దశలో) ఈ రోగం సోకితే, చనిపో సెన్స్) ఒక పురుగు దేహం నుంచి కొన్ని కోట్ల శిలీంద్ర కొనిడియాలు వెలువడుతాయి. ప్రతి ఒక కొనిడియారోగాన్ని కలిగించే సామ ర్థ్యాన్ని కలిగి ఉంటుంది.ఇతర కీటకాలనుంచి ఈ రోగం సోకకుండా పట్టుపురుగులను కాపాడాలి. దీనికోసం మల్బరీ, ఇతర తోటలోని కీటకాలను నివారించాలి. పట్టుపురుగుల పడకల నుంచి రోగగ్రస్థ పురుగులు చనిపోయి గట్టి ఏర్ప పడకముందే వాటిని తీసివేసి,వాటిపై శిలీంద్ర నాశక పొడులను చల్లి తరువాత కాల్చివేయాలి. రోగ గ్రస్థ పురుగులను బయట పడవేయాలి.
మిశ్రమం తయారీ: 2 శాతం కాప్టాన్ – సున్నపు పొడి , 2 పాళ్ళ కాప్టాన్ పొడిని 98 పాళ్ళ సున్నపు పొడినందు (20 గ్రా. కాప్టాను 980 గ్రా. సున్నపుపొ డిలో కలిపితే ఒక కిలో మిశ్రమం తయారవుతుంది) బాగా కలపాలి. 2 శాతం డైథేన్ ఎం-45 కెవొలిన్ మిశ్రమం: 2 పాళ్ళ డైథేన్ ఎం-45 పొడిని 98 పాళ్ళ కెవొలిన్ (20గ్రా. డైథేన్ ఎం-45ను 980 గ్రా. కెవొలిన్ పొడితో కలిపితే ఒక కిలో మిశ్రమం తయారవుతుంది) పొడి తో కలపాలి.
Also Read: Disinfection in Sericulture: పట్టుపురుగుల పెంపకంలో రోగ నిరోధక చర్యలు.!
Must Watch:
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171