పట్టుసాగు

Sericulture: పట్టు సాగుతో రైతులకు సిరులు..!

0
Life Cycle of Silkworm
Life Cycle of Silkworm

Sericulture: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది రైతులు పట్టుపురుగుల పెంపకం లో ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అందుకొంటూ సాగును లాభసా టిగా మార్చుకుంటున్నారు. మల్బరీ సాగులో పురుషులతో పాటు మహిళలు కూడా కీలకభూమిక పోషిస్తున్నారు. పెంపకం దగ్గర నుంచి పట్టుగూళ్ల అమ్మకం వరకు వారి పాత్ర ఎంతో ముఖ్యమైనది.నాణ్యమైన పట్టుగూళ్లు ఉత్పత్తి కావాలంటే పురుగులతో పాటు మంచి మల్బరీ ఆకు కూడా ముఖ్యమే. రైతులు పట్టుగూళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చి రీలర్లకు విక్రయిస్తారు. రీలర్లు పట్టుగూళ్ల నుంచి పట్టుదారం తీసి, ఆ దారాన్ని ట్విస్టింగ్ చేసిన తర్వాత సిల్క్ దారాన్ని చేనేత కార్మికులకు అమ్ముతారు. చేనేత కార్మికులు పట్టువస్త్రాలను నేసి మార్కెట్లో విక్రయిస్తారు.

Sericulture

Sericulture

ఏడాది పొడవునా ఉపాధి: నీటి వనరులు తక్కువగా ఉన్న కరవు పీడిత ప్రాంతాల్లో సన్న, చిన్నకారు. రైతులకు మల్బరీసాగు జీవనోపాధిని కల్పిస్తుంది. ఒక ఎకరం మల్బరీ సాగు ద్వారా అయిదుగురికి ఏడాది పొడవునా పని లభిస్తుంది. గ్రామాల్లో పట్టుపరిశ్రమ వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. మల్బరీ మొక్కను ఒకసారి నాటితే 15 ఏళ్ల వరకు ఆకు దిగుబడిని పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు. నల్లరేగడి, చౌడు. నేలలు మినహా అన్నిరకాల నేలల్లో మల్బరీసాగు చేసుకోవచ్చు. ఎర్రటి చెల్కా నేలలు సాగుకు ఎంతో అనుకూలం. పట్టుపరిశ్రమ ద్వారా అధిక లాభాలు 1 ఉన్నప్పటికీ పథకాల గురించిన ప్రచార లోపం కారణంగా చాలామంది రైతు లకు చేరడం లేదు. రసాయన ఎరువులేగాక సేంద్రియ ఎరువుల వాడకం రీ ద్వారా నాణ్యమైన మల్బరీ ఆకును పండించవచ్చు. కుటుంబ సభ్యులందరూ క్రి కలిసి పనిచేస్తే మల్బరీ సాగుతో ఏడాది పొడవునా ఉపాధితోపాటు అధిక లాభాలు పొందవచ్చు.

రైతులు సాధారణంగా మల్బరీ తోటను వారు నివసించే ఇంటికి దగ్గర్లో నాటుకుంటారు. మొక్కలు నాటడం, కలుపుతీత, ఆకుకోయడం, పట్టుగూళ్లు పెంచే షెడ్లో, పట్టు పురుగులకు మల్బరీ ఆకులు మేత వేయడం కుటుంబం లోని మహిళల పని. స్త్రీలు చిన్న సైజు పట్టు పురుగులను, వారి పిల్లలను పెంచిన శ్రద్ధగా పెంచుతారు. ఎటువంటి వ్యాధులు సోకకుండా షెడ్లను శుభ్రం చేస్తారు. పట్టుపురుగులను చంద్రికల (నేత్రికలు)కు ఎక్కించడం. తయారైన పట్టుగూళ్లను నేత్రికల నుంచి వేరుచేయడం. వాటిని శుభ్రంగా ఆర బెట్టి, మార్కెట్కు పంపించేవరకు మహిళల పాత్ర చాలా అవసరం.

సేంద్రియ ఎరువుల తయారీ: పట్టుగూళ్ళు తయారుచేశాక మల్బరీ కొమ్మల వ్యర్థాలను పేడతో కలిపి మట్టి,వానపాములతో వర్మి కంపోస్టు తయారు చేసుకోవచ్చు. తయారైన ఈ వర్మి కంపోస్టును మల్బరీ పంటకు వాడుకోవచ్చు.

Also Read: Sericulture: పట్టు గ్రుడ్లను రవాణా మరియు పొదిగించునప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రభుత్వ రాయితీలు: ఒక ఎకరంలో మల్బరీ తోట సాగుకు రూ. 7 వేలు రాయితీ పొందవచ్చు. మల్బరీ మొక్కలను రాయితీ ద్వారా రూపాయిన్నరకు ఒక మొక్క అందజే స్తారు. రైతులు తామే స్వయంగా నర్సరీ పెంచుకొని, తాము మొక్కలు నాటు కోవడమే గాక, వేరే రైతులకు అమ్ముకోవచ్చు. నర్సరీలలో పెంచిన మొక్కలు 4-5 నెలల్లో నాటడానికి అనుకూలంగా ఉంటాయి. ఒక ఎకరానికి సుమారు 5 వేల మొక్కలు కావాలి. మల్బరీ సాగుకు రైతు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజుల పనిదినాల వేతనం పొందవచ్చు. పట్టు పురు గుల షెడ్డు నిర్మాణానికి రూ.1,37,500 (1000 చదరపు అడుగులు) లేదా రూ.87,500 చిన్న షెడ్డు (1000 చ.అడుగుల లోపు)కు రాయితీ ఉంది. పడ కలు కట్టుకునేందుకు నేత్రికలు, రేరింగు ట్రేల కొనుగోలు కోసం రూ.52,600 రాయితీ ఉంది. వ్యాధినివారణ మందుల కోసం రూ.3750 రాయితీ ఉంది. వర్మికంపోస్టు లేదా వేపచెక్క కొనుగోలుకు రూ.5వేల రాయితీ ఇస్తారు. వ్యవ సాయ పనిముట్లు (టిల్లర్ లేదా స్ప్రేయరు లేదా సికేచర్) కొనేందుకు రూ. 10వేల రాయితీ, పట్టుపురుగు విత్తనాలకు రూ.10వేల రాయితీ డ్రిప్ ఇరిగే షన్ పరికరాల కొనుగోలు కోసం రూ. 70వేల రాయితీ ఉంది. ఇదే కాక ‘ఎ’ గ్రేడు పట్టుగూళ్లు (బైవోల్టైన్) పండించిన రైతుకు ఒక కిలోకు రూ.50 రాయితీ, క్రాస్ బ్రీడ్ పట్టుగూళ్లు ఉత్పత్తి ప్రోత్సాకం కింద ఒక కిలోకి రూ.20 ఇస్తారు. తెలంగాణ జిల్లాల్లో బైవోల్టైన్ పట్టుగూళ్ల ఉత్పత్తి ప్రోత్సాహకంగా ఒక కిలోకి రూ. 75 ఇస్తారు.

Silkworms

Silkworms

పెంపకం ఇలా: మల్బరీ తోటను 2-3 భాగాలుగా విభజించి, ప్రతీనెలా పంట తీయవచ్చు. నవీన పద్ధతుల్లో రేరింగ్ గది నిర్మించి, తగినన్ని పరికరాలు ఏర్పరచుకుంటే దిగుబడి పెరిగే వీలుంటుంది. రేరింగు గదికి ‘ఎల్’ ఆకారంలో వరండా వేసు కోవడం వల్ల అదనపు సౌలభ్యం ఉంటుంది. గదిలో పడకలు అయిదున్నరు అడుగుల వెడల్పుతో, భూమి నుంచి ఒక అడుగు ఎత్తులో ఉండాలి.స్టాండుకు మధ్య 2 అడుగుల దూరం ఉండాలి.

పట్టు గుడ్లను పొదిగించటం: పట్టుగుడ్లను 25 డిగ్రీల సెం.గ్రే. ఉష్ణోగ్రత, 80-85 శాతం గాలిలో తేమ కలిగిన గదిలో ఉంచాలి. 8వ రోజున నల్లబట్టను కప్పి వెలుతురు తగల కుండా 36-48 గంటలు ఉంచితే 9-10వ రోజున సూర్యోదయాన్నే 90-95 శాతం గుడ్ల నుంచి పురుగులు బయటకు వస్తాయి.

Also Read: Sericulture: చంద్రికలను ఎలా వాడాలి ?

Also Watch: 

Leave Your Comments

Floricultural Production: నూతన పద్దతితో సకాలంలో పూల ఉత్పత్తి

Previous article

Pests in Vegetables: వేసవి కూరగాయ పంటలో తెగుళ్ల యాజమాన్యం.!

Next article

You may also like