Disinfection in Sericulture – బ్లీచింగ్ పొడి: బ్లీచింగ్ పౌడర్ లో 25-30 శాతం క్లోరిన్ (సగటున 20 శాతం) ఉంటుంది. శుద్ది ప్రక్రియ 0.4 శాతం క్లోరిన్ అవసరం, కాబట్టి 2శాతం బ్లీచింగ్ పౌడర్ ను వాడుతారు.ఇది కాంటాక్ట్ శుద్దికారి కాబట్టి అన్ని పరికరాలపైనా పిచికారీ చేయాలి. బ్లీచింగ్ పౌడర్ ఒక బలమైన ఆక్సిడైజింగ్ ఎజెంట్ గా పేర్కొన వచ్చు. ఇందులో హైపోక్లోరిక్ ఆమ్లం బలమైన బాక్టీరియా సంహారిణి కాగా, ఆక్సిజన్ బలమైన ఆమీకరణ కారకo. ఈ రసాయన చర్యలోని కాల్సియం అయాన్లు వైరస్ కణాలపై ప్రభావం చూపించగా, బ్లీచింగ్ పౌడరు యొక్క క్షార గుణం క్రిమిసంహారిణిగా ప్రభావం చూపిస్తాయి.
2 % బ్లీచింగ్ ద్రావణం ఎలా తయారు చేయాలి?
అయిదు లీటర్ల నీటిలో 300 గ్రాముల కాల్చి విడగొట్టిన సున్నమును (ఫ్రీకెడ్ లైమ్) మరియు 2 కేజీల బ్లీచింగ్ పొడిని వేసి బాగా కలియతిప్పాలి. పదినిమిషాల తర్వాత మరలా ఒక్కమారు కలియత్రిప్పి 35 లీటర్ల శుభ్రమైన నీటిలోకి వడబోయాలి. మొత్తం ద్రావణాన్ని బాగా కలియత్రిప్పాలి. ఈ ద్రావణాన్ని ఎక్కువ పీడనము గల సేయరో పరికరాలన్నీ బాగా తడుచునట్లు పిచికారి చేసి శుభ్రపరచాలి.
గమనిక: గదిని మరియు పరిసరాలను కడుగుటకు లేక అల్లుకుటకు కావలసిన బ్లీచింగ్ ద్రావణo తయారుచేయునప్పుడు వడగట్టనవసరములేదు. పంపుతో కొట్టవలసిన ద్రావణమును మాత్రం వడబోయ్యాలి.
Also Read: Sericulture: పట్టు గ్రుడ్లను రవాణా మరియు పొదిగించునప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Disinfection in Sericulture
కాల్చిన సున్నం: సున్నపు రాళ్ళపై నీటిని చిలకరించినప్పుడు లేదా తేమ గాని, గాలి గాని సోకినప్పుడు, గాలిలోని నీటిని మరియు కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహించి, రాళ్ళు విడిపోయి విడి సున్నం ఏర్పడుతుంది.చల్లారిన తరువాత పొడిగా చేసి జల్లెడపట్టి సంచులలో లేక డబ్బాలలో నింపి, గాలి చొరబడకుండా భద్రపరుచుకోవాలి.పై విధముగా పొందిన సున్నపు పొడి పట్టుపురుగుల పెంపకంలో అత్యంత ప్రభావ కారిణిగా ఉపయోగపడుతుంది. పురుగులు జ్వరంలో కూర్చున్నప్పుడు దీనిని చల్లడం వల్ల ఆకులోని తేమను పీల్చుకొని ఆకులు తొందరగా ఎండిపోతాయి.ప్రతి దశలో చివరిమేత వేసిన 4-5 గంటల తర్వాత సున్నపు పొడిని చల్లాలి.
దానితో పాటు పడకలలోని విషవాయువులను కూడా ఇది గ్రహించడముతో పడకలలో ఆరోగ్యకరమైన, తేమ రహితమైన వాతావరణం ఏర్పడుతుంది.ఇది జ్వరం లో వున్న పురుగులకు అనువైన వాతావరణం, పడకలలో మిగిలిన సున్నం పట్టుపురుగుల శరీరంలో ప్రవేశించినప్పుటికి హానికరం కాదు.
శానిటెక్ (Chlorine Dioxide): ఇది స్థిర లక్షణం కలిగిన మంచి ఫలితాన్నిచ్చే సులభంగా వాడు అవకాశంగల శుద్దికారిణి. శానిటెక్ లో 20,000 పి.పి.యమ్.ల క్లోరిన్ డై ఆక్సైడ్ సాంద్రత ఉంటుంది. పట్టుపురుగులకు సోకే అన్ని వ్యాధిక్రిముల మీద 0.5 శాతం కాల్చిన సున్నంతో కలిపిన 500 పి.పి.యమ్. క్లోరిన్ డై ఆక్సైడ్ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. దీని వలన లోహ సామాగ్రి తో చేసిన పరికరాలు త్రుప్పు పట్టే అవకాశం తక్కువ. ఇతర శుద్దికారక మందులతో పోల్చితే, దీనికి ఖర్చు ఎక్కువ.
2.5 శాతం శానిటెక్ (క్లోరిన్ డయాక్సైడ్) దావణాన్ని ఎలా తయారు చేయాలి?
పాత్రలో 250 గ్రాముల ఆక్టివేటర్ స్పటికాలను వేసి, 2.5 లీటర్ల శానిటెక్ ద్రావణాన్ని కలిపి, పూర్తిగా కరిగి పోవునంతవరకు కలియత్రిప్పాలి.ద్రావణo పసుపు రంగులోనికి మారుతుంది.10 నిముషాలు అలాగే ఉంచాలి. కాల్చి, విడగొట్టిన సున్నంపొడి 500 గ్రాములను 97.5 లీటర్ల నీటిలో కలిపి బాగా కలియత్రిప్పి. 10 నిమిషాలు అలాగే ఉంచాలి.ద్రావణమునకు పసుపురంగులో వున్న కరిగించిన శానిటెక్ ద్రావణాన్ని సున్నపు కలిపి బాగా కలియత్రిప్పి కొద్ది సేపు అలాగే ఉంచి, తరువాత పై తేట ద్రావణాన్ని పిచికారీ చేయుటకు వినియోగించాలి.
Also Read: Use of Disinfectants in Sericulture: పట్టు పురుగుల పెంపకంలో క్రిమిసంహారకాల వాడుక