సేంద్రియ వ్యవసాయం

భవిష్యత్తులో సూక్ష్మ సేద్యంతోనే వరిసాగు

0
micro-cultivation

 micro-cultivation

In the future paddy will be cultivated with micro-cultivation భూసార పరిరక్షణ అనేది ప్రస్తుతం, భవిష్యత్ లోనూ చాలా కీలకాంశం అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(PJTSAU) ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు Praveen Rao  అభిప్రాయపడ్డారు. భూసారాన్ని పరిరక్షించకపోతే ఆ దుష్ప్రభావాలు నీటివనరులు, జీవవై విధ్యం, ఆహారం ఇలా అనేక రంగాలపై ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రస్తుతం వ్యవసాయరంగం అనేక సవాళ్లని ఎదుర్కొంటున్న నేపధ్యంలో దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయవలసిన అవసరం ఉందని ఆ దిశగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సమావేశాల్లో చర్చ జరుగుతోందన్నారు.

micro-cultivation

ఇటీవలనే 7వ స్వామినాథన్ అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రవీణ్ రావుని ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆగ్రానమీ, హైదరాబాద్ చాప్టర్ సత్కరించింది. సుమారు గత 40 ఏళ్లుగా ప్రవీణ్ రావు సూక్షసేద్యం, వ్యవసాయరంగానికి చేసిన సేవల్ని సొసైటీ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు సొసైటీ సభ్యులు, విద్యార్థుల్ని ఉద్దే శించి ప్రసంగించారు. వ్యవసాయ పరిశోధనలు చేస్తున్న వారు ప్రస్తుత సమాజంలో ఏ అంశం, ఏ సమస్య ఉన్నదో పరిశీలించి వాటిపై పరిశోధనలు చేస్తే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. పరిమిత వనరులతో అధిక ఉత్పత్తి ఉత్పాదకతలు సాధించాల్సి ఉందన్నారు. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో సూక్ష్మ సేద్యంతోనే వరిసాగు చేయవలసిన పరిస్థితులు రానున్నాయని, ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు. వ్యవసాయవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ఇతర సబ్జక్టుల పైనా అవగాహనా కల్గి ఉండాలన్నారు. న్యాయపరమైన పరిజ్ఞానాన్ని వ్యవసాయ విద్యార్థులకి అందించే అంశాల్ని పరిశీలిస్తున్నామని దీనిపై నల్సార్ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచే యడంపై కసరత్తు చేస్తామని ప్రవీణ్ రావు వెల్లడించారు. micro-cultivation

ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ జగన్మోహన్ రావు, అగ్రానమి సొసైటీ ప్రతినిధులు జోసెఫ్, యాకాది, మల్లారెడ్డి, రవీంద్రాచారి, మహేంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave Your Comments

పశువుల్లో చిటుక వ్యాధి అత్యంత ప్రమాదకరం

Previous article

రైతుల కోసం ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు…

Next article

You may also like