Cotton Harvesting: మనదేశంలో పండించే వాణిజ్య పంటల్లో పత్తి చాలా ప్రధానమైంది. నూలు మిల్లులకు కావాల్సిన దాదాపు 65శాతం ముడి పదార్థం పత్తి పంట నుంచే లభిస్తుంది. దాదాపు 6 కోట్ల జనాభా పత్తి ఉత్పత్తిలో, పత్తి ,నూలు మిల్లుల్లో ప్రత్య క్షంగా లేదా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. భారతదేశంలోని మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 6-7 శాతం సాగవుతోంది.
పత్తి తీత: పత్తి విత్తనం వేసినప్పుటి నుంచి చేతికి వచ్చే వరకు జరిగే ప్రక్రియలన్నింటిలోను, పత్తితీత అనేది అన్నింటికంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అభివృద్ధి చెందిన దేశాల్లో యంత్రాల సహాయంతో కాకుండా, మనదేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పత్తిని మనుషులే తీస్తారు కాబట్టి యంత్రాల సహయంతో తీసిన పత్తిల మనం న తీసిన పత్తిలో ఎక్కువ వ్యర్ధపదార్థాల సమస్య ఉండదు. ప్రపంచంలోనే ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నా భార తదేశంలో దాదాపు 6 మిలియన్ల మంది పత్తి రైతులున్నారు. అందులో దాదాపు 55 శాతం మంది సన్నకారు రైతులు అంటే దాదాపు 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్నవారే.
Also Read: Prevent Sucking Pest of Cotton: ప్రత్తి లో రసం పీల్చు పురుగుల నివారణ .!
పత్తి తీతలో జాగ్రత్తలు: పత్తిని మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు తీస్తారు. ఎన్నిసార్లు పత్తి తీయవచ్చనే విషయం మనం వేసిన విత్తన రకం, దాని కాలపరిమితి, వాతావరణం, పాటించిన న యాజమాన్య పద్ధతులను బట్టి ఉంటుంది.పత్తి తీయడం అనేది మెల్లగా చేసే పని. అంతే కాకుండా విసుగ్గా కూడా ఉంటుంది. అదే దేశవాళీ రకాల్లో అయితే ఇంకొంచెం కష్టం ఎక్కువ. ఎందుకంటే, వాటిలో పత్తి కాయ పరిమాణం చిన్నగా ఉండటమే కాకుండా, చదరపు మీటరుకు చూసు కుంటే ఎక్కువ కాయలు ఉంటాయి.దేశీయ (హింగారి) పత్తి తప్ప, మిగతా అన్నింటిలో కూడా మొదటి, చివరి తీతలతో పోలిస్తే మధ్యతీతలో పత్తి ఎక్కువగా లభిస్తుంది. అలాగే నాణ్యత పరంగా బాగుంటుంది. అజాగ్రత్తగా పత్తి తీయడం, కుప్పలుగా వేయడం లాంటి పనులు వల్ల పత్తి మురికిగా తయారై తక్కువ ధర పలుకుతుంది. పత్తికాయలు పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే పత్తిని తీయాలి.
పూర్తిగా విచ్చుకున్న కాయల నుంచి మాత్రమే పత్తిని తీయాలి. సగం విచ్చుకున్న, పక్వానికిరాని కాయల నుంచి పత్తిని తీయరాదు.పత్తి రైతులు సాధారణంగా పత్తి తీయడానికిగాని, రవాణాకిగాని ఖాళీ ఎరువుల సంచులు ఉపయోగిస్తారు. మనం వీటినుంచి దారాలు విడివడి, పత్తిలో కలిసిపోయి, స్పిన్నింగ్ లోనే మిల్లుల్లో చాలా సమస్యలు సృష్టిస్తాయి. కాబట్టి అలాంటివి వాడకూడదు. పత్తితీతకు, రవాణాకు ఎప్పుడు, గుడ్డ సంచులను, జూట్ సంచులను మాత్రమే ఉపయోగించాలి. పత్తిలో దుమ్ము, ధూళి, ఎరువులు, పురుగుమందులు, పెట్రోలియం పదార్థాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వర్షం వల్లగానీ, పురుగు లేదా తెగుళ్ళు ఆశించడం వల్ల పాడైన పత్తిని వేరుగా తీయాలి. పరి మంచి పత్తితో కలపకూడదు.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Must Watch: