horticultural society to conduct training ఎవరైనా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. అందుకు తగ్గట్టు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పండ్లు, ఆకుకూరలు సమపాళ్లలో తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అయితే వారు తీసుకునే ఆహారం మంచిదే అయినా పండించే విధానం మాత్రం అనారోగ్యానికి దారితీస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మోతాదుల్లో రసాయన ఎరువులతో పంటని పండిస్తున్నారు. ఎక్కువ దిగుబడి రాబట్టేందుకు రసాయనిక పంటనే ఎంచుకుంటున్నారు. సేంద్రియ పంట కంటికి కూడా కనిపించని పరిస్థితి. కానీ కొందరు ప్రకృతి ప్రేమికులు సేంద్రియ పంటపై ద్రుష్టి పెట్టి సాగు చేస్తున్నారు. ఇంట్లోనే పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తున్నారు.
horticultural మీకు సేంద్రియ సాగుపై ఆసక్తి ఉందా?. మిద్దె తోటల పెంపకం చేపట్టాలనుకుంటున్నారా అయితే మీకు గొప్ప అవకాశం కల్పిస్తున్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు. అర్బన్ ఫార్మింగ్/టెర్రేస్ గార్డెన్‌పై ఈ నెల 28న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు హార్టికల్చర్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ మిద్దె తోటల పెంపకం మరియు ఆర్గానిక్ ఫార్మింగ్, పై శిక్షణ ఇవ్వనున్నారు. నాంపల్లి క్రిమినల్ కోర్ట్, రెడ్ హిల్స్, హైదరాబాద్‌లో శిక్షణా కార్యక్రమానికి హాజరవ్వగలరు. అదే రోజు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఈ శిక్షణ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరిస్తూ కోవిడ్ నియమాలని పాటించాలి.
మరింత సమాచారం కోసం సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు: eruvaaka
1. యాదగిరి AD 9705384384
2. అరుణ జ్యోతి HO. 7396603136
3. ఇ. జ్యోతి : 7997724983
4. జి. సందీప్ : 8125304636
5. ఎం. కవిత 8333026786