Drumstick Farming: వ్యవసాయంలో రైతులు సాంప్రదాయ పంటలు అయినా వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, జొన్నను సాగు చేసుకుంటూ వచ్చారు. ఒకవైపు చీడపీడలు, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్ర పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. రెక్కలను నమ్ముకొని రేయింబవళ్లు కష్టపడినా పైసా కూడా రాని పరిస్థితి.
పెట్టిన పెట్టుబడులు కూడా రానీ దయనీయ పరిస్థితి దాపురించింది. చివరికి అప్పులే మిగిలాయి. అయినా కూడా సేద్యంలోనే కొనసాగాలని అనుకుంటారు రైతులు. ఈనేపద్యంలో తన సాగు పంధాను మార్చుకోవాలని తలచారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి మళ్ళించారు. మునగ సాగు చేపట్టారు లాభాల దిశగా వెళ్లిపోతున్నారు.
ఎకర విస్తీర్ణంలో 500 మొక్కలను పెంచుతున్నారు. దీనికి 35000 వేలు పెట్టుబడి ఆవుతోంది. ఒక్కో మునగ మొక్క నుంచి 600 నుంచి 800 రూపాయల వరకు ఆదాయం వస్తుందని, మార్చి ఏప్రెల్, మే నెలలో దిగుబడులు వస్తాయాని ఈ సీజన్ లో ఒక్కో మునగకాయ ధర రూపాయి నుండి రూపాయిన్నర వరకు పలకడంతో మంచి ఆదాయం సమకూరింది రైతులు చెబుతున్నారు.
Also Read: కందిలో తెగుళ్ల నివారణకు పద్ధతులు.!
పంట కాలం పూర్తి కావడంతో చివరగా కాసిన కాయలకు మరింత డిమాండ్ పలకడంతో ఒక్కో కాయ ధర మూడు రూపాయల వరకు ఉంటుందని దీంతో ఒక్క ఎకరాకు సుమారు లక్ష రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం వ్యాపారులు తమ పొలం వద్దకే వచ్చి కాయలను కోసుకొని తీసుకు వెళ్తున్నారని చెబుతున్నాడు. కానీ వర్షాలు పడుతున్న వేళ తోటలకు తెగులు సోకుతున్నాయని రైతులు అంటున్నారు.
మునగకు తెగుళ్లు సోకటం వలన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలం ముంపు గురైన నేలలో ఇది ఎక్కువగా ఆశిస్తోంది. ఇది వచ్చిన చెట్టులో కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్ళిపోయి నేలకు వాలిపోతుంది. వేర్లు కూడా కుళ్ళిపోవటం తో చెట్టు మరణిస్తుంది. దీంతో చాలా జాగ్రత్త పడాలి. ప్రతిచెట్టు మొదట్లో ట్రైకోడెర్మా విరిడి రెండు కిలోలు, 90 కిలోల పశువుల ఎరువు కలిపి మిశ్రమాన్ని ఐదు కిలోలు చొప్పున వేయాలి. ఇది పూత దశలో ఆశించి పిందె దశలోకి ప్రవేశిస్తుంది.
లోపల పదార్థాన్ని తిని కాయను నాశనం చేస్తోంది. దీంతో కాయలు వంకర్లు తిరుగుతాయి దీని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలి. రైతులు గుర్తు పెట్టుకోవాలసింది ఏమిటంటే ఏపంటకైనా రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆధిక లాభాలను, దిగుబడులను పోందవచ్చు. అంతే కాకుండా పంట మార్పిడి చేస్తుంటే నేలలోని సారం కూడా పోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేసుకోవచ్చు.
Also Read: రైతులకు కల్పతరువుగా మారిన బొప్పాయి సాగు.!