Turmeric Crop Processing: పసుపు పంట సాగు చేసే రైతులు విత్తనాలు నాటడం మొదలు పంట అమ్ముకునే వరకు చాలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పంట ఆకులని కోసిన తర్వాత భూమిలో నుంచి పసుపుని తీసుకున్న తర్వాత వాటిని ప్రాసెస్ చేయడానికి కూడా చాలా పెట్టుబడి అవసరం ఉంటుంది. పసుపు భూమిలో నుంచి తీసే సమయంలోనే తల్లి, పిల్ల కొమ్ములని వేరు చేస్తారు. వీటిని గోల, కాది అని పేర్లతో పిలుస్తారు. గోల అంటే తల్లి కొమ్ము, కాది అంటే పిల్ల కొమ్ముగా పిలుస్తారు. భూమిలో నుంచి తీసిన పసుపు కొమ్ములు వారంలో ఉడకపెట్టాలి.
పసుపు కొమ్ములని ఉడకపెట్టడం ఆలస్యం అయితే నాణ్యత రోజు రోజుకి తగ్గుతుంది. పసుపు కొమ్ములని స్టీమ్ బాయిలర్ ద్వారా ఉడకపెడ్తారు. ఇందులో ఉడకపెట్టడం వల్ల పసుపు కొమ్ములు సమానంగా ఉడుకుతాయి. నీటి ద్వారా ఉడికించిన పసుపు కొమ్ములు సమానంగా ఉడకవు. స్టీమ్ బాయిలర్ ధర 3-5 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ స్టీమ్ బాయిలర్కి రెండు లేదా నాలుగు డ్రమ్స్ ఉంటాయి.
ఒక డ్రమ్ 250 కిలోల నుంచి ఒక టోన్ కెపాసిటీ కలిగి ఉంటుంది. మన అవసరాని బట్టి ఈ డ్రమ్ కెపాసిటీ 2 టన్నుల వరకు మార్చుకోవచ్చు. ఒక డ్రమ్ పసుపు ఉడకపెట్టడానికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. స్టీమ్ పైప్స్ ద్వారా డ్రమ్లోకి వెళ్తుంది. ఎక్కువ ప్రెషర్ ద్వారా ఉడకపెట్టడం వల్ల పసుపు కొమ్ములు సమానంగా, మంచి నాణ్యతతో ఉడుకుతుంది.
Also Read: Hand Weeder: కలుపు తీయడానికి మహిళా కూలీల కోసం కొత్త పరికరం..
ఉడకపెట్టిన ఈ పసుపు కొమ్ములని 12 గంటల వరకు ఒక కుప్పల పోసుకోవాలి. తర్వాత ఈ కొమ్ములని ఆరపెట్టుకోవాలి. ఆరపెట్టిన కొమ్ములని ప్రతి రోజు మధ్యాహ్నం సమయంలో రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల పసుపు కొమ్ములు 15 రోజులో ఆరిపోతాయి. పసుపు కొమ్ములు ఆరిన తర్వాత వాటిని పాలిష్ చేసుకోవాలి.
పాలిష్ చేయడానికి డ్రమ్ పాలిష్ వాడుతారు. ఈ డ్రమ్ పాలిష్ ఎలెక్టిక్, డీజిల్, ట్రాక్టర్ ద్వారా నడుపుకోవచ్చు. కొంత మంది రైతులు పాలిష్ చేయడానికి రసాయనాలు కూడా వాడుతున్నారు. కానీ ఈ రసాయనాలు వాడటం వల్ల పసుపు నాణ్యత తొందరగా కోల్పోతుంది. పసుపు కొమ్ములని ఉడకపెట్టి, పాలిష్ చేయడానికి 30-40 వేల రూపాయల పెట్టుబడి అవుతుంది.
పసుపు విత్తనాల నుంచి మార్కెట్లో అమ్ముకోవడం వరకు 1.10 లక్షలు పెట్టుబడి వస్తుంది. పసుపు ధర 2010 సంవత్సరంలో ఒక క్వింటాల్ ధర 11500 రూపాయలకి రైతులు అమ్ముకుంటే. ఇప్పుడు ఒక క్వింటాల్ పసుపు 5-6 వేల రూపాయలకు రైతులు అమ్ముకుంటున్నారు. పసుపు ధర ముఖ్యంగా తగ్గడానికి కారణం మహారాష్ట్ర జిల్లాలో చెరుకు ఫ్యాక్టరీలు మూత పడటం. మహారాష్ట్ర రైతులు కూడా పసుపు సాగు మొదలు పెట్టడంతో ఎక్కువ శాతంలో పసుపు సాగు చేయడం వల్ల మన రాష్ట్రంలో పసుపు ధరలు తగ్గుతున్నాయి.
Also Read: Nematode Control in Calves: దూడలలో వచ్చే ఏలికపాముల నివారణ