Useful Agricultural Tools: 1. వరి పొలాల్లో దమ్ము చేయడం: ముందుగా రెక్కనాగలితో పొలాన్ని లోతుకు దున్ని ఎండకు ఎండబెట్టడం వలన మట్టి అడుగు భాగంలో ఉన్న చీడపీడల అవశేషాలు బయటపడి ఎండకు నశిస్తాయి. అదే కాక తుంగ వంటి కలుపు మొక్కల గడ్డలతో పాటు సమూలంగా బయటపడి నాశనమవుతాయి. ఇలా దుక్కి దున్నిన పొలంలో వరినాటు వేయడానికి ముందు నీటిని సుమారు 10 సెం.మీ. వరకు నిలిపి బాగా దమ్ము చేయాలి. దమ్ము ముఖ్య ఉద్దేశ్యము : నీటి సమ్మేళనంతో మట్టిని చిలికి తద్వారా నీటి అడుగు భాగంలో ఒండ్రుమట్టి పొరను ఏర్పరిచి, పై నిల్వ ఉంచిన నీరు లోపలి పొరల్లో ఇంకి పోకుండా చేయడం ఇందుకు ప్రత్యేకమైన నాగళ్లను మాత్రమే వాడాలి. దమ్ము చేయడానికి వాడవలసిన పరికరాలు :
ఎ) ఎ.పి.ఏ.యు పడ్లరు :
ఎడ్లతో సేద్యంచేసే రైతులకోసం ప్రత్యేకించి నిర్మించిన పరికరం. వరి నారుని ప్రధాన పొలంలోకి మార్చినప్పటినుండి (నాట్లు వేసినప్పటినుండి) 5-10 సెం. మీటర్ల నీటిని నిల్వ ఉంచి వరి పైరును సాగుచేయడం పరిపాటి. కాకపోతే ఈ నీటి నిల్వను తగ్గకుండా కాపాడేందుకు మరియు నాట్ల సమయంలో మొక్క వేళ్ళు ఇమడడానికి మెత్తటి భూమిని పొందుపరిచేందుకు ‘‘వరిదమ్ము’’ చాలా అవసరం అనగా ఇలా దమ్ము చేయు గలిగిన దానికై ప్రత్యేకంగా రూపొందించిన ఎ.పి.ఎ.యు. వడ్లరును వాడి అనుకున్న విధంగా వరిదమ్మును చేయగలదు. ఈ విధంగా ఎ.పి.ఎ.యు పడ్లరుతో దమ్ము చేయడం వలన నేల అడుగు భాగంలో ఒక గట్టి మట్టి పొర ఏర్పడి నీటిని లోపలి పొరలలోకి పోకుండా చేసి తద్వారా ప్రధాన పొలంలో పెట్టే సాగునీటి మొత్తాన్ని సుమారు 30-40 శాతం ఆదా చేయవచ్చు. ఎ.పి.ఎ.యు పడ్లరు ఖరీదు రూ.2,800/-,
బి. విష్ణు పడ్లరు :
దీనిని ట్రాక్టరుకు తగిలించుకొని వరి పొలంలో దమ్ము చేయడానికి ప్రత్యేకంగా ‘‘ఆంధ్రప్రదేశ్ నీటి యాజమాన్య పథకము’’, తిరుపతి వారు రూపొందించారు. ఈ యంత్రాన్ని నీటిని నిల్వ ఉంచిన పొలంలో దమ్మును సమర్థవంతంగా చేయవచ్చును. ఈ యంత్రంలో 36 లేదా 40 కర్రులు కలిగి ముందుకు లాగడం వలన మధ్యలో అమర్చబడిన షాఫ్ట్ తిరిగి, దానితో పాటు అమర్చిన పలకలు లేదా తెడ్డును త్రిప్పుతుంది. ఇలా త్రిప్పేప్పుడు మట్టి ముద్దలను పైకి క్రిందకు కలియత్రిప్పి చిలకడం వలన దమ్ము నాణ్యత పెంపొందిస్తుంది, ఇలా దమ్ము చేసిన పొలాన్ని పలక సహాయంతో చదును చేసి 12-24 గంటలు కదపకుండా ఉంచి ఆపై పొలంలో నాట్లను వేసుకోవాలి. ఇలా చేయడంవలన వరి నాట్లకు కావలసిన మెత్తటి పొర ఏర్పడుతుంది. అంతేకాక వరి సాగులో సాగునీటి ఆదా 40 శాతం వరకు మరియు దమ్ముచేసే సమయము 50 శాతం వరకు తగ్గించవచ్చునని పరిశోధనాపూర్వకంగా నిరూపించబడిరది. దీని ఖరీదు రూ.18,000/- నుంచి 22,000/- వరకు ఉంటుంది.
Also Read: Best Agriculture Tools: అంతర కృషికి వాడే పనిముట్లు.!
సి. రోటోవేటర్:
రోటోవేటరు మెట్ట సేద్యంలోనే కాక వారిదమ్ము చేయడానికి సమర్ధవంతంగా వాడవచ్చును. ఇది ముందు వివరించిన విధంగా ట్రాక్టరు/పవర్ టిల్లర్ యొక్క పి.టి.ఓ. షాఫ్ట్ ద్వారా నడుపబడే యంత్రము దీనికి అమర్చబడిన ఒంపు కర్రల పి.టి.ఒ ద్వారా అందిన శక్తితో వేగంగా తిరిగి తిప్పి మట్టిగడ్డలను నూర్చి నీటిలో చిలకరిస్తుంది. ఇలా చేయడం వలన వరినాట్లుకు కావలసిన దమ్ము నాణ్యత పెరిగి నీటిని వేలలోపలికి ఇంకి పోకుండా పూర్తిగా అరికడుతుంది.
అంతేకాక ఈ రోటోవేటర్ను వాడే పక్షంలో దుక్కిని నాగలితో దున్నే అవసరం కూడా ఉండదు. కాకపోతే నీటిని నిల్వ ఉంచిన పొలంలో రోటోవేటర్ సహయంతో ట్రాక్టర్/పవర్ టిల్లర్ మొదటి గేరులో అంటే అతి తక్కువ వేగంలో దమ్ము మొదలు పెట్టాలి. ఆ తరువాత వేగం పెంచి దమ్ము నాణ్యతను పెంచవచ్చు. ఇలా చేయడం మూలంగా మామూలు వద్దతితో పోలిస్తే 60 శాతము సమయాన్ని, 40 శాతము సాగునీటిని తగ్గించి, నాణ్యమైన దమ్మును పొందవచ్చును. దీని ఖరీదు రూ? 1,00,000 వరకు ఉంటుంది.
డి. పళ్ళెపు దంతి:
ఈ పళ్ళెపు దంతిని మెట్ట సేద్యంలోనే కాక, వరిపొలాల్లో దమ్ము చేయడానికి కూడా సమర్థవంతంగా వాడవచ్చును. కాకపోతే, ఈ పళ్ళెపు దంతులలో సింగిల్ యాక్షన్ డిస్క్ హారో (ఒకే వరుసలో అమర్చబడిన పళ్ళాల దంతి) ని మాత్రమే దమ్మును చేయడానికి వాడవలెను. ఇలా అడుసు పొలంలో దమ్ము చేసిన తరువాత చదును చేసే పలకను వాడి నేల ఉపరితలాన్ని చదును చేయడం వరి పంట నీటి యాజమాన్యంలో చాలా ముఖ్యమైన పని. ఈ పరికరం ద్వారా సాగు నీటిని 20% వరకు ఆదా చేయవచ్చునని నిరూపించబడినది. పళ్ళెపు దంతి ఖరీదు రూ.30,000/-,
2. పచ్చిరొట్టె ఎరువును కలిపే ట్రాంప్లర్ :
రైతాంగం వరి పొలంలో నేల స్వభావాన్ని బట్టి పోషకాలు మరియు మట్టి భౌతిక పరిమాణాలను మెరుగు పరిచేందుకు జనుము లేదా జీలుగలను (లేదా) రైతుకు అందుబాటులో ఉన్న ఇతర పచ్చిరొట్టె ఎరువును కలుపడం పరిపాటి. ఈ పచ్చిరొట్టి ఎరువుకై పండిరచే నేలలో కలిపేందుకు దున్ని పొలంలో నీటిని నిల్వ ఉంచి ఈ ట్రాంప్లర్ను వాడాలి. దీనిలో ఎడ్ల సహాయంతో నడిపేవి మరియు ట్రాక్టరు సహాయంతో నడిపేవి విడి విడిగా రూపొందించబడిరది. ఈ ట్రాంప్లర్కు అమర్చిన పొడవాటి కత్తులు (బ్లేడ్స్), పరికరాన్ని లాగినపుడు నేలపై పరచబడిన పచ్చి ఆకును కత్తిరించి మట్టిలోపలకు త్రొక్కుతూ మట్టిని కొంతవరకు తిరగ తిప్పుతుంది. ఇలా ట్రాంప్టర్ను వాడి పచ్చిరొట్టె ఎరువును తొందరగా మట్టిలోకి కలపడమేకాక సమర్ధవంతంగా కుళ్ళిందుకు గం దీని ఆకార నిర్మాణాలను చూసి పొరపాటుతో పరి దమ్ముకు చేసే యంత్రంగా వాడడం ఏ మాత్రం ఉపయోగకరం కాదు..
3. ఎ. వరి డ్రమ్ సీడరు :
దీని ద్వారా ‘‘ ఒకే సారి ఎనిమిది వరుసలలో సాళ్ళమధ్య 20 లేదా 25 సెం.మీటర్ల దూరంలో విత్తేందుకు వీలవుతుంది. మనము నాటాలనుకున్న వరి విత్తినాన్ని 24 గంటలు నానబెట్టి 12 గం? మండె కట్టి, గింజల నుండి మొలక ఆరంభదశలో పరికరానికి అమర్చిన నాలుగు డబ్బాలలో నింపాలి. ఇలా డబ్బాలను 3/4 వరకు నింపి, పరికరాన్ని ముందుగా దమ్ముచేసి చదును చేసిన పొలంలో చక్రాల సహాయంతో పరికరానికి అమర్చిన, చేతిపిడి సహాయంతో లాగడం వలన చక్రాలు తిరిగి డబ్బాలు తిరిగి, డబ్బాలకున్న రంద్రాల ద్వారా పొలంలో వరుసగా పడుతుంది. ఈ వరుసలు పాడవకుండా పొలంలో వారం వరకు పలుచటి నీరు మాత్రమే పెట్టాలి. డ్రమ్ సీడరును లాగడానికి ఒకరు, ఒకరు విత్తనం అందించడానికి అవసరము కావడం వలన వరి నాటే ఖర్చు బాగా తగ్గి సుమారు రూ.1500/- నుండి రూ.2000/- వరకు ఆదా చేయవచ్చునని పరిశోధనల ద్వారా నిరూపించబడిరది. ఈ డ్రమ్ సీడరును ఉపయోగించి రోజుకు 2-3 ఎకరాల వరి నాటవచ్చును.
బి. వరి నాటే యంత్రాలు :
ఈ పద్ధతిలో ప్లాస్టిక్ ట్రేలు సుమారు 600 గ్రా?ల మట్టిని నింపి ఆపై విత్తనాన్ని పరచి ఆపై మట్టి మరియు ఎక్కువ పశువుల ఎరువు లేదా వర్మికంపోస్టు వేయడం ఆపై నీరు చిలకరించడం వరకు ఒకే కన్వేయర్ యంత్రం ద్వారా నిర్వర్తించవచ్చును. ఇలాంటి 80 ట్రేలు ఒక ఎకరా పొలానికి కావల్సివుంటుంది. ఈ ట్రేలను పొలంలో ఒక మూలన పలుచటి నీటిని కట్టి దాంట్లో వుంచి 15 నుంచి 25 రోజులు పెంచి నారును యంత్రం ద్వారా సమర్ధవంతంగా నాటవచ్చును. నారు నాటేందుకు ముందు పొలాన్ని బాగా దమ్ము చేసి, చదును చేసుకోవడం చాలా ముఖ్యం అంతేకాక పొలాన్ని ఆరబెట్టాలి.
నాటే ముందు పలుచగా నీరు పెట్టడం వల్ల వరి నారు నాటే యంత్రం సులువుగా నడిపేందుకు ఈ యంత్రం ద్వారా నాటినపుడు 8 సాళ్ళలో ఒకే మారు నాటడం జరుగుతుంది. ఈ యంత్రం ద్వారా రోజుకు 2-6 ఎకరములు వరినాట్లను వేయవచ్చును. వ్యవసాయ కూలీలు ఖర్చు సుమారు 45 శాతం తగ్గుతుంది. దీని ఖరీదు రూ. 2,75,000/- నుండి రూ. 18,00,000/- వరకు ఉంటుంది.
Also Read: Water Saving Tools: పొలంలో సాగు నీటిని ఆదాచేసే పనిముట్లు.!