యంత్రపరికరాలు

Dryers Types: డ్రైయర్లలో రకములు.!

1
Rotary Dryer
Rotary Dryer

Dryers Types – ష్యాక్ డ్రైయర్:- ఈ విధానమునందు ఒక పెద్ద గదిలో నేల పై భాగమున పెద్ద పెద్ద గాడులు తయారు చేసి వాటి పై రంధ్రములు కలిగిన స్టీలు రేకులను అమర్చుదురు. బయటనుండి అయిల్ ఇంజనును లేక కరెంట్ మోటరు ద్వారా నడుపబడు బ్లోయర్ ద్వారా గాలిని గదిలోనికి పంపుదురు. ఈ గాలి వివిధ గాడుల ద్వారా మరియు స్టీలు రేకులపై రంధ్రముల ద్వారా సంచిలోయున్న గింజలకు తగిలి గింజల తేమ శాతమును తగ్గించును.

ఈ పద్దతియందు సంచులను కొంతసేపు ఆరనిచ్చిన తర్వాత సంచులను తీరుగవేయవలయును. ఈ విధముగా చేయుటవలన గింజలు సమముగా ఆరును. సాధారణముగా 45 °c గల వేడి గాలిని బ్లోయరు ద్వారా గాడులలోనికి ప్రవహింపజేయును.

ఈ పద్దతి ద్వారా తక్కువ పరిమాణములో గింజలను ఆరబెట్ట వచ్చును. వివిధ రకముల గింజలను మరియు ధాన్యములను ఒకేసారి ఆరబెట్టుటకు వీలు కలదు. ఎందుకనగా సంచులలో ఆరబెట్టుట వలన గింజలు కలిసి పోవుటకు వీలుకాదు.

Also Read: Compost Preparation: గ్రామీణ కంపోస్ట్ తయారీ విధానం.!

Dryers Types

Dryers Types

బ్యాచ్ డ్రైయరు:- ఈ పద్ధతి యందు గింజలకు విడిగా కాని పద్ధతి యందు గింజలకు చలనము యుండదు టన్ను నుండి 10 టన్నుల వరకు గింజలను అనగా 1 నుండి 2 టన్నుల వరకు గింజల బ్యాచి డ్రైయర్ లు అని అంటారు. ఎక్కువ ఉపయోగించు డ్రైయర్లను బిన్ డ్రైయరులు అని అంటారు. దీర్ఘ చతురస్రాకారము, మరియు క్రమషడ్బుజి ఉండి వాటిని ఒక స్థలము నుండి మరియొక స్థలమునకు తీసుకుపోవుటకు అనువుగా ట్రాన్సుపోర్టింగ్ విల్సు అమర్చబడి యుండును.

రోటర్ డ్రైయర్:- ఈ డ్రైయరు ద్వారా గింజలను బస్తాలలో ఉంచి లేక కంటన్వువస్ ప్లో డ్రైయర్ లో ఉంచిగాని చిలింఫజేసీ ఆరబెట్టుట గింజలను ఆరబెట్టుదురు. దీనియందు తిరుగుచున్న ఒక డ్రమ్ము యుంటుంది. ఈ డ్రమ్ము 2 మి వ్యాసము కలిగి 5 నుండి 6 మి పొడువు కలిగి యుండును. దీనిని ఏటవాలుగా యుండునట్లు అమర్చుదురు.

ఇది ఏటవాలుగా నిర్మించబడి యుండి ఒక ఇరుసు పై తిరుగునట్లు చేయబడి ఉండును. హాపరు ద్వారా గింజలను లోనికి పోసి డ్రమ్ము తిరుగుచుండగా దిగువ భాగమున గల ద్వారా గుండా వచ్చి ఏర్పాటు కలదు. ఈ విధముగా గింజలు దిగువకు వచ్చునపుడు దీనిలోనికి ప్రవహింపజేయు గాలితో కలసి గింజలలోని తేమ శాతము తగ్గించుటకు వీలు అగును. గింజలు మరియు వేడిగాలిని ఒక ప్రక్కనుండి గాని లేదా రెండు ఒకదానికి ఒకటి ఎదురుగా ప్రవహింపజేయవచ్చును. గింజలలోని తేమ నిర్ణీత శాతము వచ్చే వరకు డ్రైయర్ ను అవిచ్చిన్నముగా లేక ఆగకుండా వాడవచ్చును.

Also Read: Sheep Farming: గొర్రెల పెంపకం.!

Leave Your Comments

Aster Amellus Cultivation: డేసి పూల సాగులో మెళుకువలు.!

Previous article

Silkworm Farming: మల్బరీ సాగు.!

Next article

You may also like